అమావాస్య

అమావాస్య

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఆకాశంలో అలుముకుంది అంధకారం
ఆ అంధకారంలో ముందుకు సాగలేమని విచారం
ఏమి చేశాము మీకు మేము అపచారం
సరిపెట్టుకోలేము ఇది మీ అపచారం

కన్నీటి చుక్కలు రాలి పడుతున్నాయి
నింగిలోని తారలు సిగ్గుతో ముడుచుకున్నాయి
మబ్బుల్లోకి ఆ చందమామ చల్లగా జారుకున్నాడు
వెన్నెల రాత్రి కాస్తా కాళరాత్రిగా మార్చి వేశాడు

అది ఆడపిల్ల జీవితంలో జరిగిన శాపం
ఏముంది ఆ అభాగ్యురాలి ప్రమేయం
కాలమే నాగుపాములా ఆమెను కాటేసింది
కళ్లు మూసుకుపోయిన రాక్షసుడి చేతిలో బలయ్యింది

అమ్మానాన్నల ఆశా జ్యోతి ఆ చిన్నది
అన్నదమ్ముల మదిలో చిరు వెలుగే తానయ్యింది
ఆమె కంటి చూపు ఆ ఇంటికీ దీపమయ్యింది
ఈ నిమిషంలో ఆమె తుది శ్వాస విడిచింది

అండలేని ఆ రాత్రే ఆమెకు శాపమా?
ఆశతో ముందుకు పోవటం ఆమె పాపమా?
నిండు పున్నమి రోజున అమావాస్య  రూపమా?
ఇది ఆమె తెచ్చి పెట్టుకున్న నరకమా? చెప్పేదేవరు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!