దుర్గమ్మ అనుగ్రహం

దుర్గమ్మ అనుగ్రహం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

ఉదయం 6 గం ల సమయం. రామచంద్రాపురం లో ఓ మామూలు రైతు. ఒకరోజు తీసుకున్న అప్పు బాకీ కట్టటానికి ఇంటినుండి డబ్బుమూట తో బయలుదేరాడు రామ చంద్రయ్య

అలా నడుస్తూ ఊరి బయట చింతతోపు దగ్గరకు వచ్చాడు. అక్కడ  నుంచి మెల్లగా నడుస్తునతనికి ఎక్కడి నుండి వచ్చాయో మాయదారి జిత్తులమారి నక్కలు వచ్చి మీద పడ్డాయి.

భయంతో ప్రక్కనే ఉన్న త తుప్పల మాటున దాక్కున్నాడు రామచంద్రయ్య.

ఇంతలో ఎవరో ఒక సాధువు వస్తున్నట్లు అనిపించి, మెల్లగా పొదల మాటు నుంచి ధైర్యంగా బయటకి వచ్చాడు. ఇంక ఇద్దరూ మాటలు చెప్పుకుంటూ కలిసి నడవటం మొదలు పెట్టారు. కొంతసేపటికి ఆలసటతో దగ్గరలో ఉన్న పూరి గుడిసె దగ్గర ఆగి సేద తీరాలని అనుకున్నారు. మంచి నీరు తాగారు.
విశ్రమిద్దామని కునుకుపాటు పడుతుంటే ఒకటే  కాకుల గోల. భరించలేక అలానడుస్తూ పట్నం బయలు దేరారు. పట్నం లో కరణం గారి భార్య రాణి సుమిత్రాదేవి దగ్గర తను తీసుకున్న అప్పును తిరిగి ఇద్దామని బయలు దేరిన విషయం, సాధువు తో తన కష్టాలు చెప్పుకుంటూ, నడక సాగించారు.
ఇంతలో పట్నం చేరాడు రామచంద్రయ్య.
దారిలో ఓ అపరిచితుడు తన మూట మీదే కన్ను వేయటం గమనించాడు. జాగ్రత్తగా నడుస్తూ ఓ కంట ఆ మనిషిని చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. అంతే కాలికి రాయి తగిలి కిందకు పడి పోయాడు . ఈ హడావిడిలో ఆ మనిషి ఆ మూట లాక్కుని పోవటం గమనించిన రామచంద్రయ్య అతని వెంటపడి మూటని లాక్కోబోయాడు. అతను ఆ మూట తనదే అని రామచంద్రయ్య మీదే దొంగతనం అంటగడతాడు.

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే తననే దొంగ అని కటకటాలు లో పెడతారు. అయ్యో రామా అనుకుంటూ తెలిసిన కరణం గారి ద్వారా అల్లో లక్ష్మణా అనుకుంటూ బయట పడతాడు.
కరణం గారి భార్యని కలిసి జరిగింది చెప్పి, మీ అప్పు త్వరలోనే తీరుస్తానని మాటిచ్చి . తిరిగి ఊరుకి బయలు దేరతాడు రామచంద్రయ్య.

ఇదేం ఖర్మరా బాబు అని ఏడుస్తు తిరిగి ఇంటికి బయలు దేర, మార్గ మధ్యంలో ఓ దుర్గాలయం లో కూర్చుని, ఈ కలికాలం లో న్యాయానికి రోజులు లేవు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టైంది  అని  దుర్గమ్మతో తన బాధను వెళ్ళ బోసుకుంటాడు.

దుర్గమ్మ కరుణించినట్లుగానే గుడి మూల ఓ మూట కన పడుతుంది. అటు ఇటు చూస్తాడు ఎవరైనా ఉన్నారా పోగొట్టుకున్నవారు అని. ఎవ్వరూ కనపడరు. తీసుకోవాలా వద్దా అని ఓ నిముషం ఆలోచిస్తాడు. తరువాత, దుర్గమ్మ నా మొర విన్నది అనుకొని సంతోషంతో దుర్గమ్మ ప్రసాదం అని ఆ మూటను స్వీకరించి  ఆ డబ్బులతో ఓ చెరుకు తోట కొని ఆనందంగా తిరిగి ఇంటికి బయలుదేరతాడు రామచంద్రయ్య.
ఓ ఆరు నెలల తరువాత మళ్మీ పట్నం వచ్చి అప్పు తీరుస్తాడు. ఆనందంగా ఉంటాడు.
మన కష్ట సమయం లో మనకి దేవుడు ఎప్పుడు తోడుగా నిలుస్తాడు. కానీ ఒపిగ్గా  ఉండాలి  మనం.

You May Also Like

2 thoughts on “దుర్గమ్మ అనుగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!