సువర్ణ

సువర్ణ

రచయిత ::జయ కుమారి

రాజేష్ 3 సంవత్సరాల తరువాత  ఎన్నో ఆశలు తో, తన కల నిజం చేసుకోడానికి ఇండియా వస్తున్నాడు, తనే కాదు తన మనస్సు కూడా గాలిలో తేలిపోతుంది సువర్ణ ను తలుచుకొని, సువర్ణ ను పెళ్లి, పెళ్లి తర్వాత జీవితం ఊహించు కుంటూ ఉండగా, అస్సలు నేను దేశం కానీ దేశం వెళ్ళడానికి కారణం సువర్ణ తో నా పెళ్లి  గురించి అడిగితే వాళ్ళ నాన్న పెట్టిన షరతులు .
అస్సలు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి డబ్బు,ఉద్యోగం కావాలి అని,
అవి సంపాదించిన తర్వాత కనిపించు అప్పుడు అడుగు నా కూతుర్ని అని చెప్పడం నేను కోపంతో దుబాయి వెళ్లి ఉద్యోగాన్ని సంపాదించడం, అదృష్టం కొద్దీ నేను పని చేసే షెట్ కి వ్యాపారం కలిసి రావడం అది నా వల్ల కావటం, దానికి ఆ షెట్ సంతోషించి తన వ్యాపారం లో 25/ వాటా నాకు ఇవ్వడం నేను అతి కొద్ది సమయంలో డబ్బు సంపాదించడం అంతా ఒక కలల జరిగి పోయింది….

అసలు ఈ మూడు ఏళ్లు ఎలా గడిచాయో తెలుసా సువర్ణ నీవు లేకుండా ఎంత భారంగా ఉండేదో నిన్ను చూడాలని, మాట్లాడాలని అనిపించింది,కానీ మీ నాన్నతో శపథం చేసి వేళ్ళ కదా డబ్బు  సంపాదించే వరకు నిన్ను కలవనన్నా గా అందుకే తల్లి ఇన్ని రోజులు నేను ఎక్కడ ఉన్నది కూడా నీకు చెప్పకుండా ఉండవల్సి వచ్చింది…
నీవు ఎంతగా బాధ పడి వుంటావో నాకు తెలుసు ,దానికి  నన్ను క్షమించు,అయిన ఎంత సేపు కొన్ని గంటల్లో నీ ముందు ఉంటా, మీ నాన్న కి నేను సంపాదించింది చూపించి నిన్ను నాకుఇచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతా ఈ సారి కాదు అనడు కదా అనుకుంటూ.!
సువర్ణ ని చూసే క్షణాలు కోసం ఎదురు చూస్తు రాజేష్  ప్లైట్ దిగగానే నేరుగా సువర్ణ వల్లఇంటికి వెళతాడు, కానీ అక్కడ రాజేష్ కి ఊహించని షాక్ అక్కడ సువర్ణ ఇల్లు ఉండదు, ఏమి జరిగిందో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఎలా తెలుసు కొనేది అర్ధం కాదు,అక్కడ చుట్టుపక్కల వారిని అడిగితే తెలియదు అనే మాట తప్ప ఏమీ వినిపించదు రాజేష్ కి.
ఇలా అనుకునే లోపు వాళ్ళ స్నేహితులు గుర్తుకు వస్తారు,
ఆ కుమార్ ని అడిగితే అసలు విషయం తెలుస్తోంది అని కుమార్ దగ్గరకు వెళతాడు రాజేష్.!
కుమార్ సువర్ణ వాళ్ళు ఎక్కడ వుంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఎవరు లేరు,ఇల్లు కూడా లేదు కాళీ స్థలం మాత్రమే ఉంది…

కుమార్:- ఏమో నాకు తెలియదు అని అనుమానం గా  చెబుతాడు. అయిన వాళ్లు అక్కడ లేరు అంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు, లేదా తను పెళ్లి చేసుకొని వేరే ఊర్లో ఉండొచ్చు ఏమో కదా, అయిన నీలా అందరూ ఉంటారా ,పిచ్చివాడిలా ఎదురు చూస్తూ.
వెళ్ళు  ఎవరినైనా పెళ్లి చేసుకొని సంతోషం గా ఉండు,ఆ సువర్ణ ని మర్చిపో అనగానే!
రాజేష్:- రేయ్ ఏమి మాట్లాడుతున్న వ్ నీకు తెలుస్తుందా ,సువర్ణ పెళ్లి చేసుకొందా నేను నమ్మను ,నిజం చెప్పు ఏమి జరిగింది నేను లేనప్పుడు నిన్ను చూస్తే ఏదో విషయం దాస్తున్నావు అని కాలర్ పుచ్చుకొని గట్టిగా అడిగే సరికి కుమార్ ఏమి లేదు అని చెప్పిన వినడు రాజేష్..
కుమార్:-  ఒరేయ్ రాజేష్ నేను చెప్పేది విను ,సువర్ణ కి పెళ్లి అయ్యిపోయింది అనగానే రాజేష్  ఒక్కసారిగా  కుప్పకూలిపోయాడు, కన్నీళ్లు ఆగకుండా వస్తూనే వున్నాయి తన కలలు, ఆశలు, తన ఇన్నేళ్ల శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది అనిపించింది…
కుమార్ కి రాజేష్ ని ఉరడించడం  చాలా కష్టం ఐనది…
రాజేష్:- కుమార్ తను ఎక్కడ ఉంది ఒక సారి చూడాలని ఉంది,వాళ్ళ అమ్మ,నాన్న వాళ్ళు ఎక్కడ వున్నారు అడుగుతాడు.
కుమార్:- అది …అది..
రాజేష్:- ఏమటిి చెప్పు పర్వాలేదు నేను వెళ్ళి గొడవ చెయ్యను ఒకసారి తనని చూసి ఎందుకు ఇలా ఎందుకు చేశావ్ అని అడుగుతా అంతే.!
కుమార్;-అప్పటిదాకా దాచి పెట్టింది అంత   ఒకేసారి  గట్టిగా అరుస్తాడు ఎక్కడ ఉన్నారని అడుగుతావ్ అని ఏడుస్తాడు.!
రాజేష్- కుమార్ ని చూసి ఏమైంది అడుగుతాడు.!
కుమార్ అది అంతా చాలా పెద్ద కథ రాజేష్ ఇప్పుడు ఎందుకు లే అంటాడు…
నాకు ఇప్పుడే కావాలి అని రాజేష్ అడుగుతాడు,
ఇంకా రాజేష్ దగ్గర నిజం ధాస్తే వీడు ఏమైపోతాడో అని కుమార్ నిజం చెబుతాడు..
కుమార్:- నీవు వెళ్లిన కొన్ని రోజులకు సువర్ణ వాళ్ళ దగ్గరి బంధువుల అబ్బాయిని తెచ్చి సువర్ణ ఇష్టం లేదని ఏడుస్తున్న వినిపించుకోకుండా బలవంతంగా తనకి అతనితో పెళ్లి చేశారు..
పెళ్లయిన తర్వాత కొంత కాలానికి ఒక బాబు బాబు కూడా పుట్టాడు ..కానీ తనలో చాలా మార్పు బహుశా నీకు దూరం అయ్యాను అనే బాధ అనుకున్నా…
కానీ ఆ తర్వాతే తెలిసింది అతను మంచి వాడు కాదు అని తనని రోజు తాగి వచ్చి కొట్టడం, చాలా బాధలు పెట్టేవాడు ,నీ గురించి కూడా తెలిసి ఇంకా నరకం చూపించే వాడు అంటా, చివరికి ఒక రోజు వ్యభిచార గృహానికి అమ్మేస్తే ఎలొ గో లా తప్పించుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది .
ఒక రోజు అతను ఇక్కడికి కూడా వచ్చేశాడు ,రమ్మని బలవంతం చేసాడు, కొంత మంది రౌడీ లను తీసుకొచ్చి చాలా గొడవ చేసాడు ఆ గొడవలో సువర్ణ వాళ్ళ అమ్మ,నాన్నలని ,బాబుని దారుణంగా హత్య చేసి సువర్ణ ను తీసుకెళ్లే సమయానికి పోలీసులు అతన్ని పట్టుకున్నారు కానీ అప్పటికే సువర్ణ కి కాలముందు అందరూ చనిపోవడం, బాధలు పడి పడి ఉండటం, నిన్ను దూరం చేసుకోవడం తో పిచ్చి పట్టేసింది , తనని వాళ్ళ బంధువులు కూడా పట్టించు కోలేదు ,కొంత కాలం ఇక్కడే తిరిగేది, ఈ మధ్య అప్పులు వాళ్లు తన ఇల్లు కూడా స్వాధీనం చేసుకుని పడగొట్టేశారు…
కొన్ని నెలలుగా ఈ ఊరిలో కనిపించలేదు .
మొన్న మన ఊరి అతను బందరు లో  బట్టలు, అరవునగల వ్యాపారం చేస్తున్నాడు. అతను అన్నాడు సువర్ణాని అక్కడ చూసాను అని అన్నాడు….
ఇవ్వాన్నీ విన్న రాజేష్ కి ప్రాణం   పోయినట్లు అయ్యింది …
జరిగిందానికి కారణం నేనే సువర్ణ, నీ బాధలన్నింటికి నేను నిన్ను వదిలేసి వెళ్లడం అని రాజేష్ తల బాదుకొని ఏడుస్తుంటే
కుమార్:-ఊరుకో రా నీవు ఏమి చేసావు. ఇప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు.అనగానే
రాజేష్:- లేదు ఉంది, నేను సువర్ణ ను చూడాలి.
తనని బందరు లో చూశారని చెబుతున్నవ్ కదా అతని దగ్గరకు తీసుకెళ్లు  అతనిని అడుగుదాం ఎక్కడ చూసాడో అనగానే కుమార్ ఇప్పుడా అంటాడు..
ఇప్పుడే వేళదాం పదా అని బయలుదేరారు రాజేష్,కుమార్ ఇద్దరు..
బంధర్ దగ్గరకు వచ్చే కొలదీ రాజేష్ లో ఎన్నో జ్ఞాపకాలు…
ఒక సారి సువర్ణ రాజేష్ తో మన పెళ్ళైన తర్వాత నన్ను ఒక సారి మచిలీపట్నం ( బంధర్) తీసుకువెల్లు అన్న మాటలు,
రాజేష్ ఎందుకు తల్లి అని అడిగితే ఆపకుండా బంధర్ గురించి పెద్ద స్పీచ్ ఇవ్వడం..
సువర్ణ కి ఇష్టం అయిన

కూచిపూడి నాట్యం పుట్టిన ఊరు  మా బంధర్…
బాబు బంధర్ లో బంధర్ లడ్డు తింటావా…
బంధర్ హల్వా తింటావా…
వింటావా ఎన్ని కధ లు జానపదుల  నేర్పిన స్వాతంత్ర జెండా కథలు వింటావా…
svr ,Anr, ntr, వంటి మహా నటుల పుట్టింటి కథలు వింటావా..
అని కూని రాగాలు తియ్యడం,
అంతే కాదు రాజేష్ 150 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన సంతాన వేణుగోపాల స్వామి గుడిలో ప్రదక్షిణలు చేస్తే మనకి బుల్లి రాజీ,బంగారం  లాంటి పిల్లల్ని ఆ వేణుగోపాల స్వామి మనకి ప్రసాదిస్తాడు అని నవ్వుకోవడం, అవునా అని నేను అంటే తను సిగ్గుపడి నా భుజంపై వాలడం, తన నుదిటి పై  నా తొలి ముద్దు ….
అని అవ్వన్నీ గుర్తుకు వచ్చి చిన్న సంతోషం మరు నిముషం తనని ఇటువంటి పరిస్థిలులో తనకి ఇష్టం అయిన ప్రదేశం లో ఇలా చూడటం…
పదే పదే అవ్వే జ్ఞాపకాలు, తను చెప్పిన ఒక్కో ఒక్కో  ప్లేస్ ని దాటుకుంటూ, వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఆగి సువర్ణ మాకు కనిపించి,తను మాములు మనిషిలా అయ్యినవెంటనే నీ దగ్గరకి తీసుకువస్థాను స్వామి ,కరుణించు స్వామి
అని ఏడుస్తూ నమస్కరించి ముందుకు వెళ్ళాడు రాజేష్…
అతను చెప్పిన ప్రకారం సువర్ణ రైల్వె స్టేషన్ దగ్గర్లో ఎక్కడో ప్లాట్ఫామ్ మీద చూసినట్లు చెప్పడంతో రైల్వే స్టేషన్లలో ఆ చుట్టు పక్కన వెతుకుతున్నారు రాజేష్, కుమార్….
ఫోటో చూపిస్తు అందరిని అడుగుతున్నారు ..
ఒక ఆడుకునే అతను ఈ పిల్ల ఇక్కడే ఉంటుంది..
ఆ చెట్టుకింద పడుకొనివుందేమో చూడండి అంటారు…
ఆ మాట తో రాజేష్ కి ప్రాణం పోసావు తాత అని కొంత డబ్బు ఇచ్చి దన్నాం పెడతాడు
చెట్టు దగ్గర ఒక మూల వణుకుతున్న సువర్ణ ని చూస్తాడు రాజేష్ ,తనను అలా చూడగానే ఏడుస్తూ వెళ్లబోతే
వీళ్ళని చూసిన సువర్ణ రావొద్దు రావొద్దు అని ఏడుస్తూ పారిపోతుంది తన వెనకాలే వెళ్లి తనని పట్టుకొని రాజేష్
సువర్ణ ముకాన్ని రెండు చేతులతో పట్టుకొని బయపడకు  ఒక సారి నన్ను చూడూ నీ రాజేష్ ని చూడు తల్లి ,నిన్ను ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది అని గట్టిగా  పట్టుకొని  ఏడుస్తుంటే, సువర్ణ  నీవు ఎవరు నిను కొట్టేరా,మీ అమ్మని బాబు ని చంపేశారా ఏడవకు ,మా రాజీ వచ్చి వాళ్ళని డిస్యూమ్ డిస్యూమ్ చేసి నిను నన్ను తీసుకెళ్తాడు ఏడవకు ఏ ఆమ్ తింటావా మనకి పేడతానికి ఎవరులేరు గా,ఓయ్ బూచి వస్తాడు దాక్కో అని మళ్ళీ చెట్టు చాటు కి వెళ్ళిపోతుంది..
సువర్ణ ని చూసి ఒక పక్క బాధ, ఒక పక్క సంతోషం తనని చూసినందుకు…
తనకి ఇష్టం ఐయిన బంధర్ తల్లే తనని క్షేమంగా నాకు తనని ఇచ్చింది,థాంక్యూ స్వామి అని…
కుమార్ తో ఏంటి రా ఇంత మంది మతిస్థిమితం లేని వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు, ఎందుకు అని అడుగుతారు ..
కుమార్:-  అది ఎందుకు అంటే ఇక్కడి తో రైల్వే లైన్ ఆకరిది..
ఎక్కడిేఎక్కడో ట్రైన్ లు ఎక్కి గమ్యం తెలియక ఇక్కడికి వచ్చి  ఇలా జీవితాల్ని గడుపుతున్నారు…
వీళ్ళందరిని  కన్న తల్లి ల  ఆదరిస్తుంది ఈ బంధర్ నేల..
ఈ పుడమికి మన పాదాభివందనం తల్లి
.రాజేష్:- అవును రా కుమార్
వీళ్ళందరికి మనం ఏదో ఒకటి చెయ్యాలి,.
ఏదైనా హౌస్ కట్టి ,వీళ్ళందరికి ఏ లోటు లేకుండా చూడాలి…
అని రాజేష్ అనగానే…
కుమార్:- రాజేష్ మంచి పని ,వీళ్ళందరికి  తల్లి బంధర్ ఐతే
బాధ్యత గాచూసుకొనే  తొడువు నీవు రా ….
అక్కడినుచి సువర్ణ ని తీసుకొని వెల్తూ,
హౌస్ పనులు కూడా త్వరగా అయ్యేటట్టు చెయ్యాలి అంటారు ….
ఇదే మా బంధర్ రైలు కధ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!