తీరిన మోజు

అంశం : నేనో వస్తువును

తీరిన మోజు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

నాపై ఎంతో మోజుపడి
కొత్తలో ఎంతో అపురూపంగా చూసుకున్నావ్
పదే పదే చూపులతో తడిమావ్
అందాలొలికే నన్ను సొంతం చేసుకున్నట్లు
గొప్పగా అందరిముందు ప్రదర్శించావ్…!

ముస్తాబులు చేసి మురిసిపోయావ్
ఎవరెత్తుకెళ్తారోనని పదిలంగా కాపాడుకున్నావ్
మీట నొక్కినట్లుగా
నీకవసరమైనప్పుడు అవసరమైన పనులన్నీ
చేసిపెడుతుంటే ప్రాణంలా చూసుకున్నావ్
నాకే చిన్న సమస్య వచ్చినా తల్లడిల్లిపోయావ్…!

నీ సేవలు చేసి చేసి
నా రంగు రూపులు మారిన వేళ
నాకేసి చూస్తేనే పాపం అన్నట్లు
ముఖం తిప్పుకుంటున్నావ్…!

నన్ను వంటింటికీ
పడకగదికీ మాత్రమే
పరిమితం చేసి
నా పనితనం నెమ్మదించిన వేళ
శీతకన్ను వేస్తున్న నీకు
నేనో మోజుతీరిన
నిరుపయోగమైన వస్తువునే…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!