మాతృత్వం

మాతృత్వం

రచయిత :: నెల్లుట్ల సునీత

ఏమండీ లేవండి! పొద్దున్నే ఈ టీవీ గోల ఒకటి పని చేసుకో కుండా….. ఈరోజు ఆదివారం కదా?! అంటూ టీవీ కట్టేసి చిర్రున లోపలికి వెళ్ళింది అన్నపూర్ణ,

రంగారావు లేచి వంట గదిలోకి వెళ్లి ఏమోయ్ కోపం వచ్చిందా….?
సారీ ఏం చేయాలో చెప్పు చేస్తాను అంటూ ఊరడించే ప్రయత్నం చేశాడు,
ఉప్మా చేద్దామనుకుంటున్నాను ఉల్లిపాయలు కోయవచ్చు గా ఆలా చూస్తూ ఉండకపోతే అంటూ ఉల్లిపాయలు ప్లేటు అందిస్తూ అన్నది అన్నపూర్ణ,
సరే కోస్తా అంటూ ఉల్లిపాయలు తీసుకున్నాడు రంగారావు…

అన్నపూర్ణ ఉప్మా చేసి వినయ్….రా….నాన్న… తినిపిస్తాను ట్యూషన్ కి వెళ్ళాలి కదా టైం అవుతుంది అంటూ పిలిచింది ,కొడుకుని

ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆత్మీయతను అందిస్తున్నారు దంపతులిద్దరూ.

వస్తున్నా అమ్మ….. అంటూ వినయ్ అమ్మ పిలుపుతో బాల్కనీ లో ఉన్న పూల మొక్కలకు నీళ్ళు పోస్తున్న వినయ్ పరుగున కిచెన్లోకి వచ్చాడు.
అన్నపూర్ణ రంగారావుకు టిఫిన్ పెట్టి అందించింది వినయ్ కి తినిపిస్తూ ఎలా ఉంది…. ఉప్మా …?అంటూ అడిగింది అన్నపూర్ణ. ఓ ……చాలా ….బాగుందమ్మా అంటూ తింటున్నా డు వినయ్.
ఏంటి …..?నీ కొడుకునే అడుగుతావు కానీ నన్ను అడగవా…. అంటూ అన్నపూర్ణను అడిగాడు రంగారావు.
వాడు నా లోకం….. వాడే నా ప్రాణం అండి… వాడు చెబితే నాకు తృప్తిగా ఉంటుంది అన్నది అన్నపూర్ణ,
ఓహో…. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకే పట్టు అంటూ జోక్స్….
.
వేస్తూ రంగారావు టిఫిన్ ముగించాడు.

వినయ్ రా ……ట్యూషన్ కి టైం అయింది కదా…. త్వరగా అంటూ రంగారావు కేకలు.. అన్నపూర్ణ బ్యాగ్ స్కూటర్ దగ్గరికి తీసుకొని వచ్చి అందిస్తూ…..
వినయ్ …. రామ్మ…త్వరగా అన్నది.
వినయ్ పరుగు పరుగున రావడంతో ఇంటి ముందు గేటు దగ్గర కాలు స్లిప్ అయి కింద పడిపోయాడు…
వినయ్ ….ఏమైంది …..?అంటూ …. బ్యాగ్ కింద పడేసి పరుగున కంగారు పడుతూ వచ్చి పట్టుకుంది.

అమ్మ…. అంటూ…. వినయ్ కాళ్లు పట్టుకుని ఏడుస్తున్నాడు… బాధను భరించలేక….
ఏమైంది నాన్న ఊరుకొ….. ఏం కాదు అంటూ సముదాయ ఇస్తున్నట్లుగా….
వినయ్ నీ పట్టుకుని నెమ్మదిగా సోఫాలో కూర్చో పెట్టి కాలుకు జండుబామ్ రాసి
తడి క్లాత్లోతో చుట్టింది అన్నపూర్ణ.
రామారావు ఏం కాదు చిన్న దానికే ఎందుకు అంత కంగారు పడతావు అన్నపూర్ణ అన్నాడు, అన్నపూర్ణ కళ్ళల్లో నీరు నిండి మెరుస్తున్న కళ్ళను చూస్తూ….

ట్యూషన్ వద్దు ఏం వద్దు ఈరోజు అంటూ క్యాన్సిల్ చేసింది అన్నపూర్ణ.
ఇలా… వారి కుటుంబం రోజులు సంవత్సరాలు గడుస్తున్నాయి
ఒక రోజు రంగారావు… స్కూల్ కి వెళ్ళా డు..తన పిరియడ్ తీసుకొని పిల్లలకు హోం వర్క్ నోట్స్ కుర్చీలో కూర్చుని దిద్దుతున్నాడు.

ఒక్క సారిగా చెమటలు వల్లంతా…. నోటి లో నుండి మాట రావడం లేదు ఏదో చెప్పాలనుకుంటున్నాడు….. నొప్పి వల్ల వనికి పోతున్నాడు…..

క్లాసులో కీర్తి అనే అమ్మాయి గమనించి మాస్టారు…
మాస్టారు …..ఏమైంది అంటూ …దగ్గరగా వెళ్లగానే పిల్లలందరూ వచ్చారు… పిల్లల కేకలు విని స్టాఫ్ రూమ్ లో ఉన్న స్టాఫ్ అంతా క్లాస్ రూమ్ కి వచ్చారు..
అక్కడ దృశ్యాన్ని చూసి ఒక్క సారిగా నిశ్చేష్టులయ్యారు….
ఏమైంది సార్ ఏమైంది అని… పట్టుకుని చూసారు ఏం కాదు లేవండి అని అంటూ….. నెమ్మదిగా లేపి….
108కి కాల్ చేసి….. హాస్పిటల్ కి తీసుకెళ్లారు….
చలనం లేకుండా పడి ఉన్న రంగారావును చూస్తుంటే అందరి హృదయాలు ద్రవించి పోతున్నాయి….
డాక్టర్ పరీక్షించి…
సారీ చనిపోయారు అని చెప్పారు…

ఏమైంది డాక్టర్…..గారు… పొద్దున్న ప్రేయర్ లో కూడా బాగున్నాడు…
ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు ఇంత సడన్గా ఇలా ఎలా..? జరిగింది ,అని అడిగారు హెచ్ఎం గారు….
హార్ట్ స్ట్రోక్ కొన్ని నిమిషాలు ముందు తీసుకొచ్చిన బ్రతికి ఉండేవారు అంటూ డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు.

జరిగిన విషయం అంతా అన్నపూర్ణ కి ఫోన్ చేసి చెప్పారు…
హెచ్ఎం గారు.. విషయం తెలుసుకున్న అన్నపూర్ణ కి…. గుండె ఆగినంత పనైంది..
పరుగుపరుగున హాస్పిటల్ కి వచ్చింది.

పొద్దున్నే వెళ్లి వస్తాను అని చెప్పినా భర్త ఇప్పుడు ఈ పరిస్థితిలో రంగారావు ను చూసి… బోరుమని భర్త మీద పడి ఏడుస్తోంది….. అందరూ అన్నపూర్ణ ఊరడిస్తూ…. ఇంటికి తీసుకెళ్లారు.

అంత్యక్రియలు పూర్తయ్యాయి. వినయ్ ని పెంచడం ఆమెకు ఒక సవాల్గా మారింది. పెద్దగా ఆస్తులు ఏమీ లేకపోవడంతో ఉద్యోగం మీదనే బ్రతుకు అంతా ఏమీ చేయలేని పరిస్థితి అన్నపూర్ణాది.
అలా ..

కాలప్రవాహంలో పడి రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి….
వినయ్ ని బాగా చదివిస్తుంది.. వినయ్ చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ…. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు…

వినయ్ కి నాన్న లేని లోటును తీర్చుతూ….అన్ని తానై చూసుకునేది అన్నపూర్ణ…

తెలిసిన బంధువుల ద్వారా సంబంధం చూసి పెళ్లి చేసింది ఘనంగా… భర్త రంగారావు ను తలుచుకుంటూ ఉండి ఉంటే ఎంత సంతోష పడే వారో….అని బాధపడుతూ అప్పుడప్పుడు అన్నపూర్ణ మనసుని కలిచి వేస్తుంటాయి రంగారావు జ్ఞాపకాలు…..
ఇలా గడుస్తున్నాయి ..కొన్ని నెలలు.. సంవత్సరం తర్వాత అన్నపూర్ణ నానమ్మ అయింది.

తరచు అత్తా కోడళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు… వస్తుండేది అప్పుడప్పుడు..
ఇంటి పనులలో…… బట్టలు ఉతికే దగ్గర ప్లేట్లు కడిగే దగ్గర… అన్నపూర్ణ పెద్ద మనసుతో సర్దుకు పోయేది..

అన్నపూర్ణ ఏ పని చేసిన ఏదోవిధంగా వంకలు పెడుతూ ఉంటుంది శ్రావణి.

చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుందని…
శ్రావణికి అహంకారం ఎక్కువ అందగత్తెనని బాగా చదువుకున్నాను అని….

ఒకరోజు వినయ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెద్ద గొడవ వినబడుతుంది….

అన్నపూర్ణ:_శ్రావణి ఎందుకమ్మా ఏ పని చేసినా బాగా లేదు అంటావు ఏం మాట్లాడినా తప్పు పడతావు.
నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా….
పోనీ నేను చేసిన పని నచ్చకపోతే నీవే చేసుకో నేను చేసే పనులు మాత్రమే నాకు చెప్పు.

శ్రావణి:_నేనేం తప్పు పట్టానని అని మీరు అనుకుంటున్నారు. ఇలానే నా …పని చేసేది. గిన్నెలు కడిగితే సబ్బు కూడా పోలేదు.. ఇది అనడం కూడా తప్పేనా….. మీతో మనసు నాకు మనశ్శాంతి లేదు ఆ..
మా పుట్టింటికి పోతాను మీరే ఉండండి.

అన్నపూర్ణ: పోనీ… నేనేం పని చేయాలో చెప్పు తల్లి అదే చేస్తాను.. ఇంత చిన్న విషయానికి అన్ని మాటలు ఎందుకమ్మా అనడం.

ఇదంతా గమనిస్తున్న వినయ్ ఒక్కసారిగా వచ్చి ఆపండి…. ఎప్పుడూ గొడవలు.. ఒక్క రోజు ఇంట్లో మనశ్శాంతి లేదు నాకు… ఇంటికి రావాలి అనిపించట్లేదు అని అన్నాడు.

వినయ్ కూతురు ప్రీతి మూడు సంవత్సరాల అమ్మాయి నాన్నమ్మ ఏమీ అనలేదు అమ్మ దే తప్పు డాడీ అంటూ వచ్చీరాని మాటలతో చెప్తూ దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంది.

శ్రావణి :ఏంటి….?! దీన్ని కూడా ఇలా తయారు చేసింది మీ అమ్మగారు.. నేనే పరాయి దాన్ని అయిపోయాను… అంటూ… ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా.. బెడ్ రూం లోకి వెళ్లి బ్రీఫ్ కేస్ తో వచ్చి మీరే ఉండండి.. నేను వెళ్తున్నాను మా పుట్టింటికి అంటూ…

గుమ్మం వరకు వెళ్ళిన శ్రావణి నీ వినయ్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.

అన్నపూర్ణ:_రామ్మా శ్రావణి ఇప్పుడు ఏం జరిగిందని దీనికి పుట్టింటికి వెళ్తాను అంటూ వెళ్తున్నావు…. అంటూ చేయి పట్టుకో బోతుండగా…

శ్రావణి:_చి… చి.. నా చేయి పట్టుకోవడానికి ఎంత ధైర్యం అంటూ..

చెంప మీద దెబ్బ వేసింది…

దానితో ఒక్క ఉదుటున వచ్చి మా అమ్మను కొడతావా అంటూ శ్రావణి చెంప చెల్లుమనిపించాడు,

గొడవ కాస్త ముదిరింది

శ్రావణి :_మీ అమ్మను చూసుకుని నన్నే కొడతార…. నేను బ్రతకడం వేస్ట్ అంటూ గబగబా లోపలికివెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నెయిల్ పాలిష్ క్యాప్ తీసి తాగబోయే టైంలో అన్నపూర్ణ వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని వద్దు తల్లి నేను నీకు అడ్డు రాను… మీరు మంచిగా ఉండటమే నేను కోరుకునేది… ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకమ్మా…. అంటూ ప్రాధేయ పడుతుంది అన్నపూర్ణ.

వినయ్ వచ్చి నెయిల్ పాలిష్ చేతి లోంచి తీసుకొని డస్ట్ బిన్లో వేస్తూ… రా…. అని నెమ్మదిగా…. శ్రావణి తీసుకొని సోఫా లో కూర్చోబెట్టాడు,

శ్రావణి: నేను మాత్రం ఇంట్లో ఉండను .మీ అమ్మగారు అయినా ఉండాలి నేను ఉండాలి ఏదో ఒకటి నిర్ణయించుకుని చెప్పు అంది.

సరే ఓకే రిలాక్స్ అవ్వు ఏమీ ఆలోచించకు అంటూ ఓదార్చాడు వినయ్,

ఆ రాత్రి అందరూ పస్తులే ఎవరు భోజనం చేయకుండా పడుకున్నారు.

మర్నాడు పొద్దున్నే… అమ్మ… అమ్మ… అంటూ వినయ్ కేకలు నిలబడడంతో అన్నపూర్ణ లేచి కూర్చుంది.

ఏంటి బాబు…. ఏమైంది….?!.. అంటూ దగ్గరికి వెళ్ళింది అన్నపూర్ణ.

త్వరగా ఫ్రెష్ అప్ అవు నీ బట్టలు అన్ని బ్యాగ్ లో పెట్టుకో తొందరగా అంటూ చెప్పి వెళ్ళిపోయాడు…. అన్నపూర్ణ సమాధానం కోసం ఎదురు చూడకుండా నే…

అన్నపూర్ణ వెళ్లి బ్యాగ్ లో తనకు సంబంధించిన మెడిసిన్స్ బట్టలు సర్దుకుంది.

అమ్మ రెడీనా …అంటూ వినయ్ పిలుపుతో… రెడీ నాయనా అంటూ అన్నపూర్ణ…. ఎక్కడికి తీసుకెళ్తున్నా డో కూడా తెలియదు అన్నపూర్ణ కి,

త్వరగా రా అంటూ కార్ స్టార్ట్ చేసాడు వినయ్…

అన్నపూర్ణ ఏమీ మాట్లాడకుండా వెళ్లి కార్ లో కూర్చుంది,

మెయిన్ రోడ్డుకు కారెక్కింది రెండు మూడు మూడు మలుపులు తిరిగిన తర్వాత… కారు ఆ పాడు వినయ్,

రామ్మా అంటూ కార్ డోర్ తీశాడు.. వినయ్,

బ్యాగు పట్టుకుని అన్నపూర్ణ కారు దిగింది. వినయ్ ముందు వెళ్తున్నాడు వినయ్ అనుసరిస్తూ వెళ్తుంది అన్నపూర్ణ.

ఇక్కడే ఉండు అమ్మ నువ్వు అంటూ వినయ్ లోపలికి వెళ్ళాడు, అన్నపూర్ణ చెట్టుకింద సిమెంట్ బెంచీ ఉంటే బ్యాగ్ అక్కడ పెట్టి కూర్చుంది. చుట్టూ పరిసరాలను గమనిస్తూ వుంది
ఇంత ముందు పరిసరాలను చూసినట్టు గుర్తుకు వచ్చి రాన్నట్టు అనిపిస్తుంది. అన్నపూర్ణ కి ఆలోచనలో పడిపోయింది.

అమ్మ రా అంటూ వినయ్ పిలుపుతో ఒక్క సారి ఉలిక్కి పడి… ఆలోచనల నుంచి బయట పడింది.

రామ్మ మీకు గది చూపిస్తాను అంటూ ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి.

వినయ్ తన పర్స్ లోంచి 500 రూపాయల నోట్లు నాలుగు తీసి
అమ్మా ఇవి ఉంచు నీ దగ్గర అని ఇచ్చాడు.

నేను వెళ్లి వస్తాను అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను అంటూ….. వెళ్ళిపోయాడు వినయ్…

అక్కడికి వచ్చిన అమ్మాయి ని అనుసరిస్తూ అన్నపూర్ణ తన గారి దగ్గరికి వెళ్ళింది.

ఇదే అమ్మగారు మీ గది వెళ్ళండి అని తాళం తీసింది అమ్మాయి.

అన్నపూర్ణ కు ఎక్కడికి వచ్చాను ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి.మనసంతా ఏదో తెలియని బాధ ఆవరించి ఉంది అన్నపూర్ణ లో…

ఆ వచ్చిన అమ్మాయి బెల్ కాగానే ప్లేటు తీసుకుని రండి అమ్మగారు భోజనానికి అంటూ చెప్పి వెళ్ళిపోయింది.

ఇలా రోజులు గడుస్తున్నాయి మొదట కొంచెం ఇబ్బంది అనిపించినా.. అలవాటయిపోయింది.
కొడుకు మీద మనవరాలు మీద కోడలి మీద మనసంతా లాగుతూ ఉంటుంది అన్నపూర్ణ కి… చూస్తుండగానే మూడు నెలల కాలం గడిచిపోయింది.

నానమ్మ నానమ్మ నన్ను చూడు నాన్నమ్మ ప్లీజ్ నానమ్మ నానమ్మ అంటూ చేతులు తల కేసి కొట్టుకుంటూ ఏడుస్తుంది ప్రీతి… అమ్మాయి ఏడుపు కు నిద్ర నుండి లేచారు శ్రావణి వినయ్

వినయ్ వెంటనే లైట్ వేసాడు ప్రీతి ని తన కౌగిట్లో తీసుకొని ఏంటమ్మా ఏమైంది ఏంటి?!… కళ్ళు తెరు ఇదిగో నాన్నని చూడు… నేనురా మీ అమ్మను ఇదిగో చూడు అంటూ అటు ఇటు ప్రీతి తలను తిప్పుతుంది.

ప్లీజ్ నానమ్మ ప్లీజ్ మమ్ములను వదిలి వెళ్లకు నానమ్మ అంటూ ఏడుస్తుంది ప్రీతి
వినయ్ ప్రీతి నుదురు పట్టుకుని చూశాడు శరీరం విపరీతమైన జ్వరం తో కాలిపోతుంది అయ్యో ఏమైంది బాగా జ్వరం ఉంది టేబుల్ పై ఉన్న జ్వరం మాత్ర తెచ్చాడు.

ప్రీతి కళ్ళు తెరిచి చూసింది కానీ తల్లిదండ్రులను గుర్తించే స్థితిలో లేదు తండ్రి అతికష్టం మీద ప్రయత్నించి మాత్ర వేశాడు

తల్లి నుదురుపై తడి గుడ్డ వేసి పడుకోబెడుతూ ప్రీతిని జో కొడుతుంది
నానమ్మ నానమ్మ అంటూ తెల్లవార్లు నిద్రపోకుండా కలవరిస్తూనే ఉంది ప్రీతి జ్వరం అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు తెల్లవారింది.

ప్రీతి ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టరు ప్రీతిని పరిశీలించి తల్లిదండ్రులను పిలిచి ప్రీతికి నానమ్మ ఉందా…?! అంటూ ప్రశ్నించాడు, తీక్షణంగా వారి వైపు చూస్తూ…ఉంది డాక్టర్ గారు కాకపోతే అనాధాశ్రమం లో ఉంది. అన్నాడు వినయ్

వెంటనే ఆమెను ఇంటికి పిలిపించండి లేదంటే అమ్మాయి కష్టం ఆలోచించే టైం లేదు ఆ తర్వాత మీ ఇష్టం అంటూ లోపలికి వెళ్ళాడు డాక్టర్ నిర్లిప్తంగా…

డాక్టర్ సలహా మేరకు అనాధాశ్రమం లో ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్ళాడు వినయ్

అక్కడ సంభాషణ ను విని నిశ్చేష్టుడయ్యాడు.

అనాధాశ్రమం సూపరిండెంట్ కమల అమ్మ అ 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మీకు పిల్లలు లేరని ఒక బాబు ని తీసుకుని వెళ్లారు. మీ దంపతులిద్దరూ గుర్తుపట్టారా నన్ను మీరు అంటూ అడిగింది కమల అన్నపూర్ణ ను చూస్తూ

నేను ఈ ఆశ్రమానికి సూపరిండెంట్ కమలని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది కమల ఒకసారి గుర్తు చేద్దామని అన్నపూర్ణ ఆశ్రమానికి వచ్చినప్పుడు కమల మెడికల్ లీవ్ లో ఉన్నది అన్నపూర్ణ కొంచెం ఆయాస పడుతున్నట్లు కనపడింది కళ్ళల్లో నీరు చేరింది కాబోలు కళ్ళు మెరుస్తున్నాయి,

గుర్తొచ్చింది అంటూ అన్నపూర్ణ ఎలా ఉన్నావ్ అమ్మ అంటూ అడిగింది

నేను బాగున్నాను తల్లి మీరు ఏంటి ఈ ఆశ్రమంలో ఇక్కడ ఉన్నారు

మీరు ఆశ్రమం నుంచి తీసుకెళ్లిన బాబు లేరా మీ దగ్గర అంటూ సమాచారం అడుగుతుంది కమల,

నాకు పిల్లలు లేరని మేమిద్దరం వచ్చి ఈ అనాధాశ్రమం నుంచి తీసుకెళ్లిన బాబు పేరు వినయ్ అని పెట్టుకున్నాను ఎంతో గారాబంగా పెంచి ఉన్నత చదువులు కూడా చదివించాము మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు మంచి సంబంధంతో పెళ్లి కూడా చేసాము నాకు మనవరాలు కూడా అని చెప్పింది అన్నపూర్ణ,

మరి మీరు ఏంటమ్మా? ఈ పరిస్థితిలో అంటూ అడిగింది కమల,

తరచు కోడలికి నాకు చిన్న చిన్న గొడవ వల్ల ఇక్కడికి వచ్చాను అమ్మ నేను అంటూ సమాధానం చెప్పింది అన్నపూర్ణ,

దిక్కు మొక్కు లేని ఒక అనాధను మీరు తీసుకుని ఎంతో ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వాన్నిచేసిన తర్వాత మీకీ పరిస్థితి కల్పించాడ….
ఇదేమి న్యాయం అమ్మా….
ఇలాంటి కొడుకులు ఉండ బట్టే వృద్ధాశ్రమాలు అనాధ ఆశ్రమాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులను ఆశ్రమాలలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు ఇదెక్కడి మానవత్వం…..సమాజమంతా బ్రష్టు పట్టి పోయింది ఒకరిని చూసి మరొకరు ఇలా తయారవుతున్నారు అంటూ ఎంతో ఆవేదనతో కమల మదనపడుతూ తన ఆలోచనలను చెప్పింది.

ఇదంతా వింటున్న వినయ్ ఒక్కసారిగా వచ్చి….
అమ్మా నన్ను క్షమించు అంటూ రెండు కాళ్ల మీద పడి బోరున ఏడుస్తున్నాడు అన్నపూర్ణ కాళ్లు పట్టుకుని వదలకుండా

లే నాయనా అని అంటూ అన్నపూర్ణ లేపడానికి ప్రయత్నించింది
కానీ వినయ అమ్మ కాళ్ళను గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు నన్ను క్షమించు అమ్మా అంటూ….
నేను తప్పు చేశాను అమ్మ…..
మంచి మనసున్న అమ్మతనాన్ని గుర్తించక…. నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాను.. నాకు తగిన శిక్ష వేయమ్మ నువ్వు ఏ శిక్ష విధించిన నేను సంతోషంగా స్వీకరిస్తాను.
అంటూ ఏడుస్తున్నాడు….

లే బాబు లే నాయన అంటూ అన్నపూర్ణ
కొడుకును పైకి లేవదీసింది తన శక్తినంతా ఉపయోగిస్తూ..

దేవత లాంటి అమ్మ మనసును అర్థం చేసుకోకుండా బాధ పెట్టినందుకు నాకు భగవంతుడు తగిన శిక్ష విధించ డామ్మా

నాకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ బోరున విలపిస్తున్నాడు వినయ్

ఏమైంది నాకు చెప్పు నాయనా ఏమైంది అంటే అన్నపూర్ణ అడుగుతుంది.

నీ మనవరాలు నీకోసమే కలవరిస్తుంది మూసిన కన్ను తెరవకుండా హాస్పిటల్ లో పడి ఉంది రామ్మా ఇంటికి వెళ్తాము మనం మన ఇంటికి వెళ్దాం రామ్మా నువ్వు అంటూ.. వినయ్ ఏడుస్తున్నాడు.
ఊరుకో వినయ్ ఏంటి పిల్లాడిలా అంటూ అన్నపూర్ణ ఊరడించి

గదిలోకి వెళ్లి బ్యాగ్ సర్దుకుని

హాస్పటల్ కి వెళ్లారు
ప్రీతీ అలానే కలవరిస్తూ ఉంది
అన్నపూర్ణ వెళ్లి ప్రీతి నా బంగారు తల్లి కళ్ళు తేరువమ్మా నేను మీ నానమ్మ ను వచ్చాను నీ దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంటూ…. ప్రీతి ను అటు ఇటు కదుపుతోంది అన్నపూర్ణ.

ప్రీతి చెవిలో సన్నగా నానమ్మ కొంత వినపడింది ఏమో…..
ఒక్కసారిగా లేచి కూర్చుంది.. కళ్ళకి ఎదురుగా నాన్నను చూసి గట్టిగా కౌగిలించుకుంది.

శ్రావణి వచ్చి అన్నపూర్ణమ్మ రెండు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అమ్మ…
మీరు నాకు అత్తగారు కాదు ఇప్పటినుంచి అమ్మ మీరు నాకు
అని ఏడుస్తుంది శ్రావణి.

లే తల్లి లే అంటూ అన్నపూర్ణ శ్రావణి నీ లేవదీసి కళ్ళు తుడిచింది తన పైట కొంగుతో..

పశ్చాత్తాపంతో మనసులో బాధ పడుతున్నారు శ్రావణి వినయ్ లు
తన గతాన్ని శ్రావణి తో వివరించాడు.

తెలుసుకున్న శ్రావణి తను చేసిన పనికి తనలో తానే బాధపడుతూ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని నిర్ణయించుకుంది,

అందరూ సంతోషంగా కార్లో ఇంటికి వెళ్లారు,

వినయ్ జీవితంలో వెలుగు పువ్వులు విరబూసాయి. ఆకాశం నుండి వెన్నెల ధారలు భూమిని చేరాయి వెయ్యి కాంతుల వెలుతురు పరిచిన వెండి కొండల వాకిలి కాంతులీనుతుంది
ఆశ్రమం నుండి ఇ తమ వాకిట్లో అడుగుపెట్టిన నానమ్మను పట్టువస్త్రాలతో ఒక దేవతలా కనిపించింది అన్నపూర్ణమ్మ ప్రీతి చిరునవ్వులు చింతిస్తూ నానమ్మ తన వైపు రమ్మని చేతులు చాచి ఆహ్వానిస్తుంది ప్రీతి అంత సంతోషం తన ఒంట్లో సమకూర్చినట్లు అమితమైన ఉత్సాహం ఒక్కసారి అన్నపూర్ణమ్మ గట్టిగా ముద్దు పెట్టుకుంటూ నువ్వు ఎప్పుడూ మాతోనే ఉండాలి అంటూ ఆలింగనం చేసుకుంది అమితానందంతో….

You May Also Like

One thought on “మాతృత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!