(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
అంతరంగం చెప్పింది
రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
మనస్పూర్తిగా నిన్ను ప్రేమించానే, స్నేహితుడే అని చెపితే, హరితో ఎలా మసులుకున్నా, ప్రవర్తించినా పాజిటివ్ గా తీసుకున్నానే. అయినా నా మనసు మసి బారిందిలే. నువ్వు పొరపాటున హరికి పంపబోయి, నాకు పంపిన మెసేజ్ లో నీ అసలు స్వరూపం తెలిసింది. నీ వల్ల నా వారందరికీ దూరం అయ్యాను. నీలాంటి వారి చేతిలో గుడ్డిగా జీవితాన్ని పెడితే, ఆడుకుంటావని ఆలస్యంగా తెలుసుకున్నా.
ముసుగు వేసుకుని, గంతలు కట్టుకున్న నా అంతరంగం గుర్తుకు వచ్చి, నాకు న్యాయం చెప్పమని ప్రశ్నించా. అంతరంగంలో వున్న అంతరాత్మ చెప్పింది ‘నువ్వు కళ్ళు మూసుకొని పోయి వున్నావు, నీ మనో నేత్రంతో నిన్ను నువ్వు చూసుకో, నిజం కనిపిస్తుంది’ అని తీర్పు చెప్పింది.
ప్రేమలో విఫలమైన నేను ‘ఆత్మ హత్య చేసుకోవాలి’ అన్న నా ఆలోచనకు జవాబు దొరికింది. నవ్వుకుంటూ బయటకు వచ్చాను. ప్రపంచం ఎంత అందంగా వుందో?
….