ప్రేమే శ్వాసగా సాగిపో

ప్రేమే శ్వాసగా సాగిపో 

రచన::శ్రీదేవి విన్నకోట

తన వెచ్చని శ్వాస నన్నుచేరింది. ప్రణయ్ సుతిమెత్తగా పరవశంగా నన్ను హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో సంతోషం కన్నీళ్ళ రూపంలో మెరుస్తుంది. మొహంలో చిరునవ్వు పెదవి అంచుల్లోంచి సమ్మోహనంగా జారుతోంది. నేను అతని భుజాల చుట్టూ చేతులు వేసి అతనికి మరింత దగ్గరగా జరుగుతూ, ఎందుకు ప్రణయ్ ఇంత సంతోషం ఏమైంది అని అడిగాను, దీపు మన పెళ్ళికి అమ్మానాన్న ఒప్పుకున్నారు అంటూ నన్ను మరింత గాఢంగా తన గుండెలకి హత్తుకున్నాడు, నా కళ్ళల్లో కూడా ఆనందం ఫౌంటైన్ లా చిమ్మింది,

మాది ఆరు సంవత్సరాల ప్రేమ నా పేరు దీప్తి, నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో క్లర్క్ గా వర్క్ చేస్తున్నాను. మా ఇద్దరికీ డిగ్రీ సెకండ్ ఇయర్లో పరిచయం అయింది, పరిచయం స్నేహంగా  స్నేహం ప్రేమగా తర్వాత ఇదిగో మా ప్రేమ ఇప్పుడు పెళ్లి గా మారబోతుంది,  ప్రణయ్ వాళ్ళు చాలా శ్రీమంతులు, మాది దిగువ మధ్య తరగతి కుటుంబం, నాకిప్పటికీ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు అంటే అనుమానంగానే అనిపిస్తుంది, కానీ ప్రణయ్  కళ్ళల్లో సంతోషం చూశాక నిజమే అనిపిస్తుంది.

రెండు రోజుల్లో మంచి రోజులు ఉన్నాయి అంట
అమ్మ నాన్నల్ని నిన్ను చూడడానికి తీసుకొస్తాను, త్వరలో మన పెళ్లి, పి పి డుం డుం అంటూ నా దీపూ పెళ్లి కూతురాయెనే అని నన్ను అల్లరిగా ఆటపట్టిస్తూ సంబరంగా పాడుతూ చిలిపిగా నా బుగ్గ పై ఒక ముద్దు పెట్టి నవ్వుతూ రేపు కలుద్దాం అని చెప్తూ అతను వెళ్ళిపోయాడు,

నేను ఆనందంగా నవ్వుకున్నాను, మర్నాడు నేను మామూలుగా బ్యాంకు కి వెళ్ళిపోయాను, నేను వర్క్  చేసుకుంటూ ఉండగా ప్రణయ్ వాళ్ళ నాన్నగారు సోమసుందరం గారు వచ్చారు నీతో మాట్లాడాలి అన్నారు నా వంక చాలా సీరియస్ గా, ఆయన్ని చూడగానే నేను వినయంగా లేచి నిలబడ్డాను, చూడు అమ్మాయి నీతో మాట్లాడాలి ఒకసారి బయటికి వస్తావా అని రెండోసారి గట్టిగా అనడంతో పర్మిషన్ తీసుకుని ఆయనతో బయటకి నడిచాను,

చూడు అమ్మాయి నేను డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చేస్తాను, మీలాంటి అలగాజనం డబ్బు కోసమే మాలాంటి డబ్బు ఉన్న వాళ్ళ వెనుకబడతారు అని నాకు బాగా తెలుసు, మా వాడిని వదిలేయడానికి నీకు ఎంత కావాలో చెప్తే నీ అకౌంట్ లో వేస్తా, నువ్వు మా ప్రణయ్ ని మర్చిపోవాలి అంటూ ఆయన చెప్పాల్సింది చెప్పడం అయిపోయినట్టు మాట్లాడటం ఆపేసారు, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు,మీరు పెళ్లికి ఒప్పుకున్నారని ప్రణయ్ చెప్పాడు అన్నాను ఏడుస్తూ, చిన్న పిల్లోడు చాక్లెట్ కోసం ఏడుస్తూ ఉంటే వాణ్ని మరిపించడానికి అలాగే ఇస్తామని ఏదో ఒకటి సర్ది చెబుతాము కదా, ఇది కూడా అంతే అన్నాడతను, అయితే నన్ను మర్చిపోమని మీ ప్రణయ్ కి చెప్పండి,నాకు కాదు, అతను నన్ను మర్చిపోతే నేను అతన్ని మర్చిపోతాను మీరన్నట్టు గానే, మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈమాట అనేటప్పుడు
నా గొంతులో ఏదో అడ్డు పడినట్టు నా గుండెల్లోంచి కళ్ళల్లోకి దుఃఖం పొంగుకొచ్చింది.

ఆహా ఎం తెలివితేటలు బాగా చూపిస్తున్నావు  సరే కానీ, నీ భవిష్యత్తు చేతులారా  నువ్వే నాశనం చేసుకుంటున్నావ్,తర్వాత నువ్వు నీ కుటుంబం అడుక్కు తింటారు, ఏమైనా జరగొచ్చు అసలు నీ వాళ్ళు ఎవరు రు రు రు రు రు రు ఏమైపోయినా నాది బాధ్యత కాదు, నేను చెప్పాల్సింది చెప్పాను ఆపై అంతా నీ కర్మ అంటూ అతను వెళ్ళిపోయాడు విసురుగా.

ఒక్క నిమిషం ఆలోచించి ప్రణయ్ కి ఫోన్ చేశాను, చెప్పు దీపు అంటూ అడిగాడు ప్రేమగా, నువ్వు నన్ను మన ప్రేమను ఈరోజుతో మర్చిపో, ఈ ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేసా నేను, హేయ్ ఏమైందే నీకు ఏమైనా పిచ్చా నేను నిన్ను మర్చిపోవడం ఏంటి, దానికంటే నా ప్రాణం  వదిలేయడమే నాకు చాలా లా సులువు దిపు అంటూ అతను నుంచి రాకెట్ స్పీడ్ లో వచ్చిన మెసేజ్ చూస్తూ కళ్ళ నీళ్ళతో ఫోన్ స్విచాఫ్ చేసేసా, బ్యాంక్ లోపలికి వెళ్లి మా నానమ్మకి ఒంట్లో బాగాలేదు పది రోజులు సెలవు కావాలి, నేను అర్జంటుగా ఊరికి వెళ్లాలి అని పది రోజులు సెలవు తీసుకుని, ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే అమ్మని చెల్లెల్ని తమ్ముడ్ని తొందర పెట్టి  అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి బయలుదేర దిసాను(మా నాన్న నాకు పదిహేనేళ్ల వయసులోనే మరణించారు) నాలో ప్రణయ్ వాళ్ళ ఫాదర్ ఏమైనా చేస్తారేమో నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనే భయం చోటు చేసుకుంది, నాకు నా ప్రేమ ఎంత ముఖ్యం అనిపిస్తుందో, నా కుటుంబం క్షేమంగా ఉండడం కూడా అంతే ముఖ్యం, నాలా చాలామంది ఆడపిల్లలు ఇంతేనేమో, ప్రేమ మాత్రమే జీవితం కాదు, తమ కుటుంబం కూడా ముఖ్యమే అనుకుంటారు, అందుకే కొందరు అమ్మాయిలు తమ వాళ్ళకు కష్టం కలిగించకూడదని పెళ్లి వరకు రాకుండా ప్రేమించిన దగ్గరే ఆగిపోతారు. ప్రణయ్ ని మోసం చేస్తున్నాననే బాధ గుండెని మెలి పెడుతున్న నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాం, కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను, నా మనసు చంపుకుని
ఫోన్లో ప్రతిచోట అతన్ని బ్లాక్ చేశాను పది రోజులు గడిచిపోయాయి నా సెలవులు ఇంకో 20 రోజులు పొడిగించాను, అన్ని రోజులు ప్రణయ్ నీ చూడకుండా ఉండడం నాకు నరకంలాగే ఉంది,

ఓరోజు ఉదయాన్నే ఊర్లోనే ఉన్న రామాలయానికి వెళ్లి తిరిగి వచ్చాను.నాకు ఇప్పుడు మానసిక ప్రశాంతత కావాలి అనిపిస్తుంది, లేకపోతే నేను పిచ్చి దాన్ని అయిపోయేలా ఉన్నాను, అందుకే ఆధ్యాత్మికత వైపు నా మనసు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాను.నేను వచ్చేసరికి ఇంటి ముందు ప్రణయ్ కార్ ఆగి ఉంది,
నా ప్రణయ్ నా కోసం వచ్చేసాడు అని మనసులో ఆనందంగా అనుకుంటూ లోపలికి నడిచాను, కానీ వచ్చింది ప్రణయ్ కాదు వాళ్ళ నాన్నగారు, ఆయన్ని చూడగానే నాకు కోపం వచ్చింది, రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మళ్లీ ఎందుకు వచ్చారు, మీరు ఇంకోసారి బెదిరించాల్సిన అవసరం లేకుండానే నన్ను నేను చంపుకుంటూ ప్రణయ్ కి దూరంగా వచ్చేసాను కదా మీరు మళ్లీ ఎందుకు వచ్చారు, ఇంతకు మించి నా జీవితాన్ని ఎం నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఆక్రోశం గా అడిగాను కన్నీళ్లతో.

అతను చప్పున  వచ్చినా రెండు చేతులు పట్టుకుని తన కళ్ళకి ఆద్దుకుంటూ నన్ను క్షమించమ్మ, డబ్బు ఉంది అన్న అహంకారంతో నీకు నీ ప్రేమను దూరం చేసి నేను పాపం చేశాను నన్ను క్షమించు అంటూ తల్లి అంటూ ఏడవసాగాడు, ఇంట్లో వాళ్ళంతా ఏమీ అర్థం కానట్టు చూస్తున్నారు. ఒక్క సారిగా నాకేమీ అర్థం కాలేదు,నా ప్రణయ్ కి ఏమైంది అని అడిగాను గాభరాగా, ప్రణయ్ కి ఆక్సిడెంట్ అయింది పది రోజుల క్రితం, అతను మాటిమాటికీ సృహ కోల్పోతున్నాడు, మెలకువలో ఉన్న కాసేపు దీపు అనే మాట తప్ప మరో మాట లేదు, డాక్టర్లు పరిస్థితి ఇలాగే ఉంటే అతను కోమాలోకి వెళ్ళి పోతాడు అని చెప్పారు,దీపు అనే వ్యక్తి ఎక్కడున్నా తీసుకురండి, మీ అబ్బాయి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అని డాక్టర్లు చెప్పారు, చేతులారా నా బిడ్డ ఇలా కావడానికి నేనే కారణం అయ్యాను, నీ ప్రణయ్ ని నువ్వే కాపాడుకో అమ్మా అంటూ అతను రెండు చేతులెత్తి దండం పెట్టాడు,

నాకు దుఃఖం వరదలా పొంగుకొచ్చింది, వెంటనే వెళ్లి అతనితోపాటు కారెక్కి కూర్చున్నాను, కారు ముందుకు దూసుకుపోయింది, హాస్పటల్ దగ్గర ఆగగానే దిగి లోపలికి నడిచాము, ప్రణయ్ ఐ సీ యు లో ఉన్నాడు, చెప్పాడు అతడి తండ్రి, నేను డాక్టర్తో మాట్లాడి నిన్ను లోపలికి పంపిస్తాను ఉండు అంటూ, అన్నట్టుగానే మరో పది నిమిషాల్లో నేను ఐసీయూలో ప్రణయ్ ముందు ఉన్నాను శరీరం మాత్రమే మిగిలి ఉన్నట్టు ప్రాణం నన్ను చూసే క్షణాల కోసమే కొట్టుమిట్టాడుతున్నట్టు ఉన్న అతన్ని చూడగానే నా మనసు విలవిలలాడింది.నిజంగా అతను నన్ను ప్రేమించినంతగా గాఢంగా నేను అతన్ని ప్రేమించ లేదేమో, వాళ్ళ నాన్న నా కొడుకుని ప్రేమించొద్దు అనగానే నేను అతన్ని వదిలి వెళ్ళిపోయాను, అతనీకే ఇదే పరిస్థితి ఎదురై ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు నా ప్రేమను దీపు నీ ప్రాణం పోయినా వదులుకోను అని చెప్పి ఉండేవాడు, అతని చేయి పట్టుకొని నా నుదురు కి ఆనించుకుని అలాగే కూర్చున్నాను, ఎవరు నన్ను బయటకు వెళ్ళమని చెప్పలేదు, అలా ఒకరోజు పూర్తిగా గడిచిపోయింది, మర్నాడు  తెల్లవారు జామున అతనిలో చిన్న స్పందన దీపు వచ్చేసావా అంటూ కదిలాడు, నేను అతని జుట్టులోకి వేళ్లుపోనిస్తూ నేను ఇక్కడే ఉన్నాను
నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని సున్నితంగా లేరా ప్లీజ్ నా బంగారం కదూ అంటూ అతన్ని మెల్లిగా తడుతూ లేపడానికి ప్రయత్నిస్టున్నాను, ఇంతలో డాక్టర్ వచ్చారు, అతన్ని పరీక్షించి మీరు వచ్చారని అతని మనసు ఉ ఉకి తెలిసింది మీ రాక వల్ల అతని కండిషన్ కొంచెం బాగానే ఉంది మెలకువ వస్తుంది యు డోంట్ వర్రీ అన్నారు, అనుకున్నట్టుగానే పది రోజుల్లో అతను కోలుకున్నాడు, మాట్లాడగలిగెంత ఓపిక వచ్చింది, అతనికి సృహ రాగానే ముందు నన్ను అడిగిన మాట ఎందుకు నా ప్రేమను కాదన్నావు అని  అడిగాడు, నువ్వు ఎందుకు అలా అన్నావు తెలియక నేను ఆ క్షణం లో పిచ్చివాడ్ని అయిపోయాను, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కార్లో ఫాస్ట్గా నీ దగ్గరికి బయలుదేరేసరికి యాక్సిడెంట్ అయింది, ఇంకెప్పుడూ అలా అనకు, మరోసారి నువ్వు అలా నా ప్రేమను వద్దు అంటే నా ప్రాణం పోతుంది దీపు ఆర్తిగా నన్ను అల్లుకుపోతూ ప్రణయ్ అన్న మాటలు ఇవి, ఇంకెప్పుడు అలా మాట్లాడను పొరపాటున కూడా నన్ను క్షమించు, ప్లీజ్ అంటూ అతనికి నచ్చచెప్పాను
అయినా అసలు అలా ఎందుకు అన్నావు అనుమానంగా అడిగాడు ప్రణయ్, ఏం లేదు,ఆ రోజు
ఏదో సినిమా గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ
ఆ సినిమాలో డైలాగ్ అది నీతో ఊరికే అన్నాను అంతకుమించి ఇంకేం కాదు నా ఫోన్లో చార్జింగ్ అయిపోయింది వెంటనే ఫోన్ స్విచ్ఆఫ్ అయిపోయింది, అని చెప్పాను అతనికి అనుమానం రాకుండా, ఓస్ అంతేనా నేను ఏంటో అని కంగారు పడి నువ్వు ఎందుకు అలా అన్నావా అని నీ దగ్గరికి హడావిడిగా బయలుదేరి కంగారులో రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేస్తూ పొరపాటున యాక్సిడెంట్ కి గురయ్యాను, అంటూ చెప్పాడు ప్రణయ్, సరే నేను త్వరగా కోలుకుని వచ్చేస్తాను మనం పెళ్లి చేసుకుందాం నువ్వు అంతవరకు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళద్దు ప్లీజ్ నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పాడు ప్రణయ్ ప్రేమగా,

నేను సరే అంటూ తల ఊపాను సంతోషంగా, కొద్దిసేపటి తరువాత తర్వాత నాతో మాట్లాడుతూనే ప్రణయ్ నిద్ర లోకి జారుకున్నాడు, నేను బయటికి వచ్చాను ప్రణయ్ తండ్రి సోమశేఖరం గారు బయట కూర్చుని ఉన్నారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనకి దండం పెడుతూ నన్ను ప్రణయ్ ని విడదీయాలని ఇకమీదట ప్రయత్నించకండి, ఇప్పుడు అతనికి దూరమై నేను కూడా బ్రతకలేను, ఒకవేళ నేను మీ అంతస్తుకి తగను అనుకుంటే ముందు ఇంత విషమిచ్చి నన్ను చంపి అప్పుడు మీ ప్రణయ్ కి పెళ్లి చేయండి అని చెప్పాను.అతను లేచి నుంచున్నాడు ఇప్పటి వరకు అయ్యింది చాలు, చచ్చిన పాము ఇంకా చంపొద్దు తల్లి, డబ్బును మించినవి చాలా ఉంటాయి అని మీ ప్రేమను చూసిన తర్వాత అర్థమైంది, ఇప్పుడు నాకు నా కొడుకు క్షేమం ముఖ్యం, వాడు నీతో వుంటేనే బాగుంటాడు అని నాకు అర్థమైంది, మరో సారి నా వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదు, వాడు కొంచెం కోలుకోగానే మీ పెద్ద వాళ్ళతో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను
అంటూ అక్కడి నుంచి కొడుకు దగ్గరకు వెళ్ళి పోయాడు, తన ప్రాణాల మీదకు తెచ్చుకునీ తన ప్రాణానికి ప్రాణమైన నన్ను ప్రణయ్ ఇలా గెలుచుకున్నాడు, మీకు తెలుసా తన శ్వాస,ఆశ,అన్నీ నేనే ఎప్పటికీ, జీవితాంతం ఇక ఎవరు అవునన్నా కాదన్నా అతను పూర్తిగా నావాడే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!