పట్నం ( జానపద గేయం )

పట్నం ( జానపద గేయం )

రచన :: సావిత్రి కోవూరు

మరదలు :-
పట్నమెల్లి పోదాము రంగయ్య మామ – పసందుగ బ్రతుకుదాము రంగయ్య మామ

రంగు రంగుల దీపాలు రంగూల రాట్నాలు ౹౹రం౹౹
|| పట్నం ||

గోలకొండ, గండిపేట, చార్మినారు ,జూపార్కు,

లాడ్ బజారూకెళ్తే, రంగు రంగుల గాజులంట, పత్తరు గట్టి కాడ ముత్యాల రాసులంట,

బిర్లా టెంపుల్ కాడ ఎంకన్న ఉన్నడంట,ట్యాంకు బండు కాడికెళ్తే స్వర్గమె కనిపిస్తదంట,

మ్యూజియాలు, మ్యాజిక్కులు ,ఫలక్ నామ ప్యాలెస్లు

నాంపల్లి కాడకెళ్తే నుమాయిష్ ఉంటదంట,గాలి మోటర్లెల్లె ఏర్పోర్టు లుంటయంట,

కోఠిబజారు కెళ్తే కొత్త కొత్త షాపులంట, పిట్టలల్లె మనుషులంట,

లష్కర్ బోనాలు చూసి, చిలుకూరు చూసొద్దాం

ఆటో రిక్షా ఎక్కి మనం రయ్యి రయ్యిన ఎల్దాము
|| పట్నం ||

[మామ]:
పట్నమొద్దు గిట్నమొద్దు మరదలు పిల్ల, పల్లెలోనె బాగుందే మరదలు పిల్ల,

కల్తినీరు, కల్తిగాలి, కల్తిపాలు సర్వం కల్తీ అక్కడ
మాట కల్తి, మనసు కల్తి, నవ్వు కల్తి ,చూపు కల్తి
మనుషులంత కల్తీ కల్తీ       || పట్నం ||

పాలు తాగె పసి పిల్లల్ల ఎత్తుక పోతారంట,
కన్ను కాలు కత్తిరించి అమ్ముకుంటారంట,

అందమైన అమ్మాయిలనాగం చేస్తారంట, ఆసిడ్లు పోస్తరంట ,కత్తులు దూస్తారంట ౹౹పట్నమొద్దు౹౹

పచ్చనైన పైర గాలి సేద తీరుస్తుంటే ,పాడి పంటలు మనకు ఇల్లంత నిండి వుంటే,

ఊరు వాడ జనమంతా అండగ ఉంటారిక్కడ

పండగలు పబ్బాలు సరదాగా జరుపుకుందాం
౹౹పట్నమొద్దు౹౹

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!