సహాయం అందిద్దాం

సహాయం అందిద్దాం 

రచన::కమల ముక్కు (కమల’శ్రీ’)

ఆటపాటలతో నవ్వుతూ తుళ్లుతూ
కేరింతలు కొడుతూ
సంతోష సాగరంలో
మునిగి తేలాల్సిన బాల్యం
దుఃఖసాగరంలో మునిగిపోతోంది

చదువుకోవాల్సిన పిల్లలు
వెట్టిచాకిరీ ఎందుకు చేస్తున్నారు
కార్మికులుగా ఎందుకు మారుతున్నారు

సమాజమే కదా వారిని
కూలీలుగా మార్చింది

మనుషులే కదా
వెట్టి చాకిరీ చేయిస్తోంది

పిల్లలు చదువుకోవాలి
పనిచేయరాదని
ఒక్కరైనా ఆలోచించి
పనికోసం వచ్చిన వాడి చేతిలో
పలకా బలపం పెట్టి
బడికి పంపితే
వాడి జీవితం
బంగారు మయం కాదా…!!!

మన ఓ రోజు ఆటవిడుపు
వాడి ఓ సంవత్సరపు చదువు
ఆటవిడుపు ఓరోజు ఆపితే
ఓ మంచి విద్యార్థి పుట్టుకొస్తాడనుకుంటే
ఆటవిడుపు మానడంలో తప్పులేదుగా…!!!

ఇప్పటికైనా ఆలోచిద్దాం
ఓ చిన్నారి బాల్యకార్మికుడు కాకుండా
ఉత్తమ విద్యార్థి కావడానికి
మనవంతు సహాయం అందిద్దాం…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!