లేఖ

లేఖ

రచన: సుశీల రమేష్

జీవితంలో ఇలాంటి  ఒక రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నా పేరు స్వాతి.. కేంద్రీయ విద్యాలయం లో టీచర్ పోస్ట్ కోసం రాత పరీక్ష ఉంటే ఢిల్లీ వెళ్లాను.

నేను పరీక్ష చక్కగా రాసి తిరిగి వస్తున్నాను. నన్ను తీసుకెళ్లడానికి అమ్మా నాన్న స్టేషన్ కి వస్తానన్నారు ఇంకా రాలేదే ఏంటబ్బా అనుకుంటూ నేనే ఆటో తీసుకుని ఇంటికి వెళ్లేసరికి మా ఇంటి ముందు చాలా మంది జనాలు గుమిగూడి ఉన్నారు.

ఏం జరిగిందో నని కంగారుగా పరిగెత్తాను ఇంట్లోకి. అమ్మానాన్నలు ఇద్దరు నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారు. … అక్కడ ఉన్న వాళ్ళలో ఒకరు నీకోసం వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసారు అని చెప్పారు.

ఆ మాట విన్న నేను నా కింది భూమి కదిలిపోతున్న భావన కలిగింది నాకు. ఎందుకంటే నాకు తోబుట్టువుల లేరు నేను ఒక్కదాన్నే. ఇలా నన్ను ఒంటరి దాన్ని చేసి మీరిద్దరే వెళ్ళిపోవడం అన్యాయం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న  ఓదార్చవవసిన బంధువులు ముఖం చాటేసి ఒక్కొక్కరు వెళ్ళిపోవడం ప్రారంభించారు.

అంతా వెళ్ళిపోయారు ఒక్కదాన్నే ఏం చేయాలో దిక్కుతోచక నాలో నేను కుమిలి పోతుండగా, ఒక బాబు లేఖ తీసుకొచ్చాడు. లేఖలో స్వాతి నువ్వు ఏడవకు నీకు నేనున్నాను. దిగులు పడకు అని చెప్పను కానీ నువ్వు ఒంటరి దానివి కాదు నీకు నేను ఉన్నాను. అని ఉంది.

కాసేపటికి కొంతమంది యువకులు వచ్చి దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించారు. వాళ్లకి నేను డబ్బులు ఇవ్వ బోతుంటే వద్దక్క మేము డబ్బులు కోసం రాలేదు. సార్ చెప్తే వచ్చాము అని వెళ్ళిపోయారు.

రాత్రంతా ఏడుస్తూనే ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు కానీ, తెల్లవారిన తర్వాత మెలకువ వచ్చి కళ్ళు తెరచి చూసే సరికి నా మంచం పక్కన ఒక కాఫీ ప్లాస్కో ఒక లేఖ ఉన్నాయి.

స్వాతి బాధలు కష్టాలు లేని మనిషంటూ ఎవరు ఉండరు. పోయిన వారి కోసం నువ్వు ఏడుస్తూ భోజనం చేయకుండా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ముఖం కడుక్కుని కాఫీ తాగు మళ్లీ చెప్తున్నాను నువ్వు ఒంటరి దానివి కాదు. అని రాసి ఉంది లేఖలో.

రోజు ఏదో ఒక సందర్భంలో లేఖ రావడం నేను చదవడంతో నామనసు కు కొంచెం ఊరట లభించేది. మరో లేఖలో ఒక్కదానివే కూర్చొని ఉండకపోతే గుడికి వెళ్లి రావచ్చు కదా అని రాసి ఉంది…

నేను లేచి స్నానం చేసి చీర కట్టుకుని గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఇంకో లేఖ ఉంది.

స్వాతి నిన్ను బ్రహ్మ ఎంతో తీరికగా చెక్కిన పాలరాతి శిల్పంలా ఉన్న నీకు లేత పసుపు వర్ణం గల చీర నీకు రెట్టింపు అందాన్నిచ్చింది.
నీ పొడవాటి జడ ఉందో లేదో తెలియని నీ నడుమున నాట్యం చేస్తుంటే ఆ సొగసు చూడతరమా.
కాటుక దిద్దిన కలువ కనులు ఓరకంటి నీ చూపులు చూసిన ఎంతటి ప్రవరాక్యుడు అయినా దాసోహం అనక మానడు. ఇదిగో నా వాట్సాప్ నంబర్ నీకు ఇష్టమైతే మెసేజ్ చెయ్ కానీ నన్ను వెతకొద్దు.
అని రాసి ఉంది లేఖలో……

వెంటనే నేను వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేశాను.

మీరెవరో మీ పేరేంటో నాకు తెలియదు కానీ ఒక ఆప్తుడు లా ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా, ప్రతి లేఖ లోను నేనున్నాను అని నాకు ధైర్యం చెప్తున్నారు .. మీరు నాకు ఎందుకు కనిపించడం లేదు.

నా అన్నవాళ్లు నన్ను కనీసం పలకరించడానికి కూడా రాలేదు. ఎక్కడ నన్ను  పోషించాల్సి వస్తుందోనని. బంధం లేకపోయినప్పటికీ, ఒంటరి ఆడపిల్లనైన  నన్ను మీరు ఓదార్చే తీరు నాకు ఎంతో బాగా నచ్చింది.
మీప్రతి మాటలోనూ మీరు బాధ్యత గలవారని నాకు అర్థమైంది.  నాకు తెలియకుండానే మీరు నా మనసులో స్థానం సంపాదించారు. ఒక్కసారి నాకు కనిపించండి ఈరోజు నేను మామూలు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరే.
అంటూ మెసేజ్ చేసింది స్వాతి ఏడుస్తూ….

స్వాతి ఏడవకు ప్లీజ్ అంటూ రిప్లై వచ్చింది. అది చూసిన స్వాతి చుట్టూ చూస్తుంది వెక్కివెక్కి ఏడుస్తూ….

స్వాతి నన్ను వెతకకు నువ్వు ఏడవద్దు అని మళ్లీ రిప్లై వచ్చింది.

మళ్లీ అతనే అబ్బ నీ కన్నీళ్లు ఎంత పుణ్యం చేసుకున్నాయో అలా జాలువారుతూ నీ చెక్కిళ్ళను తాకుతూ శంఖంలాంటి నీ మెడను స్పృశిస్తూ నీ అందమైన నీ గుండె మీద జారుతుంటే నాకెంత అసూయ గా ఉందో తెలుసా అని మెసేజ్ చేశాడు.

ఏడుపు ఆపేసి హే ఛీ కొంటె పిల్లోడా అనే రిప్లై ఇచ్చింది స్వాతి.

అబ్బా ఎంత సిగ్గో , చూడు బుగ్గలు కందిపోయాయి , నిన్ను అలా చూస్తుంటే వెంటనే నీ ఒళ్ళో వాలి పోవాలనిపిస్తుంది మెసేజ్ చేసాడు అతను.

ఇంకేం వచ్చేయ్ అంటుంది స్వాతి.

నాకు రావాలని ఉంది కానీ నేను నీకు నచ్చుతానో లేదో అని రిప్లై ఇస్తాడు అతను.

ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది. నిన్ను చూడకుండా నే నా మనసులో  చోటిచ్చాను అంటే నీకు అర్థం కావడం లేదా నేను అందానికి ప్రాముఖ్యత ఇవ్వనని , ఇంకెప్పుడు నా దగ్గర అందం గురించిన ప్రస్తావన తీసుకురావద్దు. అంటూ మెసేజ్ చేసింది బుంగమూతి పెట్టి స్వాతి.

అబ్బా స్వాతి అలా బుంగమూతి పెట్టకే నేను భరించలేక పోతున్నాను అనే రిప్లై ఇచ్చాడు అతను.

అది సరే గానీ మనం ఎప్పుడు కలుద్దాం నేరుగా అని మెసేజ్ చేసింది స్వాతి.

రేపే కలుద్దాం మన ఊరిలో కలువ పూల  చెరువు దగ్గర మర్రిచెట్టు ఉంది కదా అక్కడ కలుసుకుందాం అని రిప్లై ఇచ్చాడు అతను .

ఎప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాను ఆ రాత్రంతా పడుకోలేదు అతని గురించే ఆలోచిస్తూ తెల్లవారాక లేచి స్నానం చేసి నీలిరంగు చీర కట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళాను.

వాతావరణం గమనించలేదు కానీ వర్షం పడేలా ఉంది. అప్పటికే అతను చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్లి ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతను ఎవరో కాదు 10 వరకు కలిసి చదువుకున్నాం నా క్లాస్మేట్ హరి. అతనికి ఎవరూ లేరు అందరూ పోయారు.

చూసావా స్వాతి నేను నీకు నచ్చను అని హరి అనేలోపు స్వాతి వెళ్లి అతన్ని కౌగిలించుకుని అతని పెదవులని అందుకుంది  వెంటనే వర్షం మొదలైంది. పది రోజుల్లో గుళ్ళో ఏ ఆర్బాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి చేసుకున్న ఓ వారం రోజుల తర్వాత స్వాతికి  ఉద్యోగం వచ్చిందని లెటర్ వచ్చింది.

ఇంకేముంది స్వాతి చుట్టాల రాకపోకలు ఎక్కువయ్యాయి. వచ్చినోళ్ళు స్వాతికి చెప్పుడు మాటలు నూరిపోస్తున్నారు…

ఇలా దిక్కు దివానం లేని ఒంటరి గాడిని పెళ్లి చేసుకున్నావు ఏం మేమంతా లేమా, ఏం ఉందని అతగాడికి, నీకు ఎలాగో ఉద్యోగం వస్తుంది. నీ జీతంతో బతికేద్దాం అని నిన్ను వలలో వేసుకున్నాడు. అంటారు చుట్టాలు స్వాతి తో.

రానురాను స్వాతి కూడావాళ్ళ మాటలువంటబట్టించుకుని హరి ని దూరం పెడుతుంది.

స్వాతి స్కూల్ నుండి సాయంత్రం వచ్చేసరికే టేబుల్ మీద ఒక లేఖ ఉండడం గమనించి చదవడం మొదలు పెట్టింది.

ప్రియమైన స్వాతికి నేను నిన్ను నిన్ను గానే  ప్రేమించాను. చిన్ననాటి నుండి నువ్వంటే నాకెంతో ఇష్టం.నీ జీతం ఆశించి నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆనాడు నీ తల్లిదండ్రులు చనిపోయిన రోజు ఒక్కరు కూడా రాని నీ బంధువులు ఈనాడు నీకు ఉద్యోగం రాగానే నీ చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఒకసారి ఆలోచించవా ? నీ జీతం కోసం ఆశ పడింది నేనా వాళ్ళా ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ మాటలు విన్న నీకు నేను ఒక స్వార్ధపరుడు గా కనపడుతున్న ప్పుడు, నేను బ్రతికే ఏం లాభం వెళ్ళిపోతున్నాను.
ఇట్లు.
హరి.

లేఖచదివిన నాకు ఒక్కసారిగా నా ఆశల సౌధం కూలి పోతున్నట్టుగా అనిపించింది కానీ ఎక్కడో చిన్న ఆశ నన్ను వదిలి హరి అంత పని చేయడని. హరి ఎక్కడున్నాడో బయటికి వెళదామని వస్తున్నా నాకు నా చుట్టాల మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయాను.

వాళ్ళ మాటల్లో నన్ను హరిని వేరు చేసి, వాళ్లలో ఎవరికైనా ఇచ్చి నాకు మళ్లీ పెళ్లి చేయాలనే వారి దురాలోచన నాకు అప్పుడు అర్థమైంది. ఉండండి నా హరి దొరికిన తర్వాత మీ సంగతి చెప్తాను అనుకుంటూ నేను చెరువు దగ్గరికి వెళ్లాను నేను అనుకున్నట్టుగానే హరి అక్కడే ఉన్నాడు.

వెంటనే వెళ్లి హరి ని కౌగిలించుకుని.. హరి నన్ను మన్నించు నువ్వు నేను వేరు వేరు కాదు మన తనువులు వేరైనా ఆత్మ ఒక్కటిగా నీతో చిరకాలం జీవించేలా నా ఆశల సౌధాన్ని నేను పునర్న్మించుకుంటాను. అంటూ హరి గుండెలో తలదాచుకుని ఏడుస్తుంది స్వాతి.

ఇద్దరు ఇంటికి వెళ్ళాక. ఇంకెప్పుడూ మీరు నా గడప తొక్కొద్ధని  చెప్పి పంపించేసింది బంధువులందరిని స్వాతి.

ఆ రాత్రి వర్షం కురుస్తుంటే వర్షంలో తడుస్తున్న స్వాతి మనసు ఎంతో తేలిక పడింది, చెప్పుడు మాటలు విన్న నా జీవితం ఏమయ్యేదో అనుకుంటూ ఏడుస్తుంది. అది గమనించిన హరి స్వాతి నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను.. అంటాడు స్వాతిని అదోరకంగా చూస్తూ, హరి చూపును గమనించిన స్వాతి హరిని  అల్లుకుపోయింది,  వర్షంలో తడిసిన స్వాతి అందాల విందును ఆరగించడం మొదలుపెట్టాడు హరి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!