ఆమె మనస్సు

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

ఆమె మనస్సు

రచయిత :: జయకుమారి

ఆశలు రెక్కలు తొడిగి ఎగిసిపడుతున్నా పిల్ల గోదారి తను ఉరకలు వేస్తూ తొలకరిచిరిజల్లులో  అల్లరి చేస్తూ చిందులు వేసే పిల్ల తెమ్మర తాను. వసంతలో ఆమనికై  మురిసి పాడే చిలిపి కోయిల తను. జీవితం పై ఎన్నో ఆశలు,ఊహాలకు రెక్కలు తొడిగి ఆశయసాధనకై వేసే అడుగులకు బంధనాల శంకెళ్లు వేసి. నూరేళ్ళ జీవితాన్ని ముడుముళ్ళ బంధం తో బానిసను చేసి వంటింటి కుందేలు ని చేసి ఆశలను వంటింటి గుమ్మంలోనే సమాధి చేసేస్తాయి. అందరి జీవితాలు అలా ఉండవు ఏమో బహుశ ఈమే లా చీకటిలోనే తెల్లరిపోతాయి ఏమో.

ఈమె నిండుపున్నమి లో వెన్నెల కాంతి ,పుత్తడిబొమ్మ , అందమైన అమయకురాలు.ప్రేమను ఇవ్వడంలో మాత్రం అమృత కలశం. కానీ పట్టుదలతో తను అనుకున్న లక్ష్యం సాధించాలని తపన. కాలం అందరికి సహకరించదు కదా.

ఈమె మెట్టిన ఇంట పద్ధతులు వేరు,మనుష్యులు వేరు,భర్త ప్రవర్తన ఇంకో వైపు. స్వార్థపు విషపు నాగుల మధ్యలో చిక్కుకున్న ఈమె ను అర్ధం చేసుకునే మనిషే లేరు అంటే నమ్మరు.
ఆడది అంటే కేవలం,ఇంట్లో అత్త, మామ, పిల్లలు భర్త ను మాత్రమే చూసుకుంటూఇంట్లో పనులు మాత్రమే చేసుకోవాలి అనే మూస ధోరణి వాళ్ళది. ఈమె కు చిన్నప్పటి నుంచి జాబ్ చేస్తూ , తనకు ఇష్టమైన సంగీత విద్యలో ప్రతిభ కనపరిచి, తను సంపాదించిన దానిలో తల్లి తండ్రి,కి ఇచ్చి ఏదో ఒక ఆర్గానైజేషన్ స్థాపించాలని, దాని ద్వారా తోచిన దానిలో కనీసం ఒకరికైనా సాయం చేయాలని కోరిక. అదే కోరిక భర్త. ముందు ఉంచింది తను కానీ అక్కడ నుంచి వస్తుంది అనుకున్న ప్రతిస్పందన రాలేదు సరి కదా. కపటనాటకాలు మొదలు పెట్టారు.జాబ్ కోసం చదువుతున్న తనిని చడవనివ్వకుండా మాటలతో హింసించడం మొదలు పెట్టారు.

ఏరోజు తిన్నవా, ఉన్నవా అనే మాటే లేదు. ప్రేమ లేదు ఏదో ఒకటి సూటిపోటి మాటలతో తనిని మానసికంగా కృంగతిస్తునే ఉన్నారు. ఆమె శరీరంతోనే పని కానీ మనస్సుతో పని ఉండదు ఏమో బహుశా కొందరికి. డబ్బుకోసం ,శరీరాన్ని అమ్ముకునే అడవాళ్ళకి,పెళ్లి పేరుతో కట్నాలు ఇచ్చి, శరీరాలను తాకట్టు పెట్టె అడవాళ్ళకి పెద్దగా తేడా ఉండదేమో.

ఇష్టం లేకపోతే భర్త అయిన ఒకటే, పరాయి మగాడు అయినా ఒకటే ఏమో. పగలు అంతా ఇంటి చాకిరి,రాత్రి అయితే భర్త చాకిరి. తన శరీరంలోని అనువణువు తడుముతుంటే ఆమె పడే నరకయాతన వర్ణించలేము, వద్దు అని చెప్పి బంధం నుంచి సమాజం,తల్లిదండ్రులు ,కట్టుబాట్లు నుండి తప్పించుకోలేక ,అలా అని అతని వికృత చేష్టలు భరించలేక. నిశి చీకటిలో చిదిలిం అవుతున్నా తన బ్రతుకును తలుచుకొని, కన్నీటి వడగళ్ల దెబ్బలు తన అంతరాత్మ ను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే జవాబు లేని ప్రశ్నల్లే..

స్నానాల గదినే తన కళ్ళ నుంచి కారే కన్నీటి కి సాక్ష్యాలు గా, గరాళాన్ని గొంతులో దాచుకున్న పడతి. తన కంటి నుంచి కారే కన్నీటిని తలగడి దాహం తీర్చుకుంటున్నది ఏమో బహుశా.తన గుండె బాధ ను ఒక డైరీ కి చెప్పుకుంటూ తన కాయనికి అంతిమ విడికోలు పలుకుతూ.

తనలాంటి ఆడ పిల్లల ఆశలకు తోచినంతలో మేము ఉంటము నీకు తోడు గా నీ ఆశయ సాధన కు చేయుతనిస్తాం అనే ధైర్యాన్ని ఇచ్చిన రోజు ఏ ఆడపిల్ల జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోవాలని చూడదు.
ఒకవేళ అటువటి పరిస్థితి ఎదురైన మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వండి చాలు. ఇదే చీకటి వెనుక ఆమె మనస్సు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!