చెడిపోయిన శరీరం వెనుక అందమైన మనసు

చెడిపోయిన శరీరం వెనుక అందమైన మనసు

రచన::బండారు పుష్పలత

హైదరాబాదు పట్టణ శివారులలో బేగంపేట్ పరిధిలో వరుణ అనే వీధిలో ఒక యువతీ నిర్యాణం చెందింది అని తను సాదుకుంటున్న రాము వచ్చి బయట ఆ వీధిలో వాళ్ళకి చెపుతాడు. ఆవీధిలో వుండే వాళ్ళు ఎవ్వరు ఆవిషయాన్ని పట్టించుకోరు. పైగా దరిద్రం వదిలింది పిశాచి పోయింది అని నానా మాటలు అంటున్నారు.అమ్మయ్య దేవుడా దీన్ని ఎన్నిసార్లు ఇ క్కడనుండివెళ్ళగొట్టాలన్న అది జరుగలేదు. ఎంతో మంది మగవాళ్ళు వచ్చి పోయేవాళ్ళు సిగ్గులేని జన్మ దీనిది భగవంతుడే దీనిని శిక్షించాడుఅని అక్కడివాళ్లు అనుకుంటుండగా అంతలో జాతీయ అంతర్ జాతీయ మీడియావాళ్లు వచ్చి ఈ విషయాన్నీ అన్ని టీ. వీ ఛానళ్లలో లైవ్ కార్యక్రమమంగా చూపిస్తూ వుంటే ఆవీదన్తా కోలాహలం గా ఉందిపెద్ద పెద్ద వాళ్ళు పూలమాలలు తెచ్చి ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు అక్కడ వీధిలో వున్న వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు ఎందుకు ఇంతమంది వస్తున్నారో అర్థం కాదు . అంతలో అవీధిలో వున్న పెద్దాయన ఆమె శవాన్ని చూడడానికి లోపలికి వెళుతాడు ఆభవంతి చూసి ఆచార్య మొందుతాడు.అన్ని రంగులు హంగులు వున్న ఆ భవనం చాలా అద్భుతంగా ఉంటుంది.వచ్చిపోయే వాళ్ళు ఆమెకాళ్ళను మొక్కుతున్న దృశ్యం చూస్తే ఆపెద్ద మనిషి కి అక్కడ ఏంజరుగుతుందో అర్థం కాదు అంతలో ఆశవం దగ్గర ఒక డైరీ దొరుకు తుంది. అది పట్టుకొని బయటకు వచ్చి చదవటం ప్రారంభించాడు. మొదటి పేజీ తెరవగానే పెళ్లి నాకల. నేను ఏనాడైనా పెళ్లి కూతురులా ముస్థా బవ్వాలి అని నా బీరు వాలోపట్టుచీరవుంచుకున్నాను అని రాసివుంటుంది. తరువాత పేజీనుండి తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తల్లి దండ్రులు చనిపోయారని. ఒక పెద్దమనిషి గా చెలామణి అవుతున్న వ్యక్తి తనను వ్యభిచార ఊబిలోకి దించాడని అప్పటి నుండి ఆవృత్తి లోప్రతి రోజు చస్తూ బతుకుతున్నానని.ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకి రావొద్దని
అందుకే తాను వొళ్ళు అమ్మోకొనిసంపాదించిన
డబ్బుతో ఆడ పిల్లల అనాధ శరణాలయం వెయ్యి మంది ఆడపిల్లలతో కొనసాగుతుందని. వాళ్ళు బాగాచదువుకోని ఉద్యోగాలు చేసుకొని ఆడవాళ్లు దర్జాగా బతకాలని. ఏ ఆడ పిల్ల తనలా అవ్వకూడదని ఆ శరణాలయాన్ని నడుపుతున్నానని అక్కడ బ్రతికిన వాళ్ళు ఎందరో ఉద్యోగాలు చేస్తున్నారని దేశవిదేశాలలో వున్నారని దానిని తన అనంతరం కూడ నడపడానికి తనదెగ్గరికి వచ్చిన పెద్దమనుషుల నుండి అజ్ఞాతంగాతన
శరణాలయాన్ని నడపాలని రాయించుకొన్న పత్రాలు అన్ని దాచివుంచానని రాసుకుంది.తనకి పిల్లలు భర్త కుటుంభం వుంటే బాగుండునని ఒంటరి బ్రతుకు చాలా భయంకరంగా వుంది అని రాసుకుంది. తన దగ్గరికి వచ్చేవాళ్లు మగమృగాలుగా ప్రవర్తిస్తారని,తనని ఆ దేవుడు ఎందుకు పుట్టించాడో అని కన్నిటి పర్యన్తంగా రాసుకున్న విషయాలను చదివిన పెద్దమనిషి లోపలి వెళ్లి తన బీరు వాలో వున్న పెళ్లి పట్టుచీరనుతెచ్చి ఆమెకు కప్పితన కళ్ళు చెమర్చగా తన కాళ్ళకి నమస్కరించి వచ్చి ఆ మహిళ చేసిన మంచి పనిని అందరికి చెపుతాడు అంతలో శరణాలయం వాళ్ళకి తెలిసి వాళ్ళు అందరు వచ్చి ఆమెను చూసి కన్నీటి వీడుకోలు అంటూ పాటలు ఆటలు మేళ తాళాలతో శవ యాత్ర సాగిస్తారు. ఆమెగురించి తెలుసుకున్న అవీధీవాళ్ళువారు చేసిన తప్పుతెలుసుకొని ఆమె శవ యాత్ర లో పాల్గొని అంగరంగ వైభవంగా తన దహనసంస్కారాలు ముగిస్తారు. తనగురించి అన్ని పేపర్, టీ. వీ లలో చూసి బ్రతికున్నపుడు ఆసహించు కున్నవాళ్ళు ఇప్పుడు తనని దేవతలా చేతులెత్తి మొక్కారు.
ఇది తన అందమైన మనసు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!