కాలం నిశ్శబ్దం

కాలం నిశ్శబ్దం

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

కళకళ లాడే కాలం
వెల వెల బోయింది
కాలచక్రం గమనం
మార్గం తప్పింది

కవ్వించే కాలం కళ తప్పింది
దిశ నిర్దేశాలు చేసే కాలం నిశ్శబ్దమైంది
ప్రణాళికలు పథకాలు పతనమయ్యాయి
భవితకు మార్గదర్శి చేయాల్సిన కాలం బందీ అయింది.

కరోనా భూతం కాలాన్ని గాయం చేసింది
తేరుకోలేని చేదు విషాదాన్ని మిగిల్చింది
గాయం లెక్కచేయక ముందడుగు వేద్దామంటే
తిరిగి తిరిగి ఎదిరిస్తుంది

మందులేని గాయం తో
ముందడుగు వేయలేక
సాయం కోసం ఎదురుచూస్తూ
నిట్టూర్పుతో నిశ్చేష్టురా లయింది

విధి వక్రీకరిస్తే కాలానికి కూడ తప్పని గాయం
కాలానికే గాయమైతే చేసేది ఎవరు సాయం
కర్తవ్యానికి కార్య రూపం కాలం
గాయమైన కాలానికి కాలమే చెప్పాలి సమాధానం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!