ఆయువు తీయకు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

ఆయువు తీయకు

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

అంతరంగం ప్రశ్నిస్తే
ఆయువు తీసుకుంటావా
గొంతెత్తి సమస్య విన్నవిస్తావా
జీవిత మార్పును స్వాగతిస్తావా
మనకెందుకులే అనుకుంటావా

*అంతరంగం ప్రశ్నిస్తే*
వివేకంతో ఆలోచన సాగాలి
వ్యవహార శైలిలో మార్పు రావాలి
విచక్షణ తో నిర్ణయించాలి
స్వభావం లో లక్ష్య సాధన ఉండాలి

*అంత రంగం ప్రశ్నిస్తే*
అవరోధాలను తొలగించు
సమస్యల విశ్లేషణ కు ప్రయత్నించు
సత్యాసత్యాల అన్వేషించు
యదార్థ మెరిగి జీవించు

*అంతరంగం ప్రశ్నిస్తే*
అనుభవాల అనుభూతిని స్వాగతించు విజయావకాశాలను అందుకొను
మార్పుల మలుపులను అంచనా వేయి
ఆహం వీడి నిజం ఎరిగి బ్రతుకు బాటను సుసంపన్నం చేయి

You May Also Like

One thought on “ఆయువు తీయకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!