విజ్ఞానమా నీకు వందనం

విజ్ఞానమా నీకు వందనం

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

శాస్త్రవిజ్ఞానం చంద్రమండలం తాకింది
ఆధునిక విజ్ఞానం విశ్వాన్నీ దాటింది
సాంకేతిక పరిజ్ఞానం సవాళ్ళతో ముందుకెళుతుంది
జ్ఞానం విజ్ఞానం పోటీతో విస్వంతరాలలో వ్యాపించింది

ఆధునిక మానవుడు
అరచేతిలో చందమామను చూపిస్తూ
ఆకాశానికి నిచ్చేనలు వేస్తూ
తన సత్తాను సామర్ధ్యాన్ని చాటుతున్నాడు

ప్రపంచాన్ని చుట్టేస్తూ
గగనం లో విహరిస్తూ
విశ్వాన్ని శాసిస్తూ
విజ్ఞాన దాహార్తిని తీర్చుకుంటున్నాడు

మేధాశక్తికి పనిచెపుతూ
మేధావర్గాన్ని సమీకరిస్తూ
మేధావితననికి
నిరంతరం పదునుపెడుతున్నాడు

అందుకే కాలమానం వేగం పెరిగింది
దూరంతారాలు దగ్గరవుతున్నాయి
బంధాలు దూరమవుతున్నాయి
కాలం తో పాటు మనిషి పోటీ పడుతున్నాడు

చందమామని అందుకున్నామని సంబరపడాలో
చక్కని ప్రకృతి చిన్నాభిన్నమైందని భాదపడాలో
భవిత భారమవుతుందని విచారపడాలో
ఏది ఏమైనా అభివృద్దికి ఆనందపడక తప్పదు.
అందుకే విజ్ఞానమా నీకు వందనం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!