శాకపాకములలో రారాణి (వంకాయ)

శాకపాకములలో రారాణి (వంకాయ)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

శాఖపాకములందు రారాణియై వెలుగుచుండ
శిరస్సుపై సహాజంగా అమరిన కిరీటం ధరించుటచే
సకల పాకశాకముల్లో నను రారాణి యనుట కద్దు.
రంగవల్లులల్లోని వర్ణములన్నీ సౌకుమార్యంగా కలబోసుకొనుటచే
భువిలో వెలసిన ఇంద్రధనుస్సు అనుటలో
శంకించుట అస్సలే వద్దు.
జిహ్వా చాంపల్యం పెంచుటలో
ఆశలసౌధాన్ని తలపించుట ముద్దు.
పరిమళ ద్రవ్యములను కలబోసినచో
ఘూమఘూమయింపులకు ఆకాశమే‌ హద్దు.
ఎండా, వాన, శీత కాలమని, ఆ కాలం ఈ కాలమని
నోటికీ చిక్కనను సందేహం కలగనివ్వద్దు.
పెళ్లయిన, పేరంటమైన సులువుగా చేసుకోన నేనుండ
భోజనప్రియులు కూరలు దొరకవను బెంగ అస్సలు పడనేవద్దు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!