నీ ప్రేమ

నీ ప్రేమ

రచన:: జయకుమారి

నాకు ఊపిరి పోసిన నీ ప్రేమ
నాలో ఆశలకు రూపం ఇచ్చిన నీ ప్రేమ.

నా హృదయానికి స్పందనలు నేర్పిన నీ ప్రేమ
నాలో వలపు కు సరిగమలు నేర్పిన నీ ప్రేమ

నను నా నుంచి దూరం చేసిన నీ ప్రేమ.
నను నీలా మార్చిన నీ ప్రేమ.

నీ తలుపు లేని అర క్షణం కూడా
నను నాలో ఉండనివ్వని నీ ప్రేమ.

నువ్వు ఒక క్షణం  మౌనంగా ఉన్నా
భరించలేనంతగా నను మార్చిన నీ ప్రేమ

నువ్వు చిరుకోపం తో అలిగి నను దూరం పెట్టి
మన ప్రేమ కథ ముగిసిపోయింది అనుకున్న ప్రతిసారి నీ జ్ఞాపకాలు నన్ను నాకు కొత్తగా చూపిస్తూ..

మళ్ళీ మళ్ళీ నాతో మరో ప్రేమ కావ్యం రాయిస్తునే ఉన్నాయి నీ ప్రేమ జ్ఞాపకాలు.

మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త గా ప్రేమించమని
నను నీ వైపు నడిపిస్తుంది నీవు పంచిన నీ ప్రేమ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!