దొరికిన ప్రేమ

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

దొరికిన ప్రేమ

రచయిత :: సుజాత.కోకిల

ఎమండీ టీ తీసుకోండి.అంటూ వచ్చింది అంజని ఆహా అక్కడ పెట్టి వెళ్లు అన్నాడు ప్రేమ్.హుషారుగా ఈలా వేస్తూ మొహాన్ని అద్దంలో చూసుకుటూ తల దువ్వుకుంటున్నాడు.తన వైపు చూడనట్టుగా ఉన్నాడు ఈ దొరగార్కి.హుషారు.ఎక్కువైందే సరేనండీ ఇక్కడ పెట్టాను వెళుతూ అంది చూస్తాను ఆనుకుంటూ అంజూ వెళ్తున్నావు ఆగు అబ్బో మీరు.బిజీగా ఉన్నారు. వెళ్ళక మరి మీ సంగీతం వింటూ కుర్చోవలా నాకు పని.ఉంది వెళ్ళుతాను ప్లీస్.అంజూ అన్నాడు. అలా రండీ దారికి అని మనసులో అనుకుంది ఏమండీ ఈ రోజు అంతా హుషారుగా ఉన్నారు. మరి కారణం ఏంటో తెలుసు కోవచ్చా శ్రీవారు అంటూ బుంగమూతి పెడుతూ అడిగింది

అయిన కారణాలు.ఎమ్ంటాయి. లెండీ మీ మొగవాళ్లు అంతేండీ అవసరం ఉంటే ఒకలాగా అవసరం.లేకుంటే మరోలాగా.ఉంటారు మీ మొగవాళ్ల మీ నైజమే. అంతండీ చురచుర చుస్తూ అంది.అంత.ఉలుకు. ఎందుకండీ శ్రీమతిగారు ఈ రోజు నీ మాములు ఇవ్వలేదని కోపంగా ఉన్నారా ఆ హా ఏంలేదు.చెప్పండి

అంది చాల కోపం వచ్చినట్టుందే.అంటూ దగ్గరగా వచ్చి నవ్వుతూ అన్నాడు ఆహా ఎందుకు ఉంటుంది కోపం మీరు.ఏడువు.మన్నప్పుడు ఏడవాలి నవ్వమన్నప్పుడు నవ్వాలి మీకు మూడు వస్తే రమ్మంటే రావాలి అంతే కదండీ శ్రీవారు నన్ను.కావాలనే అలా ట్రీట్ చెస్తున్నారు రుసరుసలాడుతూ అంది.

ఆహా అలా ఎమ్ కాదు అన్నాడు అవునా ఇప్పుడు ఎందుకు అంత హుషారుగ ఉంటూ నన్ను చూసి చూడనట్టుగా ఎందుకు ఉన్నారు నన్ను ఏడిపించాలనే కదా నేను వచ్చింది తెలిసి కూడ అక్కడ పెట్టి వెళ్ళ మంటార .వెళుతూ అంది అది కాదు బుజ్జికన్న అంటూ వెళ్ళకుండా రెండు చేతులతో ఆపుతూ నీవు వస్తుంటే . నీ అందెల సవ్వడులు నాగుండెను తట్టి లేపుతూ నా తుంటరి వయస్సు అగలేక గిలిగింతలు పెడుతుంటే నీ కోసం నా మనసు పరి తపిస్తుంది. డియర్ నిన్ను ఉడికించాలని.నిన్ను నా కౌగిలిలో బందించాలని అలా ఉడికించాను అంతే డియర్  అంటూ గట్టిగా. కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చెస్తూ ఇప్పుడు ఎలా ఉంది డియర్  కొంటెగా నవ్వుతూ అన్నాడు

మాట రావడం లేదు ఒక్కసారిగా ఊపిరి అగినట్టూగ అయింది.ఇంకా.ఏం చెపుతాను నా బొంద అనుకుంది మనసులో వీళ్లని.అర్థం చెసుకోవడం ఎవరి తరం కాదు అనుకుంది ఎమండీ.వదులండీ ఊపిరి అగడం లేదండీ అంది మరి ఎమంటావు నన్ను నవ్వుతూ అన్నాడు ఇంక ఎమి అనను వదలండీ అంది గోముగా వదలగానే అమ్మయ్య అంది.ఎది వచ్చిన ఆగరు కదా అంది నవ్వుతూ మీరు.నా దగ్గర ఉన్నంత సేపు నన్ను నేను మరిచి ప్రపంచాన్ని జయించినంత.సంతోషంగా ఉంటుందండీ నాకు అంది ఆనంద.భాష్పాలతో

నవ్వుతూ భుజాలపై చేతులు వేసి ముక్కుతో గిలిగింతలు పెడుతూ. నిన్ను చుసి చడనట్టుగా ఉన్నందుకు కోపమా అన్నాడు అదే మండుద్ది మరి నాకు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు నా పెళ్లి అయినాటి నుండి ఒక్కసారయిన బైటకు తిసుకు వెళ్ళమని అడిగాన మిమ్మల్ని ఇబ్బంది పెట్టాన నాకు మీ ప్రేమ ఉంటే చాలండీ. ఎంతటి కష్టాన్నైనా భరిస్తాను మీరే నా ప్రపంచం అంది.ప్రేమగా

మల్లి ఆ మూడ్లోకి వెళ్ళావ నా బుజ్జి కన్న నేను ఉన్నానుగ నువ్వు ఎమ్ పట్టించుకోకు మీరు ఎప్పుడు ఆఫీసులో.ఉంటారు ఇంట్లో నేమో మీ అమ్మ పోరు మీ నాన్నమో ఎటు మాట్లడలేని నిస్సహాయుడు కష్టాలలో కన్నీళ్ళలో నా వెన్నెంటే.నీడలా నన్ను అంటీ పెట్టుకునే ఉంటాయి నా కష్టాలు అంది బాధగా ఏమే ఎక్కడ చచ్చావు నాకు కాఫీ నీళ్లు ఇచ్చేది ఉందా లేదా అంటూ అత్తయ్యగారు అరుస్తున్నారు వస్తానండీ అంటు టిఫిన్.కూడ రడి చేసాను కిందికి రండీ.అంటు వెళ్ళింది.

తనకి.ముందు.కాఫీ ఇవ్వలేదని ఆవిడకి బాధ ఆవిడకే ముందు ఇచ్చేది కాని బ్రేష్ చెసుకుంటుందని ఈయనకు ఇచ్చాక ఇవ్వచ్చులే అనుకుంది అంతలోనే అరుపులు
ఆ.ఆ వస్తున్నాను.అత్తయ్యగారు.అంటు.గబగబా వెళ్ళి కాఫీ ఇచ్చింది.ఏంటే నీ పొగరు పిలుస్తుంటే  అలా పలకకుండా వెళుతున్నావు పెద్దవాల్లంటే  గౌరవం మర్యాదలు లేకుండా పొయింది మీ అమ్మ.గౌరవమర్యాదలు.నేర్పించి.పంపిస్తే.ఇలా ఉండే దానివి కాదు అంది వెటకారంగా ఇప్పుడు ఎమైందని అత్తయ్య మా అమ్మను అంటున్నారు నన్ను  ఎమైన అనండీ కాని మా అమ్మను మాత్రం అనకండీ ప్లీస్ అత్తయ్య మీకు దండం పెడతాను అంది

అత్తయ్య మీ అబ్బాయికి కాఫీ ఇచ్చి వస్తున్నానండీ అంతలోనే మీరు పిలిచారు ఇ మాత్రం దానికే.ఇంత గొడవ పెట్టాల అంటు మామయ్యకు.కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది మామయ్య కాఫీ తిసుకొండీ అంది.అమ్మ అంజని రోజు నీకు ఇ బాధ తప్పద తల్లి అన్నారు బాధగా, అన్నది ఎవరు మామయ్య అత్తయ్యగారే కదా మామయ్య అలవాటైయింది మామయ్య బాధగా నవ్వుతూ అంది అంజూ,టిఫిన్ రడీన అంటు ప్రేమ్ వచ్చాడు.ఆ రండీ అంటూ టఫీన్ ప్లేట్లో పెట్టితినండీ అంది టేబులుపై. కుర్చున్నారు నా కొడుకు. నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు అందుకే అంత పొగరు వచ్చిందే నీకు అసలు వాడ్ని అనాలి అంటు అరుస్తున్నారు.అది విని ప్రేమ్ కు చాల బాధ అనిపించింది అంజూ.వైపుచూసాడు
ఏ బావం.లేదు మొహం చాలా.ప్రశాంతంగా ఉంది తను ఎలా అలా ఉండ గల్గుతుంది. అనుకున్నాడు మసులో
వెళ్ళోస్తాను.అంజూ అంటు ఆఫీసుకు బైలుదేరారు ..సరేనండి అంది.

తను కాస్తా తిని కాసేపు రెస్ట్ తుసుకుందామని బెడ్రూంలోకి వెళ్ళి కొద్దిసేపు కళ్ళు ముసుకుంది అంతే వాంతి.వచ్చినట్టుగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి.అలాగే కళ్ళు ముసుకుంది. అంతలోనే వామ్మో నా కాలువిరిగింది బాబోయ్ అంటు అత్తయ్యగారు అరుపులు వినిపిస్తున్నాయి మెల్లగ లేసి బైటకు వచ్చిచుసింది అత్తయ్యగారు పడిపోయి ఉన్నారు అయ్యొఅయ్యొ అత్తయ్యగారు ఎలా పడిపోయారు నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా ఒక్కరే.ఎందుకు .వెళ్ళారు.అంది మేల్లగ లేపబోయింది.కాని లేపడంసాధ్యం కాలేదు అంతేత్తు మనిషి చాల బరువుగా
ఉంటారు ఉండండి ఇప్పుడే వస్తానని వెళ్ళి పక్కింటి అబ్బాయి సహాయంతో.మంచములో పడుకోబెట్టింది

ఇప్పుడు ఎలా ఉంది. అత్తయ్య జెండుబామ్ రాస్తాను ఉండండి అంది నావల్లకాదే చాల నొప్పిగా ఉందే
జెండూబామ్ తో రాస్తాను మెల్లగా అంది అయినా కాలు కొద్దిగ వాచిపోయింది ఇప్పుడు ఎలా అనుకుంటూ తనకు ఫోన్ చెయాలని హాల్గోకీ వచ్చింది. ఎంటమ్మ.ఆ అరుపులు అని మామయ్యగారు వచ్చారు ఏమైందని అత్తయ్యగారు పడిపోయారు మామయ్యగారు అంది
ఎలా బాత్రూంకు వెలుతు పడిపోయారు కొద్దిగా జాగ్రత్తగా నడవాలని తెలియదా నువ్వు ఏమైనా చిన్నపిల్లవా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి అంటూ అరుస్తున్నారు, ఊరుకోండీ మామయ్య పడిపోతారని ఎవరికి తెలుసు అంది ఫోన్చేసి చెప్పింది ఇప్పుడే వస్తున్నాను జాగ్రత్త అన్నారు సరెనండి త్వరగా రండీ అంది.

ఎమైంది అంటు ప్రేమ్ వచ్చాడు కాళు ప్రాక్చర్ అయిందండి ఆస్పత్రికి తిసుకు వెళుదామండీ అంది త్వరగా వెళ్లి డాక్టరుకు చుపించారు కొద్దిగా బొక్క పక్కకు తొలిగింది అని చెప్పారు.సిమెంట్ పట్టి వెసారు ఆస్పత్రిలోనే పదిరోజులు ఉండాలని చెప్పారు.
రోజు అంజనే దగ్గర ఉండి సపర్యలు చెస్తుంది.చిన్న కొడుక్కి కూతురికి ఫోన్ చెసి చెప్పారు మేము చాల టైడ్గా ఉన్నాము మాకు వీలుపడదని కొడుకు కోడలు అన్నారు కనిసము చుడడానికి కూడ రాలేదు. కూతురు కూడ అమ్మ నాకు పిల్లలతో వీలుపడదు మీ అల్లుడికి ఆఫీసులో వర్కు.చాల ఉంటుంది భోజనానికి ఇబ్బంది పడతారు నేను రాలేను అమ్మ అని ఫోన్చేసి చెప్పింది

అంజనే అన్ని చుసుకుంటుంది చంటీపిల్లను చుసుకున్నట్టుగ చుస్తుంది.ప్రేమ్ చాల బాధ పడుతున్నాడు ఎన్నన్నిమాటలు అన్న ఇంత కోపం కూడ లేదు ఆ కళ్ళల్లో జాలిప్రేమ తప్ప ఇంత చిరాకు లేదు అమ్మ మనసు ఇప్పుడైన మారాలి అంజూని అర్థం చెసుకోవాలి అనుకున్నాడు మనసులో ఎవరు మంచి ఎవరు చెడ్డ అని తెలుకోవాలి ఈ రోజులలో కన్నపిల్లలే పక్కకు పెడుతున్న రోజులు అంతలేసి మాటలు అన్న ఇంత కోపం లేకుండా కోడలు చెయడం చాల గొప్ప అంజూ.కొద్దిగా రెస్ట్ తిసుకొ నేను చుస్తానుగా నీకు కళ్ళుతిరుగుతున్నాయి అన్నావు.

ఎమ్ పర్వలేదండీ.

అత్తయ్య భోజనము చెయండి అంటు కలిపి నోట్లో పెడుతుంది ఇప్పుడు అనిపిస్తుంది యశోదమ్మకు బాధ అమ్మ అంజూ.నా మీద కోపంలేదామ్మ అంది .

ఎందుకు అత్తయ్య

నేను ఎన్ని మాటలు అన్నాను మనసులో ఉంచుకోకుండా నాకు సేవలు చెస్తున్నావు అంది బాధగా .

ఎందుకు అత్తయ్య బాధ పడుతారు మా అమ్మ అయితే ఒక మాట అనదా చెప్పండి చనువు ఉన్నప్పుడే ఆ మాటలు అంటారు మీరు మా అమ్మనే అనుకున్నాను అత్తయ,మీరు బాధ పడకండీ అత్తయ్య అంది

నా కూతురు నాకొడుకు కనీసం చుడడానికి కూడ. రాలేదమ్మ నా కొడుకు ప్రేమ్ కూడ ఒక్కనాడు నన్ను ఎదురించలేదు నీ మంచి మనసుకు దండం. పెట్టాలమ్మ
అదేంటి అత్తయ్య అలా అంటారు ఇది నా భాద్యత అత్తయ్య మీరు బాధపడకండి మా అమ్మ వేరు మీరు వేరు కాదు.అత్తయ్య మిమ్మల్ని రేపు ఇంటికి పంపిస్తారు. మీరు రెస్ట్ తిసుకోండి అత్తయ్య అంటు బైటకు వచ్చింది ఎదురుగా ప్రేమ్ నిలబడి ఉన్నాడు.ఇది అంతా విన్నాడు ప్రేమ్ కళ్ళల్లో నీళ్ళు ధారలుగ కారుతున్నాయి

ఎంటండీ మీరు చిన్నపిల్లాడిలా ఎడకండీ.ఓదారుస్తు అంది.అంజూ నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ కౌగిలించుకున్నాడు.అది.ఆస్పత్రి .అని కూడ గమనించలేదు. ఇలా ఎవరొ ఒకరు ఓపిగ్గా ఉంటే తల్లిదండ్రులకు పిల్లలు బరువు కాదు పిల్లలకి తల్లిదండ్రులు బరువు కాదు అన్నాడు ప్రేమ్ ఇంక ఇలాంటి భార్యలు ఉంటే ఏ ఆశ్రమాలు ఉండవు. సంతోషంతో అన్నాడు

ఏమండీ ఈ పేషంట్ తాలుకు మీరేన అవును డాక్టర్ రమ్మంటున్నారు మిమ్మల్ని సరే పదండీ నమస్తే డాక్టర్ మీ అమ్మగారిని డిస్చార్జి చెస్తున్నాము కౌంటర్లో బిల్లు కట్టిరండీ.సరేనండీ.అంటు కౌంటర్లో బిల్లు కట్టేసి ఇంటికి వచ్చారు.

ఏమండీ నాకు ఒంట్లో ఎలాగో ఉందండీ .

చాల అలిసిపోయినవు అంజూ.రెస్ట్ తిసుకో అన్నాడు ప్రేమ్ .

అలా కాదుర ఒకసారి డాక్టరుకు చూపించాలి చాల నీరసంగా ఉందిరా డాక్టరుకు ఫోన్ చెయ్యి అంది.తల్లి యశోదమ్మ అలాగే అంటు ఫోన్ చెసాడు
డాక్టర్ వచ్చిచుసి కగ్రాజ్యూలేషన్ మిష్టర్ ప్రేమ్ మీరు తండ్రి కాబోతున్నారు అన్నాడు. వస్తాను ప్రేమ్ .

సరేనండి అన్నాడు వారి ఆనందానికి అవదులు లేవు. థ్యాంక్యూ అంజూ అంటు గిరగిరా తిప్పాడు ఏమండీ నాకళ్ళు తిరుగుతున్నాయి దింపండీ అంది సారీసారీ అన్నాడు
నాన్న ప్రేమ్ మా నోర్లు తిపి చెయ్యాలిరా అలాగే అంటూ అందరి నోర్లు పంచదారతో తీపి చెసాడు ఆ ఇల్లు సంతోషాలతో నిండిపోయింది.ప్రేమ్ అంజూ ఒకరినొకరు ప్రేమగా చుసుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!