మానస పుత్రిక

మానస పుత్రిక

రచన: తిరుపతి కృష్ణవేణి

అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

భారతీయులందరం, ఐకమత్యంగా ఒక్కత్రాటిపై నిలిచి, బ్రిటీష్ వారితో సుదీర్ఘ పోరాటం సాగించి, వారిని తరిమి కొట్టి, మన దేశానికి స్వాతంత్ర్యంసాధించు
కున్నాము.ప్రతి ఒకరూ తాము చేసే ఏ పనిలో అయినా స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపుకొని అడుగు ముందుకు వేయాలి.
మొదటి అడుగు ఎప్పుడూ వంటరిగానే సాగుతుంది. ఆ అడుగే, “అందరికీ బాట” అవుతుంది. దేన్నయినా మనం సాధించాలంటే కృషి పట్టుదల, ఐక్యత చాలా అవసరం అని “నాన్న “పదే పదే చెప్తుంటారు.అందుకే పెద్దలు “ఐకమత్యమే మహా బలం”అన్నారు.

ఆ సంకల్ప బలంతోనే నాన్నగారు నన్ను తీర్చి దిద్దుతున్నారు.
ఇంతకూ నే నేనెవరనుకుంటున్నారు ? నాన్నగారికి “మానస పుత్రికను” మాది చాలా పెద్ద కుటుంబము. మన కుటుంబ సభ్యులందరిని పరిచయం చేశారు.
దగ్గరుండి అన్నివిషయములు నేర్పిస్తూ, నన్ను తీర్చి దిద్దుతున్నారు. నేను వయసులో మరియు అనుభవంలో, చాలా చిన్నదాన్నయినా,! నా కార్యక్రమాలకుఅమ్మ,నాన్నలతో,పాటు మీరందరూ ఒక్కొక్కరుగా సహకరిస్తూనే ముందుకుతీసుకువెళ్తున్నారు.
ఈ సందర్భంగా మీ అందరికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ మధ్య మన వాళ్ళు కొందరు నన్ను “చాలా ముద్దుగా,బొద్దుగా, అందంగా మెరిసి పోతున్నావు అని ” అంటున్నారు. ఆ మాట నాకెంతో సంతోషం కలిగిస్తూంది.మా సాహితీ వనంలో రకరకాల జాతుల మొక్కలు, ఎన్నో పువ్వులను పుష్పించి చక్కని పరిమళాలు వెదజల్లు తున్నాయి.మీ అందరి ఆశీస్సులతో దినదినాభివృద్ధిగా ఎదుగాలనే నా ఆశ.
మన కుటుంబం వంద మంది పైగా వుంటారని, అందులో నానమ్మలు , తాతయ్యలు, అమ్మమ్మలు, అత్తయ్యలు,మామయ్యలు అందరూఉన్నారు.
వారిందరూ వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.ప్రతివారం నన్ను చక్కగా ముస్తాబు చేసి అందరూ మురుస్తుంటే,నా ఆనందం అంతా ఇంతా కాదు.,? నా కుటుంబ సబ్యులందరూ కూడా సాహిత్యాభిమానులే అవటం నాకెంతో సంతోషం.! అందరి సభ్యుల అభిమానాన్ని పొందే నాలాంటి అదృష్టవంతురాలు ఎవరూ, ఉండరు.?ఆదివారము వచ్చిందంటే నేను చాలా సంతోషంగా ఎదురు చేస్తుంటాను.
ఎందుకంటే ఆరోజు సెలవు. అత్తయ్య వాళ్ళు , నన్ను చక్కగా ముస్తాబు చేస్తారు. అందరూ నన్ను ఎత్తుకొని మురుస్తారు. నాకు కొత్త బట్టలు వేస్తారు. ఎంచక్కా నేను ప్రతీవారం రంగు, రంగు, కొత్త డిజయన్లతో తయారైన అందమైన బట్టలు ధరిస్తాను .
ఇక నానమ్మ, తాతయ్యలు అయితే సాహితీ సుమాలతో, నన్ను అలంకరిస్తారు. మామయ్యలు, నాకు మంచి మంచి కథలు కవితలు, గజల్స్ పాడి, వినిపిస్తారు. ఆ రోజు అందరి హస్తాల్లో నేనే ఉంటాను.
ఆ నెలలలో అందరూ పొందు పర్చిన విషయాలు, చక్కగా చర్చించు కుంటూ, సాహితీ వనంలో తిరిగాడు తుంటే ఎంతో ఆనందంగా వుంటుంది.నాన్నగారు అనుక్షణము నన్ను కంటికిరెప్పలా కాపాడుతూఉంటారు. అత్తయ్య గార్లు ఉద్యోగ బాధ్యతల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ వీలుచూచుకొని వచ్చి, నా ఆలనా పాలనా చూచుకుంటూ,నాన్నకు కూడా తమ పూర్తి సహకారం అందిస్తూంటారు.
నాకు మంచి చెడులు నేర్పించే పెద్దల సహకారం మరువలేనిది. నా ఎదుగుదల కోసం మన కుటుంబ సభ్యులు అంతా ముందుండి చెయ్యి పట్టి నడిపించాలని ఆశిస్తున్నాను.త్వరలో రాబోయే నాపుట్టిన రోజు సందర్భంగా ఎక్కువమంది కుటుంబ సభ్యులు హాజరై మన “చక్కనైన తెలుగు తోటలో విహరించి”,
“ఆ తోటలో పూసిన పూల పరిమళాలను ఆస్వాదించి,”
ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను. బంధువులందరికీ కృతఙ్ఞతలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!