అందం

అందం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పుష్పాంజలి

రాఘవయ్య గారికి లేక లేక ఒక పాప పుట్టింది. రాఘవయ్యగారు ఆ పల్లెలో పెద్ద రైతు. బాగా కలిగినవాడు నలుగురుకి పెట్ట గలగినంతా ఉన్నవారు. రాఘవయ్య గారికి తగిన భార్య
జానకమ్మ వారికి సంతానం లేదు వారికి అదే దిగులుగా ఉండేది. వారి మొక్కులు ఫలించింది ఒక పాప పుట్టింది. పాప నల్లటి నలుపురంగులో పుట్టింది. తల్లిదండ్రులు తెలుపుగా ఉన్నారు కానీ పాప మాత్రం నల్లని రంగు ఇది ఏమి విచిత్రం అని
అక్కన ప్రక్కన మాట్లాడుకునేవారు, రాఘవయ్య గారి పండితులకు పాప జాతకం చూపించారు. ఆమె జాతకం అద్బుతంగా ఉంది అన్నారు. పాపకి భైరవి అని నామకరణం చేసారు. పండితులు పెళ్ళి కొంచెం ఆలస్యం కావచ్చు అని చెప్పారు. కాలం ఎవరికోసం ఆగాదు కదా కాలగర్భంలో ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయింది. భైరవి ఇప్పుడు IAS Officer అయ్యింది. నలుగురి కష్టాలు తీర్చడానికి తను వారథి కావలని అనుకొంది. భైరవి ఇష్టం కాదనలేకపొయారు తల్లిదండ్రులు తన తరువాత
పుట్టిన పాప తెల్లటి తెలుపు జాహ్నవి తనకి చదువు మీదా పెద్దగా శ్రద్దలేదు బలవంతంగా డిగ్రీ వరుకు చదవింది. బైరవికి పెళ్ళిపట్ల ఆశక్తి లేనందున జాహ్నవికి సంబధం తెచ్చారు. అబ్బాయి IPS  అభిరామ్ పైగా చాల అందగాడు. రాఘవయ్య ఇంటికి పెళ్ళివారు వచ్చారు. ఆ ఊరిలో అందరికి పండుగ రోజులా ఉంది. పెళ్ళివారు రానేవచ్చారు. భైరవి కూడా చెల్లెలు పెళ్ళిచూపులకు ఇంటిదగ్గర ఉంది. భైరవి రంగు నలుపు అయినప్పటికీ కళగా తీర్చిదిద్దినట్లు బాపు బొమ్మలా ఉంటుంది. పైగా చదువుతో హుందాతనం వచ్చింది. జాహ్నవిని రెడిచేసి తీసుకుని వచ్చారు అమ్మాయి అందంగా అపురూపమైన రూపలావణ్యలతో కలిగి ఉంది. కనుక ఈ పెళ్ళి జరగడం ఖాయం. పైగా జాతకం
కూడా సరిపొయింది. అనుకుంటున్నారు అందరు.
అభిరామ్ మాత్రం ప్రక్కన ఉన్న భైరవిని చూసాడు తనకు భైరవిని పెళ్ళిచేసుకోవాలని ఉంది అని, అక్కడక్కడే తన నిర్ణయం తెలియచేసాడు అందరు అవాక్కయ్యారు. అభిరామ్ తల్లిదండ్రులతో పాటు వచ్చిన బంధువులు నీకు ఏమైంది? అభి
జాహ్నవి ఎంత తెల్లగా అందంగా ఉంది. నీకైమనా పిచ్చా అని అభిరామ్ ని ప్రక్కకు తీసుకుని వెళ్ళి తిట్టారు. అమ్మాయి ఉద్యోగం చూసి చేసుకోవాలని అనుకుంటున్నవా ఏమిటి? నల్లగా ఉంది పైగా ఉద్యోగం చేస్తుంది అనే గర్వం ఉంటుంది. ఆమె నలుపు వలన వంశం అంతా నలుపు రంగులో ఉంటుంది. అభిరామ్ అమ్మనాన్న మీకు నా గురించి బాగా తెలుసు కదా! ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎంతో ఆలోచన చేసిన తరువాత కానీ మీకు చెప్పాను అని నా నిర్ణయంనకు తిరుగు ఉండదు. హా తెలుసు లే నీ మొండి పట్టుదల ఇది నీ నూరెళ్ళజీవితం కదా అందుకే మా తాపత్రయం.
అభిరామ్ ఒక పాట విన్నారు మీరు నల్ల ఆవు కడుపులో తెల్ల ఆవు పుట్టాదా? తెల్లావు కడుపులో నల్లావు పుట్టాదా? వాళ్ళా కుటుంబలో అందరు తెల్లటి తెలుపుగా ఉన్నారు తను ఒక్కతే నలుపుగా ఉంది దీనికి కారణం ఏమిటి. అమ్మ నాకు ఒక్కసారి చూడగానే నా మనసుకి భైరవి నచ్చింది. రెండుసార్లు చూసిన జాహ్నవి నచ్చలేదు ఇప్పుడు భైరవి నన్ను పెళ్ళి చేసుకోను అంటే ఇలాగే ఉండిపొతాను.ఇదే నా తుది నిర్ణయం. అభిరామ్ తల్లితండ్రులు రాఘవయ్య గారితో అతని నిర్ణయం అతని మాటలు నెమ్మదిగా చెప్పారు. రాఘవయ్య మొదటిగా కొంచెం బాధపడిన తరువాత భైరవికి ఇంత ప్రేమించి మంచి భర్తను తీసుకుని రాలేను  నేను, రంగు చూస్తారు అందరు కానీ ఈ అబ్బాయి నా కూతురులోని ఆత్మస్థైర్యం చూసాడు హుందతనం చూసాడు. రాఘవయ్య గారు కుటుంబసభ్యులకు తన మనసులోని మాటలు చెప్పారు. మొదటిగా భైరవి ఒప్పుకోలేదు, తరువాత నాన్న మాటలను విన్న తరువాత నిజమే అనిపించి సరే నాన్నగారు మీ ఇష్టమే నా ఇష్టం. ఒక శుభముహర్తంలో అభిరామ్ భైరవికి ఘనంగా పెళ్ళి చేసారు రాఘవయ్య. రంగులో కాదు బుద్ది బాగుండాలి. జాతకం కాదు మన పెంచే పెంపకం గొప్పగా ఉండాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!