వరాహ వాయసాలు

వరాహ వాయసాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

విసుక్కుంటాం కసురుకొంటుంటాం!
వరాహ వాయసాల్ని వివేకమెరుగక!
చేస్తున్నాసరే ప్రయోజనాలు మనకు!!

వ్యర్ధాలను స్వీకరించి వాయసమూ!
విసర్జితాలను భుజించి వరాహమూ!
చూపాలందుకు కృతజ్ఞత వాటిపట్ల!!

బాధపడతాం కోపంతెచ్చుకుంటాం!
మనపై అపనిందలేయు జనాలను
మనకు కీడు,హాని చేయువారలను!

జాలిచూపాలి వారిపై దయతోడను!
గుర్తించాలి నిజంగ్రహించి వారలను!
ఉపకారులుగాను ప్రక్షాళకులుగాను!!

మన పూర్వకర్మల దుష్ఫలితాలను
అనుభవింపజేయించు కర్తలుతామై
మనల్ని విముక్తులను చేసినందుకు!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!