నాన్న ఓ స్పూర్తి ప్రదాత


Father’s day special… నాన్న ఓ స్పూర్తి ప్రదాత

త్వమేవాహమ్

✍️మక్కువ. అరుణకుమారి

****************************************

అమ్మ చెప్పిన ప్రేమబంధం నాన్న
పరిచయమే అక్కర్లేని ప్రాణబంధం నాన్న
అహర్నిశలు వెన్నుతట్టే అప్యాయత నాన్న
పరిపూర్ణత అందించే ప్రాణసఖుడు నాన్న

నడకలు నేర్పేది అమ్మయితే నడతను నేర్పేది నాన్న
బంధాలు కలిపేది అమ్మయితే బాధ్యత గరిపేది నాన్న
ఇంటిని దిద్దే “గృహరాణి”అమ్మయితే ఇంటివారిని తీర్చదిద్దే “మహారాజు” నాన్న

ఉబికివచ్చే కన్నీళ్ళను కన్నెర్రచేసి దాచేస్తాడు
దరికివచ్చే బాధలను పంటిబిగువున భరిస్తాడు
ఇష్టాలనన్ని అయిష్టాలంటూ దాటేస్తాడు
ఎగిసిపడే కష్ట,సుఖాల సాగరాన్ని అలుపే లేక ఈదేస్తాడు

అహంబ్రహ్మస్మి” అనడమే తెలియని నాన్న
త్వమేవాహిమ్”అంటూ తనవారిక కొవ్విత్తిలా కరిగి నీరవుతాడు
కొండంత వెలుగులు పంచే గోరంతదీపం”అవుతాడు

నాన్నంటే ఎగిసే శౌర్యం
నాన్నిచ్చే మనోస్ధైర్యం
నాన్నుంటే కొండంత ధైర్యం
నాన్నంటే సంద్రమంత గాంభీర్యం


✍️ మల్లాదిసోమేశ్వరశర్మ

********************

నాన్నొక జీవనవేదం!
నాన్నొక మహా ప్రపంచం!
నాన్నొక జీవన సత్యం!
నాన్నొక కరిగే కొవ్వొత్తి!
నాన్నొక పరమ సత్యం!
నాన్నొక నడచే దైవం!
నాన్నొక అపర బ్రహ్మ!


నాన్న–✍️సుశీల రమేష్

*********************

ఆకాశమంత నిర్మలంగా ను

సముద్రమంత గంభీరంగా ను

అగ్నిపర్వతం అంత నిబ్బరంగాను

నిస్వార్ధంగా ఆలోచించేది నాన్న.

నాన్న ప్రేమను అంచనా వేయలేను

నాన్న ప్రేమ లోని గాఢత లోతెంతో

తెలిస్తే నా గుండె బరువెక్కుతుంది.

మరో జన్మంటూ ఉంటే నీకు తల్లిగా జన్మిస్తాను నాన్న.

నా తండ్రి హృదయ సామ్రాజ్యానికి నేను మకుటంలేని మహారాణి ని

పితృదేవోభవ 🙏

***************************

కార్గిల్ యుద్ధంలో తమ తండ్రిని కోల్పోయిన నాలాంటి కూతుర్లకు ఈ నా కవిత అంకితం. 😭


నాన్న –✍️నాగమయూరి

********************

త్యాగానికి ప్రతిరూపం నాన్న
బాధ్యతకి మారుపేరు నాన్న

అడిగినంతనే లేదనక కాదనక
రేయిపగలు చూడక అలుపెరుగక
శ్రమించే శ్రమజీవి నాన్న

నాన్న మాటలలోనే కాఠిన్యం
చేతలలో ఉండదు ఆకాఠిన్యం
నాన్నమనసు రాయిలా కనిపిస్తుంది
తీరాచూస్తే వెన్నలా కరిగిపోతుంది


రక్ష కదా! నాన్నంటే!!✍️గుడిపూడి రాధికారాణి

****************************************

రక్ష కదా! నాన్నంటే!!

ఎండవేళ నా గొడుగుగ
ఆకసాన అందమైన వెండిమబ్బు మా నాన్న!
నే తప్పు చేస్తే
ఉరుములాంటి గద్దింపే మా నాన్న
నే హద్దు మీర
పిడుగు వంటి గర్జనయే మా నాన్న!
జీవితాన నా గెలుపుకు
నింగిలోన పొంగిపోవు హరివిల్లే మా నాన్న!
అడుగులు తడబడిన వేళ
తళుకుమంటు దారిచూపు మెరుపుతీగ మా నాన్న!
అత్తింటికి నన్ను పంప
ఆత్మీయపు అంపకాల కన్నీటి చుక్క మా నాన్న!
శిశువును నే ఎత్తువేళ
దీవిస్తూ హర్షంతో వర్షించెను మా నాన్న!

నింగిలోని ఆ రవియే అనునిత్యం కాచినట్లు
కనురెప్పల కౌగిలింత కంటితడిని కాచినట్లు
ఎల్లవేళల కాపాడే రక్ష కదా అమ్మా,నాన్న!


నాన్నంటే నాన్నే…అంతే! ✍️దోసపాటి వెంకట రామచంద్రరావు

***************************************

నాన్నంటే నాన్నే….అంతే!
నాన్నంటే నమ్మకం
నాన్నంటే భరోసా
నాన్నంటే విశ్వాసం
నాన్నంటే బాధ్యత
నడిచే దైవం
నాన్నంటే స్నేహితుడు
నాన్నంటే మార్గదర్శి
నాన్నంటే అమృతమూర్తి
నాన్నా జన్మదాత.


మరో అమ్మ ✍️మంజీత కుమార్

*************************************

మంచితనమే ఆస్తి
మానవత్వమే స్ఫూర్తి

పైకి మహా గంభీరం
మనసులోన మమకారం

కోపం ఎరగని శాంతమూర్తి
స్వార్థం తెలియని మహాఋషి

అమ్మ తర్వాత మరో అమ్మ
కనిపించే దైవం నువ్వే నాన్న

తీర్చుకోలేము నీ రుణం
మా జీవితం నీ పాదాలకు అంకితం


♥️ నాన్న ఎంతటోడో..! ♥️

✍️సత్య కామఋషి ‘ రుద్ర ‘

****************************

నా’వ’న్న’వి, ‘నా’కు’న్న’వి
‘నా’కని చూసుకోక,
‘నా’కిచ్చిన మి’న్న’కాడు.!

‘నన్ను’ నన్నుగా మలచేందుకు
తనను తాను తగ్గించుకుంటూ
నా ఉన్నతి కోసం.,
అది నాకందిచుట కోసం.,
తానే సోపానమైన త్యాగధనుడు.!

దిగమింగలేని దుఃఖాన్ని గొంతు
దాటనీయడు…నాన్న నీలకంఠుడు.!
మోయలేనంత భారమైనా కనుపాప
కొనల నుండి జాలనారనీయనక,
భరించు ఓరిమిగల గోవర్ధనగిరిధారుడు.!

స్వార్థమెరుగని వెర్రివాడు,
తన బ్రతుకు తాను చూసుకోలేడు.!
ఎంతటోడో కద నాన్న..
అనంతాన్ని నాకందించాడు..!
తనకు తానుగా కరిగిపోయి,
తరగని వెలుగై..చెదరని భవితై,
నిత్యం నాతోనే ఉన్నాడు.,
తనను నాలో నిలుపుకున్నాడు.!


ఎంత మంచోడో మీ నాన్న

✍️విజయ మలవతు

****************************

ఎంత మంచోడో మీ నాన్న …
ఇలా అందరూ పొగుడుతుంటే ఉప్పొంగిన ఛాతితో ఏదో అవార్డ్ దొరికినంత ఆనందం
ఆ నాడు…

నాన్న పేరు రాయడం తొలిసారిగా నేర్చుకుని చూపిన సమయాన…
అందులో తప్పులు సరిదిద్దడం కనుల ముందు తిరుగాడుతున్నదే నేటికీ..

అన్ని తప్పులను సరిదిద్దేస్తారు అనే నమ్మకం ఆ రోజు…
కానీ విధాత రాత ను చెరపడం నాన్నకు కూడా కుదరదని తెలిసింది నేడు ..

ప్రతి బాధ సంతోషంలో నాన్న ఒక తోడు నీడేగా.. జీవితంలో అంతకు మించి వేరే అవసరమే లేదనే భరోసా నేడు…

చిన్ననాటి రోజులే బాగుండేవేమో
అమ్మ నాన్న ల గారాభంతో ఏ చీకు చింతా లేకుండా గడచిన ఆ రోజులు…

ఈ రోజు గతం గుర్తుతెచ్చుకోవడం కూడా
బాగానే ఉంది లే …

These lines are dedicated to my పెదనాన్నలు, నాన్న , అయ్య  Happy father’s day to all great father’s🙏💐


మహోన్నత శిఖరం నాన్న..! ✍️ పిల్లి హజరతయ్య

****************************

ఆకలి దేహాన్ని దహిస్తున్నా
అవయవాల పనితీరు నశిస్తున్నా
చావు కంటిముందు కదలాడుతున్నా
కరుగుతూ వెలుగునిచ్చే త్యాగమూర్తి ..!

కుటుంబంలో ఆటుపోట్లు ఎదురైనా
జీవితంలో ఓటమి వెక్కిరించినా
బిడ్డల రేపటి భవిష్యత్తుకై
బాధను పెదవి దాటనివ్వని సహనమూర్తి..!

ఓర్పు,సహనానికి మారుపేరై
ఆశలు,ఆకాంక్షలు తీర్చే
మహోన్నత శిఖరము నాన్న..!


అనుభవపాఠాలు

✍️వడ్డాది రవికాంత్ శర్మ

**********************************

పదాలు రాక కవిత్వం ఆలస్యమయ్యే నాడు ..
అనుభవపాఠాలు ఆయన నుండే నేర్చుకున్నాను ..
బిరుదులేమో నాకు …
బరువైన బల్లెం లాంటి మాటలేమో ..
ఆయన హృదయ సామ్రాజ్యంలో నిత్యం రుధిర నదిని పారించేలా ….నాన్నతో నేను


✍️క్రాంతి కుమార్(ఇత్నార్క్)

**********************************

నేను వేసిన తొలి అడుగు నాన్న గుండెలపై
నేను ఎక్కిన తొలి శిఖరం నాన్న భుజాలు
నేను చూసిన తొలి బాధ్యత నాన్న ప్రేమ
నేను నిజం చేసిన తొలి కల నాన్న కన్న కల

నేను చూసిన తొలి పోరాట స్ఫూర్తి నాన్న ధైర్యం
నేను పొందిన తొలి ఓదార్పు నాన్న మాటల్లో
నేను చూసిన తొలి పట్టుదల నాన్న కృషిలో
నేను సాధించిన తొలి విజయం నాన్న నవ్వు

నాన్న నన్ను కోరిన తొలి కోరిక
నా పెదవులపై చెదరని చిరునవ్వు
నాన్నకు నేను ఇవ్వగలిగే అతిపెద్ద బహుమానం
నా పెదవులపై విరబూసే చిరునవ్వు


నాన్నే నా ప్రాణం

✍️పుల్లూరి సాయిప్రియ

**********************************

నాన్న..
అది ఒక పదం కాదు,ఒక వరం, ఒక బంధం..రక్త సంబంధం.
అది మన ధైర్యం, మన బలం, మన బలహీనత.
అంతటి విలువను కలిగినది “నాన్న” అనే పదం.
తన గురించి మాటల్లో చెప్పాలంటే మాటలు సరిపోవు,
రాతల్లో రాయడానికి పదాలు సరిపోవు, నాకు ఈ జన్మ సరిపోదు.
మనల్ని తన గుండెలపై హత్తుకొని, చిన్న చిన్న అడుగులు వేపిస్తూ.. మనల్ని అలా చూస్తూ మురిసిపోయేవాడు “నాన్న”.
తన కష్టాన్ని కూడ లెక్కచేయకుండా మనకోసం ఎప్పుడు, ప్రతి నిమిషం కష్టపడుతూనే ఉండేవాడు ఒక్క “నాన్న” మాత్రమే.
ఎంతటి భాద కలిగిన, ఎంత కష్టం వచ్చిన తన కన్నీరును సైతం బయటకి రానివ్వకుండా తన కనురెప్పల చాటున దాచేవాడు “నాన్న”.
మనం పుట్టినప్పుడు కంటె మనం ప్రయోజకులుగా మారినప్పుడు అందరి కంటె ఎక్కువగా సంతోష పడేవాడు “నాన్న”.
“నాన్న” మనకి ఇతరులకు సహాయం చేసె గుణాన్ని ప్రసాదించాడు. అది చాలు మనకు మనం చనిపోయెంత వరకి.
నాకు మళ్లంటూ జన్మే ఉంటే నేను నికు కూతురుగా.. నువు నాకు నాన్నగానే పుట్టించమని ఆ భగవంతుడుని ప్రార్థిస్తాను “నాన్న”.

***లవ్ యూ నాన్న*** 💐 HAPPY FATHERS DAY TO ALL GREAT FATHERS💐💐


ఓ నాన్నా నీ ప్రేమ ✍️నారుమంచి వాణి ప్రభాకరి

**********************************

ఓ నాన్నా నీ ప్రేమ అపూర్వం
ఆయుర్వేద దిట్ట గా ఎన్నో భాద్యతలు విద్యలు నేర్పి
సమాజ సేవకు విస్తృత స్థాయి
వైద్యానికి శ్రీ కారం చుట్టి ఒక
విజ్ఞాన గని లాగ తీర్చి దిద్ది తాతల నాటి వై ధ్య విద్యకు
విలు వై న ప్రమాణాలతో సేవ
చేసే విశాల భావంతో పెంచిన
మీకు సదా అనంద వందనాలు


మా నాన్న ✍️పి. వి. యన్. కృష్ణవేణి

**********************************

చూపుల్లో అభిప్రాయం
మనసులో మమకారం
ఎవరికీ దొరకదు సహకారం
అదే మా నాన్న గొప్పతనం.

ప్రేమను పంచుతూ
మమతను పెంచుతూ
భాద్యత నేర్పుతూ
తనకు తానే సాటి అవుతారు

మాటలు తక్కువ
అనుభవం ఎక్కువ
అందుకే మా నాన్న నాకు ఆదర్శం


త్యాగ మూర్తి ✍️సావిత్రి కోవూరు

**********************************

జన్మ ఇచ్చిన యట్టి పరబ్రహ్మయే నాన్న జీవితాన్నిచ్చిన జీవితేశ్వరుడే తాను
లోకాన్ని చూపిన లోకేశ్వరుడు నాన్న
గమనాన్ని చూపేటి దిక్సూచి తాను
గమ్యం నిర్దేశమున గురువైన నాన్న
జీవితమును నడిపేటి సారథే తాను
ఆటలాడు వేళ అశ్వమే తానౌను
తప్పటడుగులు వేస్తే ఉగ్ర నరసింహుడే నాన్న
ఆలు బిడ్డల ఆకలి తీర్చేటి అన్నపూర్ణ  తాను
తన సుఖము ఎరుగని త్యాగమూర్తే నాన్న


నాన్నంటే ✍️నెల్లుట్ల సునీత

**********************************

శ్రమ పొద్దుల్లో పొడిచిన
భానుడు నాన్న

కొండంత అండ నాన్న
అందరి అవసరాలు తీరుస్తూ
జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తూ
దారి చూపేది నాన్నేగా

వెలుగు రేఖల్ని
ప్రసరింప చేసి
అంధకారాన్ని పారదోలే
దివ్యజ్యోతి

త్యాగాలకు ప్రతిరూపం
నాన్నే భగవంతుని స్వరూపం
నమ్మకానికి నమ్మకంగా
సహనానికి స్ఫూర్తిగా

ఆత్మీయతకు ప్రతీకగా
ఆనందానికి ఆలంబనగా
వెన్నుతట్టే ప్రోత్సాహమై

ధర్మ మార్గాన్ని సూచించే
మార్గదర్శి
జీవిత పాఠాలు బోధించే
ఆది గురువు

తప్పటడుగుల్ని సరిదిద్ది
గుండె మాటులో బాధల్ని దాచి
కుటుంబ రక్షణ కవచంగా

ఏ కష్టమొచ్చినా నీకు
నేనున్నాను అంటూ
భరోసా ఇచ్చే బాధ్యత నాన్నంటే


నాన్న ✍️మోదేపల్లి. శీనమ్మ

**********************************

అణువులా అమ్మ కడుపులో ఉన్నప్పుడే కమ్మని కధలు చెప్పిన మా నాన్న
కష్టాల కావిడిని మోస్తూ ఇష్టంతో ముచ్చట్లు చెప్పి మురిపించేవాడు
మంచు తెరలపై తాను నిల్చుని చల్లదనం నాకు పంచేవాడు
ఆడించు సమయాన రెక్కలగుర్రంలా
మారి ఇల్లే ప్రపంచంలా తిప్పేవాడు
నాన్నే… ధైర్యంలా బతుకుతున్న మాకు
అర్ధాంతరంగా దూరమై మమ్ము తన జ్ఞాపకాలను మధురస్మృతులుగా గుర్తుచేసుకుని బతికేలా చేసిన కారుణ్యమూర్తి మా నాన్న


అర్పింతు (మా) హృదయ కంకణం ✍️ శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

**********************************

నా ఉనికికాధారమే నీవు .
నా నడకలకి ఊతమైనావు
విలువైన చక్కని సుగుణం తో
నా నడతకాదర్శమైనావు

పైకి గంభీరంగా ఉన్నా
అంతః మనసును చూస్తే వెన్న
నీవు కొవ్వొత్తి లా కరుగుతూ
మాకు వెలుగవయ్యావా నాన్న

నీవు ప్రేమించుటలొ అమ్మ లా
క్రమశిక్షణ నేర్పే గురువులా
అకుంఠిత దీక్షా తత్పరతతొ
మలచితివి మము సాంతం మీలా

కష్టాలను కడుపున దాచుకుని
బాధ్యతనె ఆసరా చేసుకుని
మా కోసమే బ్రతుకుతున్నావా
నీకుగా నువ్వు అర్పించుకుని

తీర్చగలమా అసలు నీ రుణం
శిఖరమెత్తునున్న కారుణ్యం
కనీ,పెంచిన మా దైవమునకు
అర్పింతు(మా) హృదయ కంకణం


✍️ By G V NAIDU

**********************************

F: Forever
A: Associate
T: Take carer
H: Humanitarian
E : Enlighter
R: Role model
S: safer
D: Dearness
A: Affectioner
Y: Yielder

Declaration : I do assure you that the above Lyrics is my own composition.


మా దైవం ✍️జయకుమారి

**********************************

నిలువెత్తు ప్రేమకు ప్రతిరూపం మా నాన్న.
నిస్వార్ధపు హిమశికరం మా నాన్న.
ఓనమాలు నేర్పిన గురువు మా నాన్న
సభ్యత, సంస్కారం, క్రమశిక్షణ,
జీవితపువిలువలు నేర్పే ఆచార్య మా నాన్న.
నిశీధిలో వెలుగు రేఖ నాన్న.
నిధురించు వేళ కమ్మని జోలపాట మా నాన్న
మా విజయంలో మొదటి అడుగు మా నాన్న
మా కష్టంలో ఓదార్పు మా నాన్న.
మా ఆత్మసైర్థ్యం మా నాన్న
తీరని రుణం అయ్యి మమ్మల్ని నడిపించు మా దైవం నాన్న.
పితృదినోత్సవ శుభాకాంక్షలు💐💐


నాయిన పోటో ✍️పి.సుష్మ,మక్తల్

**********************************

జాతర్ల నేను తప్పిపోయినట్టే
నా జిందగిలా మా నాయిన తప్పిపోయిండు
బీడీ పొగలలో కాసింత ఊపిరి తాలుక వాసనను మిగిల్చిపోయిండు
రచ్చకట్టకాడ కూసున్న సోటును
ఖాళీగా వదిలేసిపోయిండు
నల్గురు కూసున్న సోట
ముచ్చటకు మూల్గుతూ ఆడనే ఉండిపోయిండు
గుమ్మం ముందు కూసున్న నాయినా
మడత కుర్సీలోనే మాయమయ్యిండు
కళ్ళజోడు బల్ల మీద పెట్టి
కలకంటూ మంచంలోనే కాలం అయ్యిండు
పొలం పోయిన నాయిన
ఇంటికి రాకుండా
పొలం గట్టునే పడుకుండిపోయిండు
పొద్దుపోగానే ఎగిరిపోయే కొంగలా
మా నాయినా కాలంతో పాటే పయనమయ్యిండు
మంచి అని ఇంటి గోడల మీద విలునామ రాసిపోయిండు
అందుకే
నల్గురి నాల్కల మీద
మా నాయినా చెప్పిన మాటలు ఇంకా నడుస్తున్నాయ్
ఎక్కడెక్కడో తప్పిపోయిన మా నాయినా
నడిమింట్ల నవ్వుతూ
నన్ను నడిపిస్తూ
జ్ఞాపకంలా ఫోటో ఫ్రేమ్లో దాక్కున్నాడు


నాన్న ✍️ డి. స్రవంతి

**********************************

**ప్రేమానురాగాల అనుబంధం నాన్న
అన్నీ తానే అయి నడిపించెను
అందనంత ఎత్తుకు నను చేర్చాలనే నీ తపన
నిన్ను నీవు మర్చిపోయి యుద్ధమే చేశావు
నా కలల్ని నీ కలలుగా చేసి నా జీవితాన్ని నిలిపి
నా గమ్యని పరిచయం చేశావు
నా ప్రగతికి సోపానం నువ్వు
నా జీవన పరమార్థం తెలిపిన విధాత..
నీవే నాకు ఆదర్శం నాన్న
నేను ఎప్పటికీ చదవాలనే ఒక మంచి పుస్తకం నాన్న.

పితృ దినోత్సవ శుభాకాంక్షలు


రూపం ఇచ్చిన దేవుడు ✍️బండారు పుష్పలత

**********************************

నాన్న నాకు జన్మ నిచ్చావు
నువ్వే నా చిరునామాయ్యవు నువు కనకపోతే నాకు ఈ లోకమెతెలియదు
అమ్మ తొమ్మిది నెలలు మొసీ దించుకుంటుంది.
జీవికి జీవంపోసి జీవితాన్ని ఇచ్చేది నాన్న
మేముఎన్నేళ్ళైనాబాగు
పడేవరకు విసుగులేకుండా మోస్తూనే వుంటావునాన్న
తెరముందు మేము వేసే ప్రతినాటకానికి తెరవెనుక నీకష్టం దాగివుంటుంది నాన్న
అద్దం లో ప్రతిబింబం చూసుకోక మారూపంలో నీ ప్రతిబిభాన్ని చూసి మురిసిపోతావు
మాకు తిండి పెట్టడానికి నువు ఎన్నిసార్లు పస్తులున్నవో మనింటి కాలి పళ్లెం చెపుతుంది నాన్న
నాతప్పటడుగులు సరిదిద్ది
నాబంగారు బవిశ్యత్తుకు దారులు వేస్థావుననాన్న
మమ్మల్ని ఆనందంగా ఉంచడానికి నీచిన్నచిన్న సంతోషాలని ఫణంగా పెట్టావునాన్న
మాకు అటనేర్పేదినువ్వు
జీవిత పాఠం నేర్పేదినువ్వు మానవ్వుచూసి మురిసేది నువ్వు
ఆశలకు ఆయువు నింపేది నువ్వు
ఊహలకి ఊపిరి పోసేదినువ్వు
ఆపదలో అనురాగ శీలినువ్వు
మా కళల సహకారానికి ప్రాకారాలు గా నిలిచేవునాన్న
చిన్న నాడు భుజాలపై మోసిననాన్న ఎప్పుడు వెన్నంటి ఉండి నడిపిస్తాడు
ఇన్ని చేసిన నాన్న ఎన్నడూ వెనక బడే ఉంటాడు
అన్ని బంధాల పిలుపును ఎవరినైనా పిలిచి తృప్తి చెందవచ్చు కాని
నాన్నఅనే నేపిలుపు నాన్నని తప్ప ఎవ్వరిని పిలువలేనిది నిరంతరం కుటుంబం కోసమే శ్రమించే శ్రమజీవి నాన్న
నాన్న విలువ నాన్న అయితేనే తెలుస్తుంది
ఇంత త్యాగశీలి నాన్నను ఏమిచ్చావని అడగకు ఎలా నాన్నరుణం తీర్చుకో వాలని చూడు…


 నాన్నకు ప్రేమతో ❤️❤️❤️❤️

✍️ పద్మావతి తల్లోజు

**********************************

నాన్నా…!
నీవు మోసే బరువును కనిపించనియ్యవు,
బాధ్యతను తప్ప!
కంటనీరు ఆపుతావు,
చిరునవ్వుల చెలియలి కట్టతో..,
సహధర్మచారిణినీ సర్వస్వం నీవై నడిపిస్తావు
నిన్ను కన్న వాళ్లను చేయూతనిచ్చి
బ్రతికించుతావు!
నీవు కన్నవాళ్లకు చేతనైనంత చేసి,
బ్రతుకునిస్తావు!!
అద్వితీయం నీ పయనం!
నీవు లేని జగతి శూన్యం!!


నాన్న ✍️ జ్యోతిరాణి

**********************************

నాన్న నువ్వొక నిలువెత్తు
నిదర్శనానివి మా జీవితానికి
నీ ప్రేమ వెలకట్టకేని సంద్రం
నీ ముందుచూపు ఆకాశమంత విశాలం
నీ మనసు వెన్నపూస
నీ గుణం బోలాగుణం
నీ కోపం క్షణికమైనది
నీ ప్రతివిజయపు నడకవెనుక
ఎన్నో అపజయపు తడబడిన అడుగులు
నీ సంకల్పం వెనుక
మనసుమూలాల్లో చెదరని
గుర్తులు మిగిల్చిన ఆనవాళ్లు
నిన్ను నడిపించిన అక్షరాలే
మమ్ము నడిపిస్తాయని
అహర్నిశలు మాకోసం
శ్రమించి అందులో
ఆనందం వెతుక్కున్న
నిస్వార్థమనసు నీది..
త్యాగానికి ప్రతిరూపంగా
నిలిచి మా నమ్మకం
బలంగా మా వెంటే ఉంటూ
మమ్ము జీవితంలో
అన్ని ఒడిదొడుకులను
ఎదుర్కొనే మనోధైర్యం
నువ్వు బాపు…
విశ్రాంతిలేని నీ జీవితపుస్తకంలో
ఇక పై అయినా నీ కంటూ
కొన్ని పేజీలు మలుచుకొని
ఆనందంగా ఆరోగ్యంగా
నవ్వుతూ మాతో
ఉండాలని మా ఆశ


నాన్న ✍️అమృతపూడి రేవతి

*********************************

నాన్నా నాచిన్ననాడు
నినుచూసి మురుశాను
నీప్రేమకలశం అమృతవర్షం
నాన్నానేను మారువలేదు

ప్రకృతి పచదనంనీమాడినుండే
ప్రేమాఆప్యాయతలునీమాడినిండే
ప్రకృతియైన ఎదునేమోకాని నీ
ప్రేమచల్లారాదు నాన్న

భాధ్యతలను బుజానమోశావు
బరువుఅనలేదు ఏరోజు
బీడుబారని నీప్రేమ
బెందురాదు నీప్రేమకి

ఇంటికి అందం నీ అలికిడి
ఇంటికి దీపం నీఆలోచన
ఇంటికి రారాజువి నాన్న
ఇకతిరిగిరాని కడకువెళ్ళావు

మరువలేదు నీ జ్ఞాపకాలు
మరపు రావు నీ జ్ఞాపకాలు

 


    నేనెలా ఉండను నాన్నా

✍️చంద్రకళ దీకొండ

*********************************

నా ముద్దుమాటలకు మురిసావు…
నేను పరుగెడుతుంటే కాళ్ళు అలిసాయేమోనని నొక్కావు…!

అడగకముందే నాక్కావాల్సినవి కొనిపెట్టావు…
పదేళ్లు దాటినా నన్నెత్తుకొని తిప్పావు…
పద్యాలు, కథలెన్నో నేర్పావు…
లోకజ్ఞానాన్ని కలిగించావు…
నా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దావు…!

“పొద్దెక్కేదాకా పడుకుంటే…
రేపు అత్తారింట్లో ఎలాగే…”
అని అమ్మ అంటుంటే…
“నా బంగారుతల్లిని ఇంకాసేపు పడుకోనీ…”
అని ప్రేమగా తల నిమిరావు…!

“అమ్మాయికి పెళ్ళీడొచ్చింది… పెళ్లి చేయాలి…”
అంటూ పోరు పెట్టే అమ్మతో…
“దాన్ని చదువుకోనీ… ఆడపిల్లకు చదువు ముఖ్యం…”అంటూ
నా ఎదుగుదలకు బాట వేసావు…!

బడిలో చేరిన మొదటిరోజు…
బండి రహదారిపై నడిపిన మొదటిరోజు…
ఉద్యోగంలో చేరిన మొదటిరోజు…
ఇలా…ఎక్కడైనా
నా తోడుగా వచ్చి…
జీవన పోరాటానికి ధైర్యాన్ని అందించావు…
రావడానికి ఆలస్యమై కబురు చేయగానే వెంటనే నేనున్న చోటికి వచ్చి వాలావు…!

ఇలా అన్నివేళలా…
నాకండదండగా నిలిచిన నిన్నొదిలి…
నిన్ను రోజూ చూడకుండా…
ఆ క్రొత్త ప్రదేశంలో…
క్రొత్త మనుష్యుల మధ్య…
నేనెలా ఉండాలి నాన్నా….?!?!?!


నాన్న ఎవరు అంటే

✍️లీలా కృష్ణ

*********************************

అమ్మ పరిచయం చేసిన ఆత్మీయ స్పర్శ నాన్న.
రేపటి రోజుకి దోవ చూపే దిక్సూచి నాన్న.
వెన్నంటి నడిచే బహుదూరపు బాటసారి ఈ లోకాన.
తన సర్వశక్తులకు లబ్ధిదారి, నేనే అని అంటున్నా.
నా తప్పులను ఎత్తిచూపే మొదటి శత్రువు నాన్న.
నాకన్నా ముందే లోకాన్ని చదివిన జ్ఞాని నాన్న.
నా కోసం వెలిసిన మూలధనం నాన్న.
నా డైరీలోని పేజీలకు సుపరిచితుడు నాన్న.
నాలో ధైర్యం నింపే ప్రథమచికిత్స నాన్న.
నా హృదయం నమ్మిన హామీపత్రం నాన్న.
నా కన్నీరుకి మా నాన్న అంటే భయం.
తను నను తీర్చిన తీరుకి మురిసెను దైవం.
నా అవసరాలు తీర్చే నిత్య అభయం.
నా గర్వానికి కారణం మా నాన్న వైనం.
తాతగారి పుత్రోత్సాహాన్ని నిలబెట్టింది, నాన్న నైజం.
తరాలు మారినా నాన్న తత్వానికి, లేదు ప్రత్యామ్నాయం.
ఏనాడూ తల్లిదండ్రులు అవ్వరాదు, భారం.
సశేషం ఎరుగదు వారి ఋణం.


జీవనమూర్తి

✍️వి. కృష్ణవేణి

*********************************

లోకాన్ని సృష్టించే బ్రహ్మను మించిన
ఆది దేవుడు నాన్న.
కుటుంబం అనే  ప్రపంచాన్ని సృష్టించి
అనురాగాన్ని, ఆప్యాయతను కురిపించే
మధురజ్ఞాపకం నాన్న
బరువుభాద్యతలను భుజాన్న మోస్తూ
ఎండనక, వాననక
రేయనక, పగలనక శ్రమించే
నిరంతర శ్రామికుడు నాన్న
బుడిబుడి అడుగులకు అలంబనచేస్తూ
తడబడుఅడుగులకు  సవరననిస్తూ
గెలుపు పరుగుకై చేయూతనిస్తూ
కుటుంబం పరువునే మదిలో దాస్తు
కష్టనష్టాలకు ఎదురీదుతూ
పిల్లల గెలుపే తన జీవిత పరమార్థమని
మురిసిపోతూ
జీవితము , బాధ్యత అనే పడవను లాగుతూ
కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేర్చేవరకు తనప్రయత్నాన్ని ఆపని అలుపెరగని బాటసారి
అలాంటి నాన్న జీవితం ఒక పునీతం
నాన్న ప్రేమ మరపురాని మధుర గీతం
నాన్న జ్ఞాపకం తరగని  నిదర్శనం
తరతరానికి నాన్న నిరంతరం
మనిషిపుట్టుకకు నాన్న ఒక వరం
సృష్టి ఆది అంతాలను చూడతరముగాదుగాని
నాన్న హృదయవేదనా చూడగలము.
నాన్న మన పిలుపు వెన్నతో పెట్టిన విద్య
జనన మరణాలమధ్య నాన్నజీవితం ఒక మిద్య.,..


దారి చూపిన నాన్న

✍️చంద్ర మలవతు

*********************************

నాన్న దండించేటప్పుడు తెలియలేదు
భవిష్యత్తుకు బంగారు బాట వేసే దిశలో దండన ముఖ్యమే అని..
జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో
ఈ హెచ్చరికలే ముందు మాటలు గా నిలుస్తాయి అని..
మార్గదర్శకులుగా ఉంటూ నన్ను ప్రోత్సహించిన  అయ్యలకు ..🙏
నాకై ఎన్నో త్యాగాలను చేసిన మా నాన్న
దిశా నిర్ధేశకుడిగా స్పూర్తి ప్రదాతగా దారి చూపిన  
నాన్నకు నా నమస్సులు..🙏🙏


మా నాన్న ✍️ఎన్.. రాజేష్

*********************************

లోకాన్ని సృష్టించే బ్రహ్మను మించిన
ఆది దేవుడు నాన్న.
కుటుంబం అనే  ప్రపంచాన్ని సృష్టించి
అనురాగాన్ని, ఆప్యాయతను కురిపించే
మధురజ్ఞాపకం నాన్న
బరువుభాద్యతలను భుజాన్న మోస్తూ
ఎండనక, వాననక
రేయనక, పగలనక శ్రమించే
నిరంతర శ్రామికుడు నాన్న
బుడిబుడి అడుగులకు అలంబనచేస్తూ
తడబడుఅడుగులకు  సవరననిస్తూ
గెలుపు పరుగుకై చేయూతనిస్తూ
కుటుంబం పరువునే మదిలో దాస్తు
కష్టనష్టాలకు ఎదురీదుతూ
పిల్లల గెలుపే తన జీవిత పరమార్థమని
మురిసిపోతూ
జీవితము , బాధ్యత అనే పడవను లాగుతూ
కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేర్చేవరకు తనప్రయత్నాన్ని ఆపని అలుపెరగని బాటసారి
అలాంటి నాన్న జీవితం ఒక పునీతం
నాన్న ప్రేమ మరపురాని మధుర గీతం
నాన్న జ్ఞాపకం తరగని  నిదర్శనం
తరతరానికి నాన్న నిరంతరం
మనిషిపుట్టుకకు నాన్న ఒక వరం
సృష్టి ఆది అంతాలను చూడతరముగాదుగాని
నాన్న హృదయవేదనా చూడగలము.
నాన్న మన పిలుపు వెన్నతో పెట్టిన విద్య
జనన మరణాలమధ్య నాన్నజీవితం ఒక మిద్య.,..


సృష్టించిన నాన్న ✍️సుజాత

*********************************

నాన్న సముద్రం అమ్మ తొణకని నిండు కుండ
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎదుర్కొనే ధైర్యం నాన్నది.
కష్టాల్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి ధైర్యం చెప్పేది అమ్మ
నాన్న బాధను ఓర్చుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ
పిల్లల  బాగోగులను చూడాలనే తాపత్రయం నాన్నది
నాన్న తెచ్చింది పొదుపుగా వాడి నాన్నకు చేదోడుగా
కష్టాల్లో పాలుపంచుకునేది అమ్మ
బిడ్డకు చిన్న కష్టం వచ్చిన తల్లడిల్లే నాన్న
దానికి నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్తూ  పరిష్కారమార్గము చూపేది అమ్మ.
అమ్మ నాన్నలు లేనిదే జీవితం లేదు
వారు లేనిదే ప్రపంచం లేదు ఎది జయించలేము.
ఏది సాదించాలన్నా వారి ఆశీర్వాదం ఉంటేనే మనకు మనుగడ
అమ్మా నాన్నలిద్దరూ పెద్ద మహా వృక్షం
అమ్మా నాన్నలకు వందనం
మీకు అంకితం మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా


నడిచే నక్షత్రం నాన్న 

✍️రవికుమార్ M

*********************************

నీ ప్రతి ఆనందం వెనుక ఉన్నది.. మీ నాన్న..

నీ ప్రతి ఇష్టాన్ని.. తన కష్టం తో తీర్చే వాడే నాన్న

అమ్మ ప్రేమ అందరికి తెలుస్తుంది కానీ…..
నాన్న ప్రేమ.. నువ్వు నాన్న అయ్యాకే తెలుస్తుంది

అమ్మ ప్రేమ చందమామ లాంటిది.. హాయిగా అందరికి కనిపిస్తూ.. జోలపాటలా ఉంటుంది

నాన్న ప్రేమ… నక్షత్రం లాంటిది…

తన గుండెల్లో మండే బాధలు ఎన్ని ఉన్నా…

నీకు వెలుగు నిచ్చి దారిచూపించే… దిక్సూచి నాన్న

 


నాన్న లేనప్పుడు....

✍️మీసాల చిన గౌరినాయుడు

**********************

ఒరేయ్ ..నాన్నా,
అమ్మా… బంగారూ…
అన్న
మధురమైన పిలుపులు
చడీ చప్పుడు లేకుండా
ఏ మూలనో
దాక్కున్నాయి….

నాన్న వదిలెళ్లిన
ఆశల కావడి
సమతుల్యత తప్పి
ఊహల త్రాసు
తల్లకిందలైoది..

చక చక పరుగులెట్టే పనిముట్లు
యజమాని లేరని
కాస్త విరామ మొచ్చిందని….
గుట్టుగా ముచ్చట్లాడుతున్నాయి….

“శాంతి ”
విశ్రాంతి కోసం కాబోలు
పిల్లల యుద్ధం భరించలేనని
అటకెక్కి నక్కిపోయింది….

క్రమశిక్షణ విషపు కళ్ళు
తెరుచుకొని,
కుత్సిత రెక్కలు కట్టుకుని
అందనంత దూరం
పరుగులెత్తింది…

ఇపుడు తెలిసింది

నాన్న లేనప్పుడు

బతుకుబాట గతి
తప్పుతుందని
జీవనపు పాట
శృతి తప్పుతుందని
బంధాల మాట
బంధీ అవుతుందని
మమతల కోట
కూలిపోతుందని….


నాన్న గొప్పతనం…

✍️యస్. ప్రవీణ్

**********************

చేయి పట్టి నడక నేర్పును నాన్న…
పిల్లల సంతోషం కోసం ఎంతటి బాధ నైన దిగమింగును నాన్న…
కంటికి రెప్పలాగా గుండెలపై మోయును నాన్న…
తను ఎన్నో బాధలు పడుతూ బిడ్డను నవ్వించును నాన్న…
కష్టాన్ని నమ్మి నిరంతరం శ్రమించు నాన్న…
ఆత్మగౌరవాన్ని నింపుకొని జీవనం కొనసాగించును నాన్న…
మనకు సంతోషాన్ని కలిగించును నాన్న…
మనకు ఎలాంటి కష్టాలు రానివ్వడు నాన్న…
మన సంతోషం కోసం తన బాధల్ని గుండెల్లో పెట్టుకుంటాడు నాన్న…
మన బాధ్యతలను తెలియజేస్తాడు నాన్న…
ఎన్నో మంచి విషయాలను చెప్పి…
సమాజంలో మంచి పేరు సంపాదించాలని…
మంచి మార్గంలో నడవాలని…
గుర్తు చేసి తగు జాగ్రత్తలు చెప్పును నాన్న…

🌹🌹🙏🙏🙏🌹🌹

Happy father’s To all Awasome Father’s

From

తపస్విమనోహరం టీమ్💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!