మాధురి

మాధురి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మాధవి కాళ్ల

సీత కాఫీ తీసుకొని రా అని అడిగాడు రాము.
హ వస్తున్న అండి అని కాఫీ తీసుకొని వెళ్ళింది సీత.
సీత వాళ్ళకి ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయి మాధురి జాబ్ చేస్తుంది. చిన్న అమ్మాయి సింధు ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు పేరు వాసు. రాము మేస్త్రి పని చేస్తాడు. సీత కూడా ఆ పని చేస్తున్నారు. కళ్యాణ్ వాళ్ళ ఊరు రాము వాళ్ల ఊరు ఒకటే. మొన్న ఆగస్ట్ లోనే నిశ్చితార్థం జరిగింది వాళ్లకి. నిశ్చితార్థం జరిగే సమయంలో సీత కి ఒంట్లో కొంచెం బాగాలేదు. అయినా నిశ్చితార్థం బానే జరిగింది ఆ రోజు సాయంత్రం రాము వాళ్ళందరూ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు కాసేపు కూర్చొని మాట్లాడుకుని వచ్చేసారు.
రాము వాళ్ళు ఉండేది హైదరాబాదులో నిశ్చితార్థం మాత్రం వాళ్ల ఊర్లో జరిగింది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు రాము వాళ్ళు. కొన్ని రోజులు తర్వాత కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య దసరా పండక్కి హైదరాబాద్ వచ్చారు  బాగానే  ఉన్నారు సిటీ మొత్తం తిరిగారు కళ్యాణ్ వాళ్ల అన్నయ్య వాళ్లు.
ఒకరోజు రాముడు సీతతో ఏంటి సీత ఇది ఎప్పుడు చూడు నీరసం గా ఉంటున్నావు ఏమైంది అని అడిగాడు రాము.
మొన్న ఊర్లో నాకు ఒంట్లో బాలేదు ఏమైందో తెలియట్లేదు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పింది సీత  అయితే ఏమో సరే వెళ్దాం అని అంటాడు రాము. రాము పనిలో పడి సీతని హాస్పిటల్ కి తీసుకెళ్లడం మర్చిపోతాడు. ఈ విషయం గురించి వాళ్ళ పెద్దమ్మాయి రాముని అడిగితే టైం లేదు చాలా పనులు ఉన్నాయి. అని చెప్తాడు రాము. ప్రతిరోజు సీతకి రాముకి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ప్రతి చిన్నదానికి గొడవేనా ప్రతి పెద్ద  దానికి గొడవే  జరుగుతూ ఉండేది. ఎంతైనా సొంత మేనకోడలు కాబట్టి అపురూపంగా చూసుకుంటున్నాడు రాము.
ఒకరోజు సీత తన కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది ఆ విషయం తేలిక తెలిసిన వాళ్ళు రాముకి ఫోన్ చేసి చెప్పారు. అయినా రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత ఏం అనలేదు ఏమన్నారు ఏంటి డాక్టర్ అని అడిగారు రాము. ఒకరోజు సడన్గా రాము సీత హాస్పిటల్  తీసుకెళ్లాడు. కానీ సీత నేను రాను అని వాదించింది అప్పుడు ఎందుకు తీసుకెళ్లలేదు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు అని బాధపడుతూ అని అడిగింది రాముని. కాసేపు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు అప్పుడు డాక్టర్  రిపోర్ట్స్ అన్ని చూసి కరోనా అని చెప్పారు. రాముకి అనుమానం వచ్చి తను కూడా టెస్ట్ చేయించుకున్నాడు తనకు కూడా కరోనా అని చెప్పారు. కొన్ని రోజులు తరువాత మా అమ్మాయి పెళ్ళి ఉంది డాక్టర్ గారు అని ఏడ్చుస్తున్నారు.. ఈ విషయం పిల్లలకు తెలిసి అవాక్కయ్యారు.. ముగ్గురు ఏడ్చూస్తు హాస్పిటల్ కి వెళ్లారు.
అమ్మ, నాన్న మీకు కరోనా వచ్చిందా అని ఏడుస్తూ అడిగింది సింధు. మీరు ఏం భయపడద్దు. మా ఇద్దరికీ ఏం కాదు అని ధైర్యం చెప్పాడు రాము. పెద్ద అమ్మాయి కూడా అదే ధైర్యం తో మీరు జాగ్రత్త నాన్న నేను చెల్లిని తమ్ముడిని చూసుకుంటాను అని చెప్పింది. వాసు సింధుని బయటకు తీసుకొని వేళ్ళు అని చెప్పింది పెద్ద అమ్మాయి మాధురి. సరే అక్క అని చెప్పి ఇద్దరు బయటకు వెళ్లారు. రాము కొంచం బాధగా మాధురి పెళ్ళి ఏర్పాట్లు చేయండి. మామయ్య వాళ్ళకి చెప్పు మీ అమ్మ నా మీద కోపంగా ఉంది. ఈ విషయలు చెల్లి , తమ్ముడికి చెప్పకు వాళ్ళు ఇంకా బాధ పడతారు అని చెప్పారు రాము. సరే నాన్న మీరు బాధ పడకండి. అమ్మ ఎక్కడ ఉంది అని అడిగింది మాధురి.
ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది వేళ్ళు అని చెప్పాడు రాము. సరే నాన్న నేను వెళ్లి వస్తాను.. అమ్మ ఇంకా నాన్న మీద కోపంగా ఉన్నావా అని అడిగింది మాధురి. అవును నీకు తెలీదా మాధురి అమ్మ ప్లీజ్ నాన్న చాలా బాధ పడుతున్నారు. మీ ఇద్దరు మధ్య గొడవలు జరిగితే అసలు బాగోదు కొన్ని రోజుల  తరువాత నీ కూతురికి పెళ్లి చేసున్నావు. ఈ సమయంలో ఇలా జరగడం మంచిది కాదు అమ్మ అని చెప్పింది మాధురి. సరే అమ్మ మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది మాధురి. కొన్ని రోజుల తరువాత సింధు పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. ఆ పెళ్ళిలో రాము తన కుటుంబం తో చాలా ఆనందంగా ఉన్నారు. మాధురి వచ్చి అమ్మ నాన్న మీద కోపం పోయిందా అని అడిగింది మాధురి. అది కోపం కదే ప్రేమ నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళలేదు అని ఆయన చాలా బాధ పడ్డారు. రెండు నెలలు నుంచి మీ నాన్నతో పనికి వెళ్ళడం లేదు . నా ఆరోగ్యం బాగాలేదు నువ్వు జాబ్ చేస్తున్నావు. నువ్వు ఒక అబ్బాయి ప్రేమించావు అతను ప్రెసెంట్ అమెరికా లో ఉన్నాడు కదా అతను మీద ప్రేమ తగ్గిందా నీకు అని అడిగింది సీత. లేదు అమ్మ  విశ్వ ని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. తను ఏమి చేసున్నా డో అని  ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పింది మాధురి. అదే మాధురి ప్రేమ అని చెప్పింది సీత. సరే కానీ నాన్న పిలుస్తున్నారు అని రాము దగ్గరకు వెళతారు. సింధుకి అప్పగింతలు చేస్తారు.

You May Also Like

One thought on “మాధురి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!