టివి భాగోతం

టివి భాగోతం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఎస్.ఎల్.రాజేష్

ముదురు మాటలు, వెకిలి చేష్టలు,
హొయలు ఒలికించే వెర్రి యాంకర్లు
మహిళల పైన అర్థం లేని జోకులు
డబ్బులు తీసుకుని నవ్వే జడ్జీలు
జబ్బలు చరచుకునే కార్యక్రమాలు

రోజు వారీ కూలీలు
వింత కాపురాలు
అరుపులు కేకలు
రేటింగుల కోసం
ఫైటింగులు.
పిచ్చి తెచ్చే
న్యాయ నిపుణులు
అతుకుల జట్కా బండి
చూడటమేలా?
భార్యాభర్తలు
అనుమానంతో
రగులుట ఏలా?

ముక్కుమొహం ఎరుగని
పది మంది
ఆడామగా తేడా లేకుండా
30 రోజులు ఓకే ఇంట్లో
సాగే విచ్చలవిడి భాగోతాలు.
సిగరెట్లు కాల్చే సన్నాసులు
కురచ దుస్తుల్లో ఆడవాళ్ళు.
సానికొంప నయమనిపించే
పెద్దన్న ఇల్లు..
పిల్లలతో కలసి చూడటమేల?
చెడిపోతున్నారని వగచుట ఏల?

ఆడదానికి ఆడదే శత్రువు..
మగవాళ్ళకి ఇద్దరు పెళ్ళాలు..
అత్త గారిని సాధించుట ఎలా..
కోడల్ని రాచి రంపాన పెట్టుట ఎలా..
పసి మనసుల్లో విషం
నింపడం ఎలా అని కలుషిత
సీరియళ్లు చూడనేల
సంసారాలను పాడుచేసుకోనేల..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!