పెళ్లి ప్రయాణము

పెళ్లి ప్రయాణము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యునితో పాటు పరుగు మానవ జీవితము. సూర్యుడి కన్నా ముందు లేచి ఇంటి ఇల్లాలు చూడామణి ఇంటి పని, పూజ కావాల్సిన పనులు కాఫీలు అల్పాహారం చెయ్యాలి. అనంత పద్మనాభ శయనము మంచి స్తోత్రికుడు. పూజ పుణ్యం పురుషార్ధాలు మోక్షము ఉంటూ భక్తి తాత్విక చింతనతో ఉంటాడు. భర్త పుణ్యం భార్యకి వస్తుంది కనుక నువ్వు ఇల్లు చూసుకుని కీర్తనలు పాడుతూ ఉండు అనేవాడు. పిల్లలు చిన్న వాళ్ళు వాళ్ళని ప్రేమగా జాగర్తగా పెంచాలి అనేవాడు. చూడామణి చాలా సాత్వికురాలు చిన్నప్పుడు తండ్రి రంగా చార్యులు సంగీతం నేర్పించారు. కారణం మన పద్మనాభమునకు పిల్లను చెయ్యాలని కోరిక అందుకని శ్రద్ధగా కీర్తనలు పాడేలా నేర్పించారు అలాగే పెళ్లి చేశారు.

వాళ్ళ వాళ్ళు అంతా అరవలు మద్రాస్ లో స్థిరపడ్డారు పద్మ నాభము ఉద్యోగం కోసం రాజమండ్రి లో స్థిర పడ్డాడు. రూకలు ఎక్కడ ఉంటే అక్కడే నూకలు కదా అందుకని అక్కడే
పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు కావడం, పిల్లని అక్క కొడుక్కి పిల్లాడికి బావమరిది కూతుర్ని చేశాడు చూడామణి అన్న కూతురు అయితే ప్రేమగా చూస్తుంది.

ఆడబడుచు కొడుకు అల్లుడు అయితే ప్రేమగా చూస్తుంది అని అలా ఆలోచించి రెండు వైపులా పెళ్లి సంబంధం కలుపు
కొన్నాడు ఆలా జీవనయానం జరిగిపోతోంది.

డాక్టర్ కే అనంత పద్మ నాభ శయనం పెద్ద వయొలిన్ విద్వాంసుడు అంతే కాదు రాజమండ్రి ప్రభుత్వ సంగీత కళశాలలో ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు.

బావమరిది కొడుకు కోడలికి తమ్ముడు విదేశాల నుంచి వచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంటిల్లి పాది కలిసి పది రోజుల ముందు పెళ్లికి బయలు దేరారు కొడుక్కి ముగ్గురు పిల్లలు విదేశీ మోజు వద్దు ఉన్న డబ్బు చాలు తల్లి తండ్రులని చూసుకోవాలి. అంటూ హెచ్చరిస్తు పిల్లాడు నారాయణ ఆచార్యులకు ప్రైవేట్ కాలేజి లో ఉద్యోగంలో పెట్టాడు కోడలు లెక్కల టీచర్ గా మున్సిపాలిటీ లో చేస్తుంది డబ్బుకి లోటూ లేదు ప్రేమాభమానాలతో కుటుంబం గడచిపోతోంది ఇంకా విదేశి వ్యమోహందేనికి?

మనవలను చూడామణి గారంగా పెంచింది ఏమాత్రం ఎడవకుండా చూసేది.

పద్మనాభము కూడా మనుమలు ఏడుస్తుంటే కూర్చో బెట్టుకుని ఊరడించి చుడు చూడు అంటూ వయొలిన్ వాయిస్తూ చూడామణిని శ్రీ అన్నమ్మయ్యా, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన ముద్దు గారే యశోద శ్రావ్యముగా కలిసి పాడుతూ పిల్లలని ఆడించేవారు

అలా తాత బామ్మ పెంపకంలో పెరిగారు. అందులో రెండవ మనుమరాలు బామ్మ పేరు మణి అంటే మహా గారాభము.
అందుకే బామ్మ వడిలోనో భుజం పైనో పడుకుంటుంది..

మద్రాస్ పెళ్లి కని సామాన్లు సర్దారు అవి ఇల్లు మారుతున్నంత ఉన్నాయి. ఆత్రేయ పురం నుంచి పూతరేకులు బందరు నుంచి లడ్డూలు తొక్కుడు లడ్డులు తాపేశ్వరం నుంచి కాజాలు
పాలకొల్లు నుంచి మినప రొట్టెలు రైల్లో టిఫిన్ కి మర్నాడు బావు మరిదికి ఇవ్వడానికి విడి విడిగా పాకెట్స్ తెప్పించారు.

ఆయన శిష్యులు పాలకొల్లు లో ఉన్నారు వాళ్ళది పెద్ద హోటల్ కూడా ఇంకా గోదావరి జిల్లా అంటేనే అరటి గెలలు పనస కాయలు, వంకాయలు, పొట్లకాయాలు, పచ్చని తియ్య గుమ్మడి కాయలు ఇవన్నీ రెడీ చేశారు. అంతా కలిసి కార్లో బయలు దేరీ స్టేషన్ కి వచ్చారు సర్కార్ ఎక్కడానికి.

ఆ సర్కార్ ఎప్పుడు ఆలస్యమే కారణం కాకినాడ ఫోర్ట్ నుంచి బయలు దేరి రావాలి ఆక్కడి నుంచే కుపే బుక్ చేశారు అంతా పడుకోవడానికి బెర్తులు బుక్ చేశారు.

పద్మ నాభం తన కూడా వయొలిన్ కూడా పట్టుకు వెడుతున్నాడు పెళ్లికి సారే కూడా ఆంధ్రలో పురమాయించి రకానికి రెండు వందలు చొప్పున పెట్టెలు. కాజ లడ్డు మైసూర్ పాక్, అరిసెలు పురమాయించాడు.

మగ పెళ్ళి వారికి కావాల్సిన సారే పురమాయించి తెప్పించుకో మని అడ పెళ్లి వారు చెప్పారు పిల్ల శాలం కర్ణాటకకు చెందినది వాళ్ళు మద్రాస్ వచ్చి పెళ్లి చేస్తున్నారు.

చూడామణి ఎందుకు మీకు ఇప్పుడు వయొలిన్ అక్కడ కచ్చేరి చేస్తారా అన్నది. ఆహా నాకు మెడలో భుజముపై ధన్యము గాయిత్రి సావిత్రి గా అంటాము. చేతిలో వయొలిన్ సరస్వతి దేవి ఉండాలి. ఇది విద్వాంసుడు లక్షణము పెళ్ళిలో కచ్చేరి ఉంటుంది. నా చిన్నతంలోనే నాతో పాటు మృదంగం నేర్చిన రామేశ్వర్ ఘటం నేర్చిన హనుమంత్ వస్తున్నారు

వాళ్ళకి జవారు పెట్టీ ఖర్చులు ఇస్తే చాలు నేనంటే ప్రాణమే వాళ్ళకి. అవును చూడామణి నువ్వు కూడా శ్రీ అన్నమయ్య, శ్రీ వెంకటేశ్వర్ స్వామి కీర్తనలు పాడు నేను వాళ్ళు నీకు వాయిద్య సహకారం చేస్తాము అన్నాడు. సరే లెండి మనం పెళ్లికి వెడుతున్నట్లా లేక కచ్చేరి వెడుతున్నమా అని నవ్వింది.
రెండునూ..

ఈలోగా స్టేషన్ వచ్చింది సామాను దింపి లోపల పెట్టించారు నల్గురు పోర్టర్లు మోసినా సరిపోలేదు. మళ్లీ వాళ్ళు అందరూ కూడా కొన్ని మోశారు కూడా ఇద్దరు స్టూడెంట్స్ నీ తెచ్చుకున్నారు వాళ్ళు సహాయం చేశారు వెళ్లి కూర్చున్నాను.

రైల్ వచ్చే లోగా ఎన్ని రకాల మనుష్యులు వారి మనస్త్వలతో చూస్తూ అదో కాలక్షేపంగా ఉంది. అప్పుడే రెండు గంటలు దాటింది. రైల్ వే వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం కొత్త విషయం చెప్పారు. దాంతో స్టేషన్ లో కలకలం మొదలు అయ్యింది

పిల్లలను ఎత్తుకుని సామాను మోసుకుంటూ ఫ్లై ఓవర్ మీద నుంచి పరుగులు పెడుతున్నారు. ఇదేమిటి రా ఇంత ఆలస్యంగా రావడం మళ్ళీ రెండో లైన్ కి బండి రావడం అంటే అప్పటికప్పుడు పెద్ద వాళ్ళు ఎలా పరుగు పెడతారు
అనుకుంటూ బళ్ళ వాళ్ళను పోర్తె ర్ల నీ పిలిచి తొందర తొందరగా మార్చారు. హమ్మయ్య పెట్టెలు స్కుట్ కేస్లు లెక్క పెట్టుకున్నారు పిల్లలు ఉన్నారా లేదా చూసుకున్నారు.

మొత్తానికి మద్రాస్ సర్కార్ ఎక్కి సీట్లలో కూర్చున్న తరువాత వాళ్ళ స్టూడెంట్స్ దిగి వెళ్లి నిల్చున్నారు.

హమ్మయ్య ఈ కుర్రాళ్ళు వచ్చారు కనుక కష్టం లేకుండా సామాను సర్దారు అనుకుంటూ చూడామణి ఆనందం వ్యక్తం చేసింది మరి యూత్ అంటే అదే కదా రైల్ కూత వేసి బయలు దేరింది స్టూడెంట్స్ చెయ్యి ఊపి వెళ్లి పోయారు. రైలు గోదావరి బ్రిడ్జి మీద నుంచి పెద్ద ధ్వని చేస్తూ వెళ్ళింది. లైన్ స్టేషన్లు వస్తున్నాయి మద్రాస్ అఖరు స్టాప్ కనుక లగేజ్ దింపడం తేలిక ఇక్కడ ఎక్కించడమే శ్రమ అనుకుంటూ చూడామణి పెళ్లి వారికి ఫోన్ చెయ్యి మా అన్నయ్యని వ్యాన్ తీసుకుని రమ్మని అని కోడలికి చెప్పింది

అవును మరి ఆంధ్రలో వస్తువులన్నీ తమిళనాడు తరలిస్తున్న విషయం మీ అన్నయ్యకు చెప్పి మరీ పెద్ద వ్యాన్ లు కార్లు పంప మను అని అందరూ హాయిగా నవ్వుకున్నారు శాంతి శుభము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!