తుంటరి కోతికి గుణపాఠం

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

తుంటరి కోతికి గుణపాఠం

రచన: సంజన కృతజ్ఞ

ఒక అడవిలో మంచి కోతి తుంటరి కోతి ఉండేవి. ఆడుతూ పాడుతూ చెట్ల మీది నుంచి దూకుతూ సరదాగా గడిపేవి. తుంటరి కోతి మాత్రం అన్ని జంతువులను ఆటపట్టించేది దాని చేష్టలకు చాలా జంతువులు బాధ పడేవి. కానీ ఏమి అనలేక పోయేవి. ఓ చోట గుంపులుగా ఉన్న కప్పలను చూసి. పాము వద్దకు వెళ్లి నీకు మంచి ఆహారం చూపిస్తాను రా అని అక్కడికి తీసుకెళ్ళింది. పాము ని చూడగానే ప్రాణభయంతో కప్పలు గెంతుతూ పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది పాము పడుకొని ఉంటే పడుకొని వెళ్తున్న చీమలను ఆపి తీసుకెళ్లి పుట్టలో వదిలేది చీమలు కుట్టి పాము విలవిలాడుతు పారిపోతుంటే చూసి సంతోషించేది. జింకలను అనవసరంగా పరుగులు పెట్టించేది. ఉడుతల పైకి చిన్న చిన్న రాళ్ళు విసిరేది.

అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులు ఏడిపించేది. మంచి కోతికి నచ్చేది కాదు అలాంటి పనులు మానుకోవాలని చాలాసార్లు హెచ్చరించేది. అయినా అది మారలేదు అప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నీ మట్టి బుర్రకి ఏం తెలుసు అని పొగరుగా సమాధానమిచ్చేది. తుంటరి కోతి కి ఒక పిల్ల ఉండేది అదంటే తల్లికి విపరీతమైన ప్రేమ ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికినా కనిపించలేదు .తిరిగి తిరిగి తుంటరి కోతి అల్లాడి పోయింది. బిడ్డ కోసం తిండి , నిద్ర మాని బెంగతో నీరసించింది. అప్పుడు మంచి కోతి పిల్లను తీసుకొచ్చి తల్లికి అప్పగించింది. తుంటరి కోతి వెంటనే దాన్ని గుండెకు హత్తుకుంది.

నా పిల్ల నీకెక్కడ కనిపించింది అని మంచి కోతి అడిగింది. దొరకడమేంటి..! నీ బిడ్డను నేనే దాచిపెట్టాను అని జవాబిచ్చింది. అలా ఎందుకు చేశావు? అని కోపంగా అడిగింది తుంటరి కోతి ఏడిపించి వినోదం పొందడంలో ఆనందముందని నువ్వే చెప్పావు కదా! అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే చూసి ఆనందిద్దామని అలా చేశా అంది మంచి కోతి. ఒకరిని ఏడిపించి సంతోష పడడం ఎంత తప్పో ఆ బాధ తనవరకు వచ్చాక తుంటరి కోతికి అనుభవమైంది తనకు గుణపాఠం చెప్పేందుకే మంచి కోతి అలా చేసిందని అర్థం చేసుకుంది. ఆ తర్వాత నుంచి అల్లరి పనులను చేయడం మానేసింది సహకార గుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతి లో మార్పు తీసుకొచ్చిన మంచి కోతిని మిగతా జంతువులు అభినందించాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!