ప్రాణం విలువ

(అంశం:చందమామ కథలు)

ప్రాణం విలువ

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

అనగా అనగా ఒక్ రాజు ఆ రాజు పేరు మణి వర్మ ,దేశ ప్రజలను ఎంతో బాధ్యతగా అభిమానంగా దినదినాభివృద్ధి
గా చూస్తూ పరిపాలన చేస్తున్నాడు.

మణి వర్మకి నలుగురు కూతుళ్ళు ఇంకా పుత్ర సంతానం కోసం చూస్తున్నారు

ఆడపిల్లల పేర్లు. విరజ,వనజ ,సుమజ, ధిరజ వీరిని మగ పిల్లల మాదిరి రాజ పరిపాలన విద్యలు నేర్పిస్తున్నారు.

చతుర్వేద ముల వలె నల్గురు తండ్రి కి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేస్తున్నారు.

భగవంతుడు కరుణించి మగ సంతనకోసం చేసే ప్రయత్నం
కూడా ఫలించ డానికి కొన్ని అంశాలు తెలిపారు.

పండితులు జ్యోతిష్కులు అంతా కలిసి ఒక నిర్ణయానికి
వచ్చి మహా రాణికి యవలు ధాన్యంతో బెల్లం కలిపిన లడ్డు
చేసి తినిపించి వీణపై వేదం ఋక్కు లు వాయిస్తే తప్పక మగ పిల్లాడు పుడ తాడని సంగీత శాస్త్ర నిపుణులు చెప్పిన విధానంలో మార్పులు చేర్పులు చేస్తూ సంగీత వేద నాదాన్ని వినిపించారు.

తొమ్మిదవ నెల లో పండంటీ బిడ్డకు జన్మ నిచ్చింది రాజ్య మంతా ఆనందం వెల్లవిరుస్తోంది అందరికీ పండుగ గా ప్రజలు సంతోషించారు

దిన దిన   ప్రవర్ధ మానంగా పిల్లాడు ఎదుగుతూ అందంగా ఉన్నాడు జాతకం చూపించి శ్రీనివాస వర్మ పేరు పెట్టీ బారసాల అతి ఘనంగా చేశారు

ఒక్క పిల్లాడు నల్గురు తరువాత పుట్టాడు నట్టిల్లు అంతా బంగారమే అయింది అన్ని కలిసి వచ్చాయి.అయితే పిల్లాడు గారం వల్ల పెంకిగా మారుతున్నాడు.ఎది పడితే అది విసిరేసి తెమ్మని అంటాడు.అక్కలు ఎంత చెప్పినా వినడు.ఒకసారి ఒక పెద్ద కర్ర ముక్కను విసిరేశాడు అధి కాస్త వెళ్లి రాచ వీధిలోకి వచ్చిన బ్రాహ్మణ పండితుడికి తగిలింది.

భాదతో ఎంతో గట్టిగా అరిచాడు దానికి అక్కడ ఉన్న పురజనులు రక్షక భటులు అంతా గుమిగూడి ఓ దార్ చారు రాజుగారు వరకు వెళ్లి ఆయన పండితుణ్ణి రప్పించి వైద్యం చేయించి క్షమించమని అడుగీ కుమారుని తప్పుకి కూడా త నను  క్షమించమనగా అతనికి ఏమీ ప్రాణం విలువ  తెలియదు అన్ని మీరు నేర్పుకోవాలి మంచి పండితుని దగ్గర విద్యకు పెట్టమని సలహా ఇచ్చాడు.

దానికి శ్రీనివాస వర్మ ప్రాణం విలువ అంటే ఏమిటి? అని అడిగాడు.

దానికి తండ్రి నాయనా మనిషికి ప్రాణం ఉంటేనే జీవితము ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు ప్రాణమే ముఖ్యము అని చెప్పి రాజ గురువు కు కబురు పంపాడు

ముహూర్తం చూసి విద్యకు గురుకులానికి పంపిస్తా అంటే
రాణి గారు కొడుకుని వదిలి ఉండలేను అన్నారు.

సరే అయితే ఉదయం రథంలో దింపి వస్తారు. భో జనం అని మనమే పంపు దాము అని చెప్పారు గురువును సత్కరించి
పంపారు.

ప్రతి రోజు రాజ కుమారుడు రథం పై వెళ్ళేవాడు పాఠాలు
అయ్యాక అక్కడి వారు ఏదో ఒక రకం ఆహారం తినేవారు.

శ్రీనివాస వర్మకి మాత్రం పన్నెండు గంటలకి పెద్ద క్యారేజ్ లో పంచభక్ష్య పరమాన్నాలు వచ్చేవి అతనికి వడ్డించి తినిపించి వెళ్ళేవారు .

ప్రతి రోజు గురువు పాఠం అయ్యాక నాకు ప్రాణం విలువ,తెలుప లేదు అనేవాడు

గురువు నవ్వుకునీ చెపుతాను అనేవారు ఆలా అరు నెలలు గడిచింది కొంత విద్య అయ్యింది.అక్కడ అంతా చెరువు . నీరు తాగుతూ ఉంటారు కంద మూలాలు పళ్ళు తింటారు
కానీ రాజకుమారుడు అలా కాదు కదా

ఒక రోజు మధ్యాహ్నం 12 దాటింది శ్రీనివాస వర్మకి దాహం వేసింది అక్కడి నీరు తాగండి అంటే భయపడ్డాడు నాకు బంగారు పాత్రలో నీరు కావాలి. ఇంకా తెలీదు అని అలా కూర్చున్నాడు పిల్లలు ఇతర విద్యార్థులు అంతా చెరువులో నీరు తాగి ఆకుల్లో గురువు గారు వండుంచిన గోధుమ వంటకం మజ్జిగ వేసుకుని పచ్చడి నంచుకుని తిన్నారు
ప్రతి సారి అన్నం దగ్గర గొడవ చేసి గిన్నెలు గరిటలు విసిరేసి పడేసేవాడు ఇవన్నీ చూస్తూ సైనికులు పడే బాధలు చూసేవారు ,ఏమి చెయ్యాలి?

కానీ రాజ కుమారుడు ఏమి ముట్ట లేదు అతనికి వంట కాలు రాలేదు ఒంటీ గంటకు నీరసం దాహం అంటూ చెట్టు కింద సొమ్మ సిల్లి పడ్డాడు.

మిగిలిన విద్యార్థులు విషయం గురువు కు చెప్పి రాజు గారికి కబురు పంపమని చెప్పారు

రాజ కుమారుడి దగ్గరకు వచ్చి మట్టి పాత్రలో నీరు ముఖం పై చల్లి తాగ మాన్నారు.
వద్దు వద్దు అన్నాడు
కానీ గురువు నీ ప్రాణం నిలవడానికి ఈ నీరు తాగాలి అని దగ్గర ఉండి పట్టిస్తే కొంచెం తేరుకున్నాడు

ఆహారం కొంచెం తినిపించారు అప్పుడు కొంచెం తెప్పరిల్లాడు నాయనా మనిషి ప్రాణం పంచ భూతాల్లో ఉన్నది. మనం వాటి విలువ తెలుసుకో వాలి  అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నంలో నీటిలో ప్రాణం ఉన్నది కనుక నీవు నీ తోటి మనుష్యుల్ని గౌర వించా లి .ఆహార వస్తువులను మనమెంత  గానో విలువ శ్రద్దతీసుకోవాలి

విద్య తో పాటు మనిషి సంస్కారం నేర్చు కోవాలి. అనిచెప్పి. .రాజ కుమార మన ప్రాణం విలువ తెలిసిందా, అన్ని ఉన్నప్పుడు విసుగుకుని అల్లరి చేసి తిండి మానేసి గిరాటు పెట్టడం ఎంత చెడ్డది. నువ్వు ఆహారం విలువ మనిషి విలువ అన్ని తెలిస్తే నే జీవిత విలువ ప్రాణం విలువ తెలుస్తుంది. ఎదుటి మనిషిని వేధించి ఆనందం పొందడం కాదు
ఎంత అధికారం ఉన్నా ఆకలి సమయానికి పట్టెడు మెతుకులు కావాలి అవి ఎంతో కష్ట పడితే గానీ రావు. వస్తువులు విలువ తోటి మనిషి విలువ తెలిస్తే ప్రాణం విలువ తెలుస్తుంది అని చెప్పారు మన పురాణ గాథలు వాగ్గేయ కారులు ఎన్నో రచన ద్వారా ఈ విలువలు తెలిపారు.నువ్వు అన్ని శాస్త్రాలు తెలుసుకోవాలి. సంగీత శాస్త్ర పద్దతిలో నువ్వు పుట్టావు
పుట్టుట గిట్టుట నిజము
నట్ట నడిమి పని నాటకము
అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో
చెప్పిన సత్యం తెలుసుకుని జీవించాలి అని చెప్పారు
ఈ లోగా ఈ వార్త విన్న రాజు రాణి వచ్చి గురువు పెట్టిన పరీక్ష వల్ల తమ కొడుకు ప్రాణం అంటే ఏమిటి దాని విలువ తెలుసుకున్నాడు అని సంతో దించారు

అప్పటి నుంచి శ్రీనివాస వర్మ మళ్లీ అల్లరి చెయ్యలేదు
పెద్దలంతా ఎంతో మెచ్చుకు నే విధంగా మ సలు కొని గొప్ప రాజుగా ప్రజల్ని పాలించాడు.కనుక చిన్న తనంలోనే పిల్లల అల్లరి మాన్పించండి

కథ కంచికి మనం మన తపస్వి మనోహరం కథల పోటీ ఇంటికి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!