ముద్దులొలికే పాపాయిలు

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                ముద్దులొలికే పాపాయిలు

రచన :: పి వి. యన్. కృష్ణవేణి

కల్లాకపటంతెలియని హృదయంతో
కల్మషం తెలియని మనసులతో
చల్లనైన తేటతేట చిరునవ్వుతో
నా మనసున ఆనందం నింపెను

స్వచ్ఛమైన ప్రేమను పంచుతూ
స్వార్థం తెలియని హృదయంతో
పసిడిని మరిపించే ఛాయతో
చూడగానే ముగ్ధులను చేస్తారు

అమాయకత్వం నిండిన కళ్ళతో
బోసి నవ్వుల సరిగమలతో
వారికి పరిచయం లేని ప్రపంచంతో
మన ప్రపంచమే వారు అవుతారు

వారు అందించే ముద్దుల మూటలు
వారి నోటిలో వచ్చే చిన్ని మాటలు
వారే దోచుకునే అందరి మనసులు ఈ చిట్టి పొట్టి బుజ్జి పాపాయిలే నా నేస్తాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!