ఆధ్యాత్మికత – బ్రహ్మ పదార్థం
రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
మత కట్టుబాట్లకు అతీతం ఆధ్యాత్మికత
మానవతకు ఆది మూలం ఆధ్యాత్మికత
మానసిక స్వచ్ఛతకు ఆలంబన ఆధ్యాత్మికత
అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు ఆధ్యాత్మికత
సవ్య జీవనానికి గమ్యం ఆధ్యాత్మికత
సమత్వానికి సూచన ఆధ్యాత్మికత
భవబంధాలకు ముక్తి మార్గం ఆధ్యాత్మికత
అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు ఆధ్యాత్మికత
అందమైన మరో ప్రపంచం ఆధ్యాత్మికత
ఆనందమైన అనుభూతి ఆధ్యాత్మికత
ఆత్మతో అనుసంధానం ఆధ్యాత్మికత
అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు ఆధ్యాత్మికత
మాయ తొలగిస్తే లభ్యం ఆధ్యాత్మికత
సాటి మనిషికి చేయూత ఆధ్యాత్మికత
వన్నెల వెన్నెల వాస్తవ లోకం ఆధ్యాత్మికత
అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు ఆధ్యాత్మికత
****