నా బుజ్జి ప్రాణమా

నా బుజ్జి ప్రాణమా

అంశము: నిన్ను దాటి పోగలనా

కళ్ళతోటే కళ్లెమేస్తావు…
చూపులతో నిలవేస్తావు…
నవ్వులతో కవ్విస్తావు…
నయగారాల గారాలు కురిపిస్తావు…
ముద్దు మోముతో మురిపిస్తావు…
ముందరి కాళ్లకు బంధమేస్తావు…
నీవే నా లోకమనిపిస్తావు…
నీకంటే వేరేదీ లేదనిపిస్తావు…
నిదురలోనూ నీ ధ్యాసే…
కలలలోనూ నీ కలవరింతే…
కాలమిలా ఆగిపోనీ
అనిపించే నీ సాన్నిధ్యం…
హాయిని,ఆనందాన్ని కలిగించే
నీ సామీప్యం,సాన్నిహిత్యం…
నిన్ను దాటిపోగలనా…
దరిన నీవు లేక మనగలనా…
నా బుజ్జి ప్రాణమా…!!!

రచయిత ::  చంద్రకళ. దీకొండ

You May Also Like

2 thoughts on “నా బుజ్జి ప్రాణమా

  1. పూర్తి భావుకతతో నడిపించిన కవిత.పాఠకుల ఊహలకు రెక్కలు తొడిగి హృది సీమన ఆలోచనా కేతనాలను ఎగురవేశారు కళగారూ.అభినందనలండీ..

    1. ధన్యవాదాలు సీత గారూ… మీ స్నేహపూర్వక ప్రశంసకు😊😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!