కరోన విలయ తాండవం

కరోన విలయ తాండవం

రచన ::సావిత్రి కోవూరు

కరోనా కరోనా ఎంత కఠినాత్మురాలవే కరోనా,
కలలన్ని వమ్ము చేసి కరోనా, కాల రాయ వచ్చావా కరోనా,

బీదా గొప్ప బేధం లేక,  కుల మత తారతమ్యం లేక, అందరినీ కలచివేసి, కబళింప వచ్చావా కరోనా,

బడులు, గుడులు బందు చేసి, బంధనాలు ఏర్పరచి జీవితమే కల్లోలం చేసి, జీవనోపాదులు లేకుండ చేసి,
జీవశ్చవాలుగ మార్చి, తరలి పోతున్న అసువులను తమాషాగా తరచి చూస్తు,

జలగ లాగా పట్టి పట్టి పక్షములు విప్పదీసి
తీక్షణమైనా చూపులతో ప్రాణాలు పీల్చి వేసి

పసివాళ్ళను అనాధలను చేసి,విలయ
తాండవము చేసి,

బంధాలు, అనుబంధాలకు అతీతము చేస్తున్న కరోనా,

బిడ్డకు తల్లిని దూరం చేసి, భర్తకు భార్యను దూరం చేసి,

బాంధవ్యాలను మాయం చేసి మహమ్మారిలా దాపురించిన కరోనా

మాస్కులు, శానిటైజర్లే శరణ్య మంటూ,
మనుషులకు, మనుషులనే దూరం చేసి,

కషాయాలలే కరోనాకు మందులుగా చేసి,
మహమ్మారిలా వచ్చావే మమతలు దూరం చేసావే.

ఇకనైనా ఓ విశ్వేశ్వరా! వినోదము చూడక, ప్రేక్షకపాత్ర వహించక,

నీ కరుణాక్షువులు తెరచి, లోకాన్ని రక్షించి సుభిక్షం చేసి,
మమ్మల్ని రక్షణ చేయ, తక్షణమే లక్ష్యము చూపుమా కరుణాక్షా

నిర్లక్ష్యం చేయక లక్షలాది జనుల ప్రాణాలను  భక్షణంబుల మాన్ప రావయ్యా

దక్షిణం బియ్య మాకు దక్కింది లేదు, ఓ జగద్రక్షకా! మమ్ము జాగు చేయక రక్షించ వయ్యా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!