నన్ను నేను మరచి

నన్ను నేను మరచి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బుదారపు లావణ్య

తొలిసంధ్య కిరణంలా
మెరిసేటి నీ మేని ఛాయను
రెప్పార్పక చూస్తూ.
తెలిమంచు రాగంలా
వినిపించే నీ చిలిపి పలుకులను
మనసారా ఆస్వాదిస్తూ.
సెలయేటి నాట్యంలా
అలరించే నీ అందెల సవ్వడిలో
ఆదమరిచి నిలుస్తూ.
నీ.. చిలిపి చూపుల
సరస సరాగాల
విరహ వయ్యారాల
ముద్దు మురిపాలలో
తేలియాడుతున్నాను సఖీ
నన్ను నేను మరిచి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!