“ఐకమత్యమే మహాబలం”

“ఐకమత్యమే మహాబలం”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

ఐకమత్యమనగానే మనకు గుర్తుకొచ్చే సూక్తి..”ఐకమత్యమేమహాబలం”అలాగే, పావురాలన్నీ కలిసి వలనెత్తుకుపోయిన పంచతంత్ర కథ.”బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ”పద్యం…కర్ర విడిగా ఉంటే విరవగలగడం, కలివిడిగా ఉంటే విరవలేకపోవడం ఉదాహరణగా చూపి అన్నదమ్ముల ఐకమత్యం అవసరాన్ని తెలిపే నీతికథ… ఇలాంటివి కోకొల్లలు మన తెలుగు సాహిత్యంలో…! ఈ తరం వారికి ఇవన్నీ బోధించాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఎ… ఎన్ని భాషలు,ఎన్ని జాతులు, ఎన్ని మతాలున్నా. ఏ ఏకత్వాన్ని భిన్నత్వంలో నిలిపి…
ఐ..ఐకమత్యంతో మెలగుతూ..మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి ఉంది…!
భార్యాభర్తల ఐకమత్యం, పిల్లల వ్యక్తిత్వ పునాది పటిష్టతకు అత్యవసరం. పిల్లలు పెద్దలనే అనుకరిస్తారు కనుక,కుటుంబ కలహాల ప్రభావం పిల్లలపై తప్పకుండా పడుతుంది. దాయాదుల మధ్య అనైక్యత కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది…! ఐకమత్యం బలం వల్ల రావణ సంహారం జరిగింది…! ఐకమత్యంతో ఉద్యమాలు విజయవంతమౌతాయి. స్వాతంత్ర్యాలు సాధించబడుతాయి. క్రొత్త ప్రపంచాలు సృష్టించబడతాయి..! సముద్రం నడుమ సేతువు నిర్మాణం సాధ్యమైంది..జర్మను విభేదాల గోడ కూల్చివేయబడింది…ఐకమత్య బలం వల్లనే కదా…!
“అందరికోసం ఒక్కడు నిలిచి. ఒక్కని కోసం అందరూ కలిసి” వేయి గొంతుకల బృందగానమై…
శాంతి గీతం ఆలాపించొచ్చు…! అనైక్యత అశాంతికి దారితీస్తే, ఐకమత్యం మహాబలమై., అనుకున్న కార్యాన్ని సాధించగలదు. అది కుటుంబమైనా…
దేశమైనా…!

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!