ముద్దు పాపాయిలు

ముద్దు పాపాయిలు

రచన: బుదారపు లావణ్య

మసక చీకటిలో
ప్రసరించే వెలుగులా
మోముపై చెరగని చిరునవ్వుతో
అలసిన మనసుకు
ఆనందాన్ని అందించే
ఆనంద స్వరూపాలు….

మండే ఎండలో
దాహార్తిని తీర్చే నీటి చుక్కలా
మమకారపు పూతోటలో
వికసించిన
ప్రేమ స్వరూపాలు….

ముద్దు మురిపాలతో
ముసిముసి నవ్వులతో
ముత్యమంటి మనసుతో
ముంగిట్లో నడయాడే
దేవతా మూర్తులు….

చిట్టి పొట్టి పాదాలతో
చిందులు వేస్తూ
అల్లరి ఆటలతో సందడి చేస్తూ
ఇంటిల్లపాదిని సంబురాల
హరివిల్లులో ముంచేస్తూ
కల్లాకపటం ఎరుగని మోముతో
స్వచ్ఛమైన మనసుతో
కళ్లముందు కదలాడే
కాంతి కిరణాలు
ఈ…ముద్దు పాపాయిలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!