ఉప్పుటేరు

ఉప్పుటేరు 

రచన::రవి బాబు బొండాడ

ఆకాశానికి చిల్లుపడినట్లుగా వర్షం మూడు గంటలుగా పడుతూనే ఉంది.
అహంకారికి అధికారం వచ్చినట్లుగా వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ధారలుగా పడుతున్న నీటి చారలు కాలువలకు కొత్త రంగులద్దుతుంటే, చెరువులుత్సా హంతో పొంగుతున్నాయి. సోమ్ములున్న సాములు
కాంక్రీట్ భావనాలలో ఇన్ వెర్టర్ల వెలుగులలో
చిటపటల చినుకులను ఆశ్వాదిస్తూ మెత్తటి దుప్పట్లను కప్పుకుని కలలు కంటున్నారు. దేశంలో సమానత్వం రాజకీయ నాయకుల ప్రశంగాలలోనే కనిపిస్తుంది. కాని అందరూ సమానమే అనడానికి అందరూ సిద్ధంగా ఉండరువిచిత్రంగా !
కానీ…
చీకటికందరూ సమానమే .పేదవాడి ఆవేశంలా అల్లంత దూరన మిగిలిందొక పూరిగుడిసె ‘.. ఆ కటిక చీకట్లలో చిల్లులు పడిన గొడుగులాంటి పూరి గుడిసెలో, కష్ట్రాలు రెక్కలిప్పుకుంటున్నాయి . తాటాకుల నుండి కారుతున్న నీటికి అన్నం కుండ నిండిపోయింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది .చీకటిలో, ఆ వర్షపు ధారలలో కట్టెలపపొయ్య భగభగా మండుతూ వెలుగు నూ, వేడి నీ అందిస్తుంది.చీకటిలో కూడా
ఆకలి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ,ఆ పూరిగుడిసెలో నులకమంచం పై మూలుగుతున్న పిల్లలిద్దరూ అమ్మా ‘ ఆకలి, అమ్మాఆకలి అంటూ అలమటిస్తుంటే
అమ్మ… కంటికి వరదొచ్చింది ఆకలి తీర్చలేక..కాలుతున్న పోయిపై మసి పట్టిన పాత్రలో కాసిని,మేకపాలు కాస్తుంది పిల్లల కోసం…
నులక మంచంపై నుంచి ఎముకలగూడయిన పెద్ద కొడుకు లేని బలాన్ని కూడగట్టుకుని అమ్మ దగ్గర కొచ్చాడు తడిబారిన కళ్ళతో అమ్మ ఒడిలో తలపెట్టి అమ్మ చేతి స్పర్శతో సాంత్వన పొందుతున్నాడు.

అమ్మా, …. నాన్న లానే నేనూ తమ్ముడూ, ఇద్దరం చనిపోతామా? మాకు ఏమయిందమ్మా, …. మాకెందుకమ్మ ప్రతి 6 నెలలకు సూదులు గుచ్చి రక్తం మారుస్తూ ఏవేవో చేస్తున్నారు.. అమ్మ మాట్లాడటం లేదు.
గుండెల్లో దుఖం పొంగుకొస్తుంది ,పోయి పై పాలు పొంగుతున్నట్లుగా…
ఓ మాటు ప్రసిడెంట్ గారి కాళ్ళు మీద పడి నువ్వడుగుతుంటే విన్నానమ్మా…. డయాలసిస్ చేయించకపోతే మేమూ, నాన్న లాగే చచ్చిపోతామా అమ్మా ‘
మన మేకలు ఆసుపత్రికి వెళ్లి వచ్చాకా కనపడటం లేదేంటమ్మా… అమ్మ మాట్లాడటం లేదు… శోకానికి ప్రతీకలా ఉంది . ఇంకా నాలుగే ఉన్నాయేంటమ్మా !
తమ్ముడుకి చెక్కకాలు, చక్రాల కూర్చి ఎపుడు కొంటావమ్మ ? వాడూ నాతో నడవ గలడా అమ్మా ?
ఆ పసివాడి మాటలకి తల్లి తల్లడిల్లుతుంది .. కారే కన్నీటి సాక్షిగా… భయట వర్షం కురుస్తూనే ఉంది
చెట్టుకి కట్టిన మేకలు , ముద్దవుతున్నాయి.. రాత్రంతా తమ వెంట్రుకలను విదుల్చుకుంటూ ”… ” పిల్లలు పడుకున్నారు ..
అమ్మలో ఆలోచనలు నిద్ర లేచాయి.ఏ జన్మలో ఏం పాపం ‘చేశాను? నా బిడ్డల కెందు కీ శిక్ష …? కడుపులో పెట్టుకు చూసుకునే భర్త అంతు చిక్కని కిడ్నీ వ్యాధితో దూరమైపోనాడు. ఇప్పుడదే మహమ్మారి నా బిడ్డలపై పడి విరుచుకు తింటుంది. వాళ్ళు బ్రతకాలంటే , పెద్దాసుపత్రిలో డయాలసిస్ చేయించాల! వేలకు వేలు ఎలా తెచ్చేది… వేళాడు పోతున్న పిల్లలను ఎలా బ్రతికించుకునేది ? పశ్నల పురుగు తొలచేస్తుందా తల్లిని ‘ వేయి ప్రశ్నలతో ఆలోచిస్తూ అమ్మ సృహ తప్పింది.
కొద్ది సేపటికే ,భళ్ళున తెల్లారింది… చీకట్లు మాయమయ్యాయి వర్షం ఇంకిపోయింది.
సమయం ఉదయం 9 గంటలు
అమ్మ వికలాంగుడైన చిన్న కొడుకుని చంకనెత్తుకుని పెద్ద కొడుకు వేలు పట్టుకుని ఊరి దాటడానికి సిద్దమవుతుంది …
ఆ నాలుగు మేకలకూ ఏ0 అర్థమయిందో తెలీదు! దీనంగా రోదిస్తున్నాయి. మేకల మెడలక్కట్టిన తాళ్ళను తీసి మెడలో వేసుకుని ముందుకు నడుస్తుందా అమ్మ.

ఎక్కడకెళుతున్నాం అమ్మా’పెద్దాసుపత్రికా ?
వేలు వదలకుండానే అడుగులేస్తూ, అడిగాడు పెద్ద కొడుకు
అమ్మ మాట్లాడటంలేదు .దుఃఖ వాహినిలో సాగిపోతుందామె. అల్లాంత దూరాన సంద్రాన్ని తలపించే ఉప్పుటేరు …
భానుని వెలుగుల లో మెరిసిపోతున్న “ఉప్పుటేరు ”
తాడిని కూడా మింగేయగల ఉప్పుటేరు .
అమ్మ గుండెను బండ చేసుకుంది .మెడలోని తాడుని
తన పిల్లల నడుముకి కట్టి , భర్త లేని ఆడదిగా పిల్లలకు అన్నం పెట్టలేని తల్లిగా ఓడి పోడానికే సిద్ధ మయ్యింది . బాధను దిగమింగుకుని పిల్లలను ముద్దాడి
ఇక మనకీ కష్ట్రాలుండవంటూ ఉప్పుటేరు లోకి ఒదిగి పోయింది.
ఇరవై అడుగుల లోతుండే ఉప్పుటేరు వాళ్ళను గుండెల్లో దాచుకుంది… సజీవంగా …!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!