వైద్యనారాయణోహరి
రచన: మక్కువ. అరుణకుమారి
తెల్లనికోటు వేస్తాడు
మల్లెనవ్వు రువ్వుతాడు
స్టెతస్కోపు వేస్తాడు
బతుకు భద్రత నిస్తాడు
ఆత్మీయస్పర్శనిస్తాడు
ఆశలు రేపుతాడు
మాటల మంత్రమేస్తాడు
ఊసుల ధైర్యమిస్తాడు
పిలిచె ఇష్టసఖుడు తాను
పలికె ప్రియబంధువు తిను
తలిచె ప్రాణ విభుడు తాను
ఆపధ్భాంధవుడు తాను
చీకటిన వెన్నెల తాను
వేదన వేకువ తాను
రోదన ఊరట తాను
ఆశల బాసట తాను
తను సూర్యనారాయణుడు
తను నిత్య పారాయణుడు
ఆర్ధ్ర హృదయ పరాయణుడు
తను వైద్య నారాయణుడు