కొయ్య కుర్చీ

అంశం: నేనొక వస్తువుని

కొయ్య కుర్చీ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

తిరిగి తిరిగి అలసి
పనులు ముగించుకుని వచ్చి
నా ఒడిలో సేద తీరేవారు
మీ నాయన వారి నాయన
ఆ హుందా తనానికి మురిసే
మీ అమ్మ నాయనమ్మ
వారి కండువాలు భుజం దిగి
నాకు అలంకారాలై ఒదిగే
నేనెంతో గర్వంతో ఊగే
మీరేమో సోఫాలు ఇంకేవో తెచ్చారు
నడుం నొప్పులు తెచ్చుకున్నారు
నన్నేమో మూలకి నెట్టారు
మాసిన బట్టలు మీద వేస్తున్నారు
పనికిరాని వస్తువు చేశారు
నా బాధను చెప్పుకో లేని
కొయ్య కుర్చీని నేను

You May Also Like

15 thoughts on “కొయ్య కుర్చీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!