చివరకు మిగిలేది?

చివరకు మిగిలేది?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుశీల రమేష్

ఏమి సంపాదించ
నీ ఆత్రము రా మానవా
ఎంత సంపాదించినా
చివరకు మిగిలేది బూడిదే కదరా!
ఆరడుగుల నేల తల్లి
ఒడిలోకి చేరిన నీ దేహం
ఏమవుతుందో తెలియదు
దీనికే హంగులు ఆర్భాటాలుఏలరా!
నిన్నునీవు మరచి స్వార్ధానికి
బానిస గా మారి అయిన
వారిని మరచి బంధాలను
తెంచుకుని సాగేది దేనికోసమురా!
ఎంత సంపద ఉన్నా మనసులో
మాటను పంచుకోలేని ఆప్తులను
సంపాదించుకో లేని నీవు
తెలివైనవాడివా కాదు రా !
నీకున్న దానిలో నలుగురికి
సాయపడి వారిని వృద్ధిలోకి
నడిపించి చూడు మంచి మనసుతో
నిన్ను దీవించి ఆరాధిస్తారు రా!
ఈ దీవెనలే రేపు నీతో
వచ్చే మూలధనం నీ
సంపాదన నీతో రాదు
చివరికి మిగిలేది బూడిదేను రా!
అవివేకిలా ఆలోచించక
ఇప్పటికైనా మేలుకొని
ఆత్మశోధన చేసుకుని
జీవిత పరిశీలన చేసుకొన రా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!