లావణ్య
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
మేఘాలు దట్టంగా ఉన్నాయి.
ఏ క్షణం లో నైనా వర్షం రావచ్చును.
పచ్చని పసుపు గోరింట పారాణి మువ్వల పట్టీలు చుట్లు చేతినిండా గాజు గాజులు సవ్వడి మెడలో కొత్త సూత్రాల తాడు పెళ్లికి పెట్టిన
ఉదారంగు పట్టుచీర కట్టుకుని
మెడలో ముత్యాలహరం వేసుకుని వాయినాలు ఇవ్వడానికి బయలుదేరింది
అది ఒక అదృష్టం తన అత్తవారి ఐదుగురు పేరంటాలు చాలు ఎన్ని ఏళ్లు అయినా అది పెరగదు
లావణ్య నోము పట్టి పేరంటాలకు
ఇవ్వడానికి వెడుతోంది
అత్తగారు నువ్వు వెళ్ళి అలవాటు చేసుకో
అందుకే ఆడపిల్లకి ఈ నోములు
మంచి మర్యాద నేర్పుతాయి
వడి వడి గా నడుస్తూ వెడుతోంది దారిలో
కొన్ని ఇళ్ళు తెలుసున్న వారికి ఇచ్చింది
ఒక్కటి మిగిలింది ఎవరూ అబ్బా అనుకున్నది ఎప్పుడు పక్కైల్లి వైపు చూడలేదు
పండు ముత్తయిదువులు దొరకడం కస్టం
ఆమె కొడుకు ఇంటికి వచ్చిందిట
ఆమె పలుకరుంచి వాయినం ఇవ్వాలా
అమ్మా అన్నది
అవును అండి ఈ ఇంట్లో ఎప్పుడూ మనుష్యులు కనిపించరు అన్నది
మా కోడలు ఉద్యోగానికి వెళ్లిపోతుంది.
అందుకు నీకు కనిపించే అవకాశం లేదు
దానికి పూజలు చేసే టైమ్ లేదు శ్రద్ద లేదు నేను నీకు నాలుగు వారాలు ఉంటాను
లోపలికి రా గుమ్మంలోనే ఉన్నావు
మా ఆయన అని చూపించింది
పండులా పచ్చగా ఉన్నాడు.
సౌభాగ్యవతి భవ అన్నాడు
వాయనం తీసి సర్ధి ఇచ్చింది
ఆయుష్ మాన్ భవ సౌభాగ్యవతి భవ
అని దీవించారు
శుక్రవారం నేనే వస్తాను వాయిననికి అని చెప్పింది
అలాగే బామ్మ గారు అన్నది
శ్రీ మహాలక్ష్మీ ఆ రూపంలో వరలక్ష్మీ గా వచ్చిందా. అనుకుని అలాగే అంటూ క్షిరాభ్ది కన్యక కు శ్రీ మహా లక్ష్మి కీని నీరజలయకును నీరాజనం నీరజనము
అని శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన
అనుకుంటూ పాడుకుంటూ ఇంటి వైపు కాటుక తడవ కుండా కొంగు కప్పి
పరుగు వడి వడి గా వెళ్ళింది
ఈ రోజుల్లో అసలు ఎలా దివించాలో కూడా తెలియని మనుష్యులు ఏమిటో చిత్రము