వేపచెట్టు

వేపచెట్టు

రచన: చెరుకు శైలజ

నా చిన్నప్పుడు వేపచెట్టు కింద స్నేహితులతో‌ కలిసి ఆడుకునేదాన్ని గేట్ దాటి లోపలికి వచ్చె వాళ్ళకి .
వేపచెట్టు దాని కొమ్మలతో మెల్లగా కదులుతూ స్వాగతం చెప్పేది. ,ఆ పచ్చని వాకిట్లో తన తెల్లని వేపపువ్వు రాలి ముగ్గు పరిచినట్టు గా వుండేది. అక్కడ, అక్కడ ఆకు పచ్చని వేపకాయలతో పచ్చని వేప పుల్లలతో ఆ వాకిలంతా ఎంతో చూడ ముచ్చటగా వుండేది .ఆ చెట్టు కింద నేను చాయ పత్తా, రేస్ ఆటలు నా స్నేహితురారతో ఆడుకునేదానిని. ఆ చెట్టు వలన అసలు ఎండానే తెలిసేది కాదు.
ఎండాకాలం వచ్చిందంటే ఆ చెట్టు కిందే సాయంత్రం మంచాలు వేసుకొని ఇంటిల్లిపాదీ మాట్లాడుకునే వాళ్ళం.
రాత్రి మిద్దె మీద వేపచెట్టు వున్న డాబా మీద హాయిగా పడుకునే వాళ్ళం. మాకు కరెంట్ పోయిన తెలిసేది కాదు. ఆ చెట్టు వలన అంతా హాయి గా చల్లగా వుండేది . వేపచెట్టుకి బంక( గమ్) వచ్చెది. అది తీసి నేను మా స్నేహితురాలు ఒక డబ్బాలో దాచి పెట్టుకుని మా పుస్తకాలు పేజీలు ఉండిపోతే అతుకు పెట్టుకొని ఆ గముని దాచి పెట్టి అవసరానికి ఉపయెగించేది .
దీపావళి పండుగ వచ్చిందంటే కాకరవత్తులు వెలిగించి
ఆ పుల్లని ముట్టించి వంచి చెట్టు పైకి వేసి చప్పట్లు కొట్టుకుంటూ గంతులు వేస్తూ పైకి చూడడమే అప్పుడు చూడాలి ఆ చెట్టు ఎంతో అందంగా నక్షత్రాలతో మెరిసినట్టు గాగా వుండేది .
నా ఆటపాటలతో వేపచెట్టు కింద చిన్నతనం గడిచిపోయింది.
నా పెళ్లి మంచి ఎండాకాలంలో వేడి తెలియకుండా
ఆ చెట్టు పక్కనే పూలమండపం వేశారు అందులోజరిగిపోయింది. నాకు పిల్లలు పుట్టి ఆ వేపచెట్టు నీడలోనే అన్ని ఆటలు ఆడుకున్నారు.
మా కుటుంబనికి ఆ వేపచెట్టు ఎంతో ప్రియమైన నేస్తం అయిపోయింది .
రోజులు గడుస్తున్నాయి .
ఒకరోజు నేను నా పిల్లలతో కలిసి మా ఊరు వెళ్ళాను.
గేట్లోకి అడుగు పెట్టే సరికి అక్కడ వేపచెట్టు లేదు. అంతా బోసిపపోయినట్టుగా వుంది. అమ్మ అమ్మ అంటు హడావుడి గా ఇంటిలోపలికి వెళ్ళాను. నా ఇద్దరు పిల్లలు కూడా నాతోనే హడావుడి గా వచ్చారు. ఏమిటే అంతా బాగేనా
ఏమయింది. అంటు అమ్మ ఎదురుగా వచ్చింది.
వేపచెట్టు ఏది ఎందుకు కొట్టించావు అన్నాను.
దాని వలన డాబా దెబ్బ తింటున్నాయి . అందుకే కొట్టింవలసి వచ్చింది అంది అమ్మ. అయితే అటువైపు కొమ్మ లను కొట్టిస్తే బాగుండు కదా .అసలు నీకు మనసు ఎలా వచ్చింది అమ్మ,
మన తల్లి లాంటి చెట్టు .అవును నాకు బాధగానే వుంది . దాని కొమ్మ లు కొట్టిస్తే ఎప్పుడు పెరుగుతునే వున్నాయి అంది . అమ్మమ్మ మేము చెట్టు నీడలో చల్లగా క్రికెట్ ఆడుకునేది ఇప్పుడు ఏలాగ ? నా కొడుకు చాల ఎండ అంటు బాధ పడ్డాడు. వెనుక పెరటిలో ఆడుకో అక్కడ కూడా చల్లగా వుంటుంది అంది అమ్మ.
దానికి నా కొడుకు ఏం మాట్లాడకుండ అలిగినట్టు కూర్చున్నాడు.సరే మీరు కాళ్లు చేతులు కడుక్కోని రండి అన్నం తిందురు గాని అంది అమ్మ. స్నానం చేయాలి అన్నాను. అప్పుడే మా ఇంట్లో పనిచేసే మల్లమ్మ రండి అమ్మ నీళ్ళు తొడుతాను అంది .ఏం మల్లమ్మ బాగున్నావా
నీ పిల్లలు ఎలా వున్నారు. ఆ బాగున్నాను అమ్మ మావోళ్ళు కూడా బాగున్నారు అంది.
ఆ సారి ఎండాకాలం భారంగా గడిచిపోయింది.
వేపచెట్టు లేకపోవడం వలన ఏదో వెలితిగా ఉన్నట్టు
అనిపించింది.
నేను తిరుగు ప్రయాణం హైదరాబాద్కి వస్తుంటే
నా బ్యాగు పట్టుకొని నన్ను బస్సు ఎక్కించడానికి మల్లమ్మ వచ్చింది.
ఆ చెట్టు కొట్టించనప్పుడు, అమ్మ చాలా బాధ పడ్డారు అంది . అమ్మగారిని ఎవరో ఏదో సహాయం కావాలి అని అడిగారు. అలాగే మీరు కూడా వస్తారు కదా
అమ్మ గారి చేతిలో డబ్బులు వుంచుకోరు. అందరికి సహాయం చేయడమే చేస్తూనే వుంటారు.
అవును మల్లమ్మ అంతే తన దగ్గర డబ్బులు లేకపోయినా వచ్చిన పంటలనైన పంచి పెడుతుంది.
నాకు ఇచ్చిన 2000 రూపాయాలు అమ్మ నా కోసం దాచిపెట్టి ఇచ్చిందా, వద్దు అంటునా వుంచుకో పిల్లలతో పట్నంలో ఎన్నో ఖర్చులు వుంటాయి అని బలవంతంగా నా పర్సులో పెట్టింది.
బస్సు కొరకు ఎదురు చూస్తు ఆ బస్ స్టాప్ లో కూర్చునాము. అప్పుడే ఇవన్నీ మాటలు చెప్పింది మల్లమ్మ.
అమ్మ నిజంగా తనకంటూ ఏమి ఆశించదు .ఎంతో అవసరం వుంటే డబ్బుల కోసం చెట్టు కొట్టించి వుంటుంది . వచ్చెటపుడు అమ్మ చూసిన చూపే గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నాన్న చనిపోయాక అమ్మ ఒక్కతే ఊరిలో వుంటు వ్యవసాయం పనులు చూసుకుంటుంది. పొలానికి కౌలుకి ఇచ్చారు. అన్నయ్యలు
నువ్వు ఇక్కడే ఎందుకమ్మా అని వాళ్ళు అన్న కూడా
అమ్మ మాత్రం ఇప్పటి నుంచి మీ దగ్గర ఎందుకు చేతకానపుడు వస్తాను అంది.
అమ్మకి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు నేను కూతురుని అందరికి పెండ్లిలు అయి పిల్ల పాపలతో హాయిగా వున్నాం.
ఆ కౌలుకి వచ్చిన పంటను అమ్మిన డబ్బులతో అమ్మ ఊరిలో ఆనందంగా బతికే స్తుంది .తనకు వున్న దాంట్లోనే ఆ ఊరిలో అందరికి కష్టాలలో అమ్మ అంటూ అడగ్గానే సహాయం చేస్తుంది. అమ్మ అదిగో బస్సు వస్తుంది అంటు నా కొడుకు హడావుడిగా లేచాడు . అప్పుడే నా ఆలోచనలు నుండి బయటకు వచ్చాను. బస్సు ఆగింది మల్లమ్మ ఎక్కి బ్యాగు పెట్టి సీటు ఆపింది.మేము ఎక్కాం సరే నమ్మ వుంటాను అంది. సరే అమ్మా జాగ్రత, నువ్వు జాగ్రత్త అని పర్సు నుండి 100రూపాయాలు తీసి ఇచ్చాను. ఎందుకమ్మా అమ్మ గారు ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తునే వుంటారు. అయిన వుంచుకో అని బలవంతంగా చేతిలో పెట్టాను. తాను దిగింది. బస్సు కదిలింది ..
కాలం గడిచి పోతుంది అమ్మ పూర్తి గా ఆరోగ్యం క్షీణించి కాలం చేసింది. అప్పుడు అందరం ఊరు వెళ్ళాము. అమ్మ కార్యక్రమాలు అన్ని ఊరులో బాగా చేశాము .తరువాత ఒకసారి నేను ఊరుకి వెళ్ళాను .వేప మొక్క పట్టుకొని ఎక్కడైతే ఆ చెట్టు వుండేదో అక్క డే ఆ మొక్క పెట్టి బాటిల్ లో వున్న కొన్ని నీళ్ళు ఆ మొక్కకు పోశాను .అలా హల్లోకి వెళ్లి అక్కడ అమ్మ పోటో చూసి దండం పెట్టుకొని, అమ్మ ఏం రోజు అయితే ఎంతో బాధ పడి ఆ చెట్టును తీసివేశావో, అందులో నాకు కూడ భాగం వుంది. అందుకే అదే జాగలో అదే మొక్క పెట్టాను. అది పెరిగి పెద్దదై ఎప్పటిలాగే ఈ ఇంటికి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అంటు అమ్మ ఫోటోను చూశాను. అమ్మ నవ్విన్నట్టు అనిపించింది. అప్పుడే చిన్నగా ఫోటో కూడా కదిలింది . బహుశ అది సరే అని నన్ను ఆశీర్వదించినట్టు అనిపించి అప్పుడు నా మనసు ఎంతో తేలికైంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!