అంశం: నేనొక వస్తువుని
సబ్బు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: లగిశెట్టి ప్రభాకర్
ప్రతి ఇంట్లో ఉంటాను, అందరికి నేను కావాలి
ప్రతి రోజు అందరికీ నేను అవసరమే
అందరు నన్ను తనువుకు హత్తుకుంటారు
ముఖానికి కాంతి,శరీరానికి హాయి నిస్తాను
అలసిన వేళలో ఆదుకొని శుభ్రంగా ఉంచుతాను
మీ మేనులోని ప్రతి అణువణువు తాకుతాను
మిమ్ముల పరవశింప చేస్తాను….
అందరు నన్ను “సబ్బు”అని పిలుస్తారు
మీ శరీర గబ్బు తొలగిస్తాను.. కానీ
మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించలేను
మురికి దుస్తులు శుభ్రం చేస్తాను.. కానీ
మూర్ఖత్వపు మెదళ్లను బాగు చేయలేను
సమాజ రుగ్మతలు తొలగించే సబ్బు కావాలిమీరు
సామాజిక చైతన్యం కలిగించే సబ్బు కావాలి మీరు
సబ్బునురగ వలె పనిచేసి సమాజాన్ని సరిదిద్దాలి
నవసమాజాన్ని నిర్మించే దిశలో మీరుండాలి