నా గతమును నాకివ్వరూ

నా గతమును నాకివ్వరూ

రచన: సావిత్రి కోవూరు

ఎవరైన నా గతాన్ని నాకిచ్చేయండి.
చదువు కొరకై మాఅమ్మకు దూరమైన కాలమును
అమ్మతో వీలైనంత ఎక్కువ గడిపి,
ఆ లోటును తీర్చుకొని,  తరించాలని ఉంది.

అమ్మ మాటలను, అమ్మ దగ్గరి తనాన్ని, అమ్మ ఆత్మీయతను,
అమ్మప్రేమను, అమ్మ అనురాగాన్ని, అమ్మ స్పర్శను,
మనసార, తృప్తిదీర అనుభవించాలని ఉంది.

చిన్నపుడే గతించిన మా నాన్న రూపాన్ని
నా మనః పలకము పై ముద్రించు కోవాలని ఉంది

సెలవులలో నా స్నేహితురాళ్ళతో కలసి
వాగు దగ్గర చెలిమలు గొట్టి నీళ్ళు తాగడం,
పెద్ద బావులలో ఈతగొట్టటం, పొలం దగ్గర చెట్టు
మీది సీతాఫలాలు , ఈత పళ్ళు తినడం,
పల్లీలు కాల్చుకొని తినడం లాంటివి చేయాలని ఉంది.

తంగేడు పువ్వులు, పట్టుకుచ్చుల పువ్వులు గునుగు పువ్వులతో
పెద్ద బతుకమ్మను పేర్చుటకు పోటి పడాలని ఉంది.
చిన్నప్పటిలాగ అక్కచెల్లెళ్ళతో,
అన్నయ్యలతో కలిసి మనసార తృప్తిగా మాట్లాడాలని ఉంది.

నా చిన్నప్పటి పరిచయస్తులందరిని ఒకసారి
చూడాలని ఉంది.తృప్తిగా మాట్లాడాలని ఉంది.

కూల్చేసిన నేను పెరిగిన ఇంటిని ,ప్రతి గదిని, వంటగదిని,
పెరటిని ,చేదుడు బావిని, పశువుల కొట్టంను అణువణువు
ఒక సారి చూసుకోవాలని, వీడియో తీసుకోవాలని ఉంది.
దయచేసి ఒక్కసారి నా గతాన్ని నాకివ్వండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!