లోహ విహంగం

లోహ విహంగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

ప్రపంచాలను ఏలే ఏకైక మహా రాజు
ఖండ ఖండాలు, గంటల వ్యవధిలో,
చేర్చే ‘నీలాకాశాన ఎగిరే, కనరాని దూరాలను, కనురెప్ప వ్యవధిలో, చేరవేసే ఓ’ లోహ
విహంగమా, నీకు జోహార్లు.!!
అత్యంత వేగంగా గమ్యం చేర్చే , ఒకే ఒక ప్రయాణ సాధనం మన విమానయానం,
వేల అడుగుల ఎత్తులో, సకల సౌకర్యాలతో, ప్రయాణికుల, ప్రయాణం సుగమం చేసే
మన విమానయానం!
ఒకప్పుడు ధనికులకే అనుకూలం, నేడు ప్రతి మానవునికి అనువైన ప్రయాణ సౌకర్యం , వ్యాపారవేత్తలకు, రాజకీయ నేతలకు, క్రీడాకారులకు, దేశ విదేశాల విహారయాత్రలకు, సముద్రాలు దాటి, ఎడారులు దాటి, గగనంలో సర్రున దూసుకుపోతూ, ‘ఆధునికతకు అద్దం పట్టిన, నవ నాగరికతను సరైన సమయం లో గమ్యానికి చేర్చే, అతి సురక్షితమైన ఒకే ఒక ప్రయాణ సాధనం మన విమానయానం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!