గమ్యం లేని ప్రయాణం

గమ్యం లేని ప్రయాణం

రచన: పద్మజ రామకృష్ణ.పి

అది ఒక మధ్య తరగతి కుటుంబం.ఆ ఇంటి కోడలు లక్ష్మీ.పరమ గయ్యాళి. చుట్టాలతో కాని. ఇరుగుపొరుగు వారితో కాని మంచితనం లేని మనిషి. భర్తకు కనీసం అన్నం కూడా వండి పెట్టదు.అత్తగారిని అయితే ఎన్నడూ అత్తయ్య అని పిలిచి ఎరుగదు
ఇదిగో.అదిగో అనే పిలుపు తప్ప.తను వచ్చి ఇరవై సంవత్సరాలు అయిన.ఆమె నుండి చెడ్డ పేరు తప్ప ఆ కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు..అనుకోకుండా ఆ ఇంటి పెద్దాయన లక్ష్మీ మామ గారు కాలం చేశారు..ఇదే అదునుగా భావించిన లక్ష్మీ.అత్తగారిని వేధించడం మొదలు పెట్టింది. తను మనిషిని అన్న సంగతి మరచి అత్తగారి మీద చెయ్యి చేసుకోవడం మొదలు పెట్టింది..అత్తగారి మెతకతనం చూసి అందరూ.అమ్మో మీ కోడలు లాంటిది ఇంటికొకరు ఉంటే చాలు ఆ ఇల్లు గుల్లే అని అనేవాళ్ళు..అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదూ అత్తగారికి.
ఎలాగైనా అత్తగారిని వదిలించుకోవాలి అని తలచి.కూతురి దగ్గరకు పంపింది.అత్తగారిని. ఇదిగో.రెండు రోజులు నీ కూతురి దగ్గర ఉండి రా.అని చెప్పింది లక్ష్మీ..

కోడలు ఆ మాట చెప్పగానే సంతోషంతో సరే లక్ష్మీ మీ మామయ్య పోయి ఏడాది దాటింది..పిల్లను చూసి వస్తా అని చెప్పి బయలుదేరింది.అత్తగారు….రెండు రోజుల తరువాత.

కూతురు దగ్గర నుండి ఇంటికి వచ్చింది ఆ పెద్దావిడ. ఇంటికి గొళ్ళెం పెట్టి ఉంది.మెల్లిగా తలుపు తెరిచి చూసింది. ఇల్లంతా ఖాళీగా ఉంది.ఓ గోడ మీద ఆ ఇంటి పెద్దాయన ఫోటో ఎండిపోయిన పూల మాలతో వేలాడుతూ ఉంది. ఆ ఫోటోలో ఉన్న పెద్దాయన నవ్వుతూ.ఇంకా ఏం మిగిలింది నీకు ఇక్కడా.!వచ్చేయ్.ఆశ పడ్డావో ముందు ముందూ ఇంకా నరకం చూస్తావు. ఏంటోయ్ నీ రాక ఎప్పుడూ అని ఆడిగినట్లుగా అనిపించింది.పెద్దావిడకు.. కంట్లో నీళ్లు
తుడుచుకుంటూ.ఇల్లంతా  గమనిస్తుంది.

పెరటిలో ఉన్న పెద్ద రోలు కనిపించాలేదు. నలుగురు కూడా మోయలేని అంత పెద్ద రోలు ఎలా తీసుకుని పోయిందో కోడలు అని మనసులో అనుకుంటూ ఉండగా. పక్క పోర్షన్ లో ఉండే ఆవిడ వచ్చింది. ఆంటీ మీ కోడలు వాళ్ళ అమ్మగారి ఊరికి సామాన్లు మినీ ఆటోలో తరలించిందిగా. చీకటితో నాలుగు గంటలకే మొదలు పెట్టారు సామాన్లు సర్దుకోవడం. పాపం అన్నయ్య ముఖంలో నెత్తుటి చుక్క లేదు. అన్నయ్యకు ఇష్టం లేదు అనుకుంటా. ఆంటీ.అలా వెళ్లడం.అన్నయ్య ఎంత సైలెంట్ గా ఉన్న కూడా ఆటో కదిలే వరకు తిడుతూనే ఉంది మీ కోడలు. అన్నయ్యని పాపం అంటూ.గోడ వైపు చూసింది. అంకుల్ ఫోటో ఆవిడకు బరువై పోయిందా.! ఇలా వదిలేసి పోయింది. అసలు ఆ రోలు నలుగురికి కూడా పైకి లెగవలేదు. మా వారుని కూడా హెల్ప్ అడిగారు. అంతేలే రాతికి ఉన్న విలువ మనుషులకు లేదు.హ్మ్మ్.అనింది నిట్టూర్పుగా…

అయ్యో లేదమ్మా మర్చిపోయి ఉంటుంది. అని గోడకు ఉన్న ఫోటో తీసి కొడలిపై మాట పడకుండా సమర్ధిస్తూ. ఆ ఫోటో కి ఉన్న ఎండిన పూల మాల తీసేసింది.
ఫోటో పవిట కొంగుతో తుడిచి. పవిట లో ఫోటో చుట్టుకుని.సరే మా.ఉంటాను అని చెప్పి.అక్కడి నుండి బయలుదేరి.రోజూ అన్నదానం జరిగే గుడి వైపుగా నడిచింది.గమ్యం తెలియని ఆ పెద్దావిడ..!

వెన్నలాంటి మెత్తని మనసున్న మంచి మనుషులకు రాతి బంధాలు దొరికితే.! జీవితాలకు గమ్యం లేని ప్రయాణాలే చివరి మజిలీ వరకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!