ఓ గృహిణీ…! నీకు పాదాభివందనం

ఓ గృహిణీ…! నీకు పాదాభివందనం

రచన : నాగ రమేష్ మట్టపర్తి

అలుపెరుగక తిరిగే యంత్రంలా…
శ్రమిస్తావు ” నిత్యం ”
ఇంటిపనుల్లో అటుఇటు తిరుగుతూ…
చేస్తావు ” నృత్యం ”
సమయానికి ముందే పూర్తి చేస్తావు…
ప్రతీ ” కృత్యం ”
అందరూ తినగా మిగిలిన కొంచమే…
నీకు ” పత్యం ”
నీ కష్టానికి ఆశించవు ఏనాడూ…
ఏవిధమైన ” భత్యం ”
నీవు విలువకట్టలేని…
అపూర్వ ఆణి ” ముత్యం ”
ఇది జనమెరిగిన, జగమొప్పిన…
గొప్ప ” సత్యం ”

ఇంత ఉన్నతమైన నీ పై చూపిస్తారు…
అందరూ అనవసర ” ఆధిపత్యం ”

లోకమా…!
మగువ విలువ తెలుసుకో…!
ఆమెతో గొప్పగా మసులుకో…..!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!