కదంతొక్కిన నాగేటిచాలు

కదంతొక్కిన నాగేటిచాలు

రచన: దాకరపుబాబూరావు

చూడం గానీ మనంతినేప్రతి మెతుకులోనూ అతడు కనిపిస్తాడు. అతడే ఈ దేశపు రైతు..

వ్యవసాయం చేసి నెఱలిచ్చిన బతుకు చిత్రాన్ని
పచ్చని పైరు చాటున దాచేస్తూ రైతే రాజు అన్నట్టు తిరిగేస్తుంటాడు…

దేశానికి అన్నం పెట్టటానికి తన ఆకలిచాళ్లను
అభిమానంగా దున్నుకుంటూనే ఉంటాడు…

చేసిన చెమట సేద్యాన్ని పండించిన కాయకష్టపు పంటను
అరకొర బేరాలతో దళారీ రాబందులు తన్నుకెళ్లిపోతే…

అప్పుల తెప్పల్లో సాగుతున్న కుటుంబ నావను
ఒడ్డెంకించలేక
అతడు ఏ పురుగుల మందుల్నో ప్రేమిస్తే అప్పుడప్పుడూ
వార్తా పత్రికలలో సాధారణ వార్తయి కనుమరుగై పోతూఉంటాడు….

మద్దతు ధర కోసం చేసేఅతడి ఆక్రన్దన ఎవరికీ పట్టని అరణ్యరోదన…

రోజువారీ తిండి గింజల్ని కూడా ఆన్లైన్అంగళ్ళల్లో
జీ ఎస్టీ కూలింగ్ రేట్లకు కార్డ్ స్వైపింగ్ లతోషాపింగ్ లు చేస్తున్న మనకు
ఆ గింజల్ని పండించిన వాడి చెమట వాసన ఎలా తెలుస్తుంది…???

పొలం పండినా పండకున్నా…కన్నీటి కమతాలు చేసి బతుకీడ్చు కుంటున్న రైతును
సాగుచట్టాల పేరు చెప్పి వ్యాపారం చేయాలనుకుంటే…మనం చూస్తూ ఊరుకున్నా

రగిలిన గుండెతో అతడు కదం తొక్కిన నాగేటిచాలు అవ్వడా…???

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!