తోడు నీడ
రచన: సుజాత కోకిల
ఓ మేఘమాల అందాల ధ్రువతార
నీవు మాకు తోడునీడైవెై కదలిరా
మా వెన్నంటే ఉంటావని ఎన్నో కలలు
కంటున్న రైతన్నలం ఓ మేఘమాల
ఒక్కసారి రావ నీ రాకకై పరితపిస్తూ
నిద్రాహారాలు మాని నీకై పరితపిస్తూ
వాన జల్లులు కురిపిస్తావని మా కళ్ళు
కాయలు కాసేలా నీ వంకే ఎదురు చూస్తూ
ఇంకా రావేంటి అనుకుంటూ ప్రశ్నార్ధకంగా
నీ వైపే చూస్తూ అయ్యో ఇంకా రావేంటి
ఓ మేఘమాల ఒకసారి వచ్చిపో
వాన జల్లులను కురిపించిపో మా ఆశలకు
తొలిమెట్టు వేసి అన్నపూర్ణ తల్లిలా
కదిలివచ్చి మా ఆకలి దప్పులను తీర్చి
మాపై కరుణాకటాక్షం కురిపించి
మా రైతన్నలను ఆదుకో ఎప్పుడు మాకు
కరువన్నది లేకుండా వాన జల్లులను
కురిపించి నీ చల్లని దీవెనలు అందించి
మాపై కరుణాకటాక్షం చూపించు తల్లి!