నువ్వే నా ప్రపంచం

నువ్వే నా ప్రపంచం

రచన :: శ్రీలత. కే (హృదయ స్పందన )

ప్రియతమా నీకోసం,

ప్రతి రోజు ఎన్నిసార్లు తలుచుకుంటానో.
నా ఊహల్లో ఎప్పుడు నీతోనే విహరిస్తుంటాను.
నా ఊహలకు ఊపిరిపోసి ఎప్పుడు నువ్వు నా ముందు ప్రత్యక్షం అవుతావా అని కళ్ళు రెప్పవేయకుండా చూస్తూనేఉంటాయి..

ప్రతీ రోజు ఎన్ని మాట్లాడిన..నీ చేతి స్పర్శ లోని నమ్మకం ,
నీ చూపులోని అనురాగం, నీ పిలుపులోని ఆప్యాయత, నీ కౌగిలిలోని భరోసా దొరకవు కదా..
నేను నీకు ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని చెప్పినా ఇంకా ఏవో మిగిలే ఉంటాయి. నీ ఎద పానుపు పైన నేను పవలించినప్పుడు నా ప్రేమ ను నీకు అర్పిస్తూ చెప్పే ఊహల ఊసులు ఎన్నో నా హృదయాంతరాలలో
నిక్షిప్తం చేసుకున్నాను.

నీలాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రేమను పొందటం
నా అదృష్టం. ప్రేమించటం అంటే ఇవ్వటమే.. తీసుకోవటం కాదు అని నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు నాకు అర్థం అవుతున్నాయి. నేను ప్రేమించే నువు
నా దగ్గర లేకపోయినా  నా మనసులో ఎప్పుడు నీ స్థానం ఆకాశం అంత ఉన్నంతంగా ఉంటుంది.

  ఎన్నో సార్లు ఏవో పిచ్చి ఆలోచనలతో  ఎన్నో ప్రశ్నలు వేసి నిన్ను విసిగించి ఉంటాను. నేనొక కల్లోల కెరటాన్ని  కానీ నువు నిశ్శబ్ద తీరానివై నన్ను నీ మనసులో బందించేస్తావు.

నీ మాట కోసం. నీ చూపు కోసం, నీ స్పర్శ కోసం ఆరాటపడే నా మనసుని నిద్రపోమ్మని జోకొట్టలేక..
నువ్వు వస్తావని మభ్యపెట్టలేక, మర్చిపొమ్మని
మందలించలేక.. నాలో నేనే.. మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న..

ఎన్నాళ్ళు..ఎన్నేళ్లు…అయినా…
కాలం కరిగిపోయిన, కన్నీళ్లు ఇంకిపోయిన,
మనసు మూగవోయినా, కలం ఆగిపోయినా..
ఊపిరి ఆగిపోయేక్షణం వరకు..
నీ నేను గానే… ఉంటాను.
నువ్వే నా ప్రపంచం ప్రియతమా..
ఈ హృదయ స్పందన నీకోసమే..

ఇట్లు,
నీ…హృదయ స్పందన.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!