మనసు

మనసు
(ప్రక్రియ: సిసింద్రీలు)

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

1. ఓ మనసు
ఉండేది గుప్పెడు
ఉంచు కుంటుంది ఆశలు గంపెడు

2. ఓ మనసు
కలలు కంటుంది నిత్యం
కల్లలైతే వగచేది సత్యం

3. ఓ మనసు
కోపం తో పడుతుంది తూట్లు
కోరి తెస్తుంది ఇక్కట్లు

4. ఓ మనసు
సాధన చేసి ఉంచు శాంతంగా
సాధ్యం చేసుకుని ఉండు ఆరోగ్యంగా

5. ఓ మనసు
చూసిన ప్రతి చోటుకీ పరుగిడకు
చూసినదంతా మంచి కాదని మరువకు

You May Also Like

15 thoughts on “మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!