మాకథ

మా కథ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కూచిబొట్ల జనార్ధన స్వామి

       ఏంటి కవీ! రెండు రోజులుగా ఎక్కడకి పోయావ్?… పార్క్ లో బెంచి మీద కూర్చొన్న నన్ను తెల్ల గులాబీ పలకరింపు. “మా టెన్త్ బ్యాచ్ ” ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తే వెళ్లాను “నేను, ఏమిటో విశేషాలు?. బాగా ఎంజాయ్ చేసావా? గులాబీ..బాగా… కానీ? నా మొహం లో దిగులు కనిపెట్టేసింది గులాబీ…
విషయం చెప్పు? అంది, మిత్రులంతా కష్టపడి ఏర్పాటు చేసిన సమావేశానికి ఖండఖండాల నుండీ కొందరు వస్తే, పనులు పక్కన పెట్టేసి శ్రీకాకుళం నుండీ, అమరావతి దాకా వున్న వున్న మిత్రబృందం వచ్చారు. దురదృష్టం, దగ్గరలో వున్న కొందరు రాకపోవడం బాధ అనిపించింది. అన్నా కొద్దిపాటి నిరాశ గా. నేనో మాట చెప్పనా? గులాబీ..చెప్పు… నేను. గులాబీ : చూడు, మనుషులు అందరూ ఒకలాగా వుండరు
1. వీలు లేక కొందరు రాలేక పోవొచ్చు
2. ఆసక్తి లేక కొందరు రాలేక పోవొచ్చు
3. రావాలనిపించినా కొన్ని శక్తులు కొందరిని రానివ్వక పోవొచ్చు
4. కొందరికి ఆత్మ నున్యతా భావం ఉంటుంది, కానీ స్నేహం లో ఎక్కువ, తక్కువ లు ఉండవని తెలుసుకోరు 5 బతిమాలాలాని కొందరు అనుకొంటారు, కానీ పండుగ మనది అయినప్పుడు ఎవరు బతిమాలతారు,? వచ్చి మన వంతు సాయం చేయడం, అందరితో అనుభూతులు పంచుకోవడం, మనల్ని ఇంకా పిల్లలుగా చూసే మన  గురువులు ఆశీస్సులు తీసుకోవడం ఎంత ఆనందం, అవి పొందడం అదృష్టం, పొందక పోవడం దురదృష్టం. ఏరా, ఒరేయ్ అని పిలిపించుకోవడం, పిలవడం, నువ్వు అప్పట్లో అని సరదాగా మాట్లాడు కోవడం ఎంత అనందమో, విలువ కట్ట లేముగా!
గులాబీ మాటలు మనసు ను చల్లబరిచాయి.
హితబోధ చేసిన గులాబీని ఆత్మీయంగా స్పృజించాను. గులాబీ ఎప్పటిలాగే స్వచ్ఛమైన నవ్వు నవ్వింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!